Somayajulu Musunuri
News & Analysis
Monday, 26 May 2014
ఉయ్యాలవాడ కథతో చిరు చిత్రం
Sunday, 25 May 2014
ఎవరెస్ట్ ఎక్కిన తెలుగుతేజాలు
నిజామాబాద్ జిల్లా తాడ్వాయి మండలానికి
చెందిన వ్యవసాయ కుటుంబంలో పుట్టిన మాలావత్ పూర్ణ స్వేరోస్ ఎవరెస్ట్
అధిరోహించిన అత్యంత పిన్న వయస్కురాలు. ఈ బాలిక తల్లిదండ్రులు లక్ష్మి,
దేవదాస్. 14 ఏళ్ల పూర్ణ ప్రస్తుతం ఏపీ రెసిడెన్సియల్ స్కూల్లో తొమ్మిదో
క్లాస్ చదువుతోంది. అలాగే ఖమ్మం జిల్లాచర్ల మండలం కలివేరు గ్రామానికి
చెందిన లక్ష్మి, కొండలరావు దంపతుల కుమారుడు ఆనంద్ కుమార్ కూడా ఈ టీములో
ఎవరెస్ట్ మీద అడుగు పెట్టాడు. 17 ఏళ్ల ఆనంద్ ప్రస్తుతం ఏపీ రెసిడెన్సియల్
కాలేజీలో ఫస్ట్ ఇంటర్ చదువుతున్నాడు. ఏపీ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్సియల్
సొసైటీ, ఫ్రాన్స్ అడ్వెంచర్స్ సంస్థలు సంయుక్తంగా ఈ చిన్నారులను ఎవరెస్ట్
యాత్రకు తీసుకువెళ్లింది. ప్రముఖ పర్వతారోహకుడు శేఖర్ బాబు పర్యవేక్షణలో ఈ
ఇద్దరూ యాత్రను దిగ్విజయంగా కొనసాగించారు. సొసైటీ కార్యదర్శి ఆర్ ఎస్
ప్రవీణ్ కుమార్ నేతృత్వంలో విజయవంతంగా ఎవరెస్ట్ అధిరోహించిన తెలంగాణా
ముద్దుబిడ్డలకు అన్ని వర్గాల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.http://aptopnews.com/telangana-news/642-2014-05-25-07-04-20
ఉయ్యాలవాడ కథతో చిరు చిత్రం
సంక్రాంతి సీజన్ కు రిలీజ్ అయ్యేలా ప్లాన్
చేస్తున్నారు. ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడైన చిరు- మొన్నటి ఎన్నికల్లో
కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం తర్వాత మళ్లీ సినీ కెరీర్ మీద దృష్టి
సారించారు. ఎన్నాళ్లుగానో నూటా యాభయ్యో చిత్రం మీద ఊహాగానాలున్నాయి. అయితే
ఇప్పటికి ఆ ప్రతిష్టాత్మక చిత్రానికి శ్రీకారం చుట్టబోతున్నారు. 2007లో
చిరు చివరి సారి పూర్తిస్థాయిలో ‘శంకర్ దాదా ఎంబీబీఎస్’ మూవీలో నటించారు. ఆ
తర్వాత రెండేళ్లకు ‘మగధీర’లో ఓసారి కనిపించారు. దాదాపు ఏడేళ్ల తర్వాత
పూర్తిస్థాయిలో మళ్లీ కెమెరా ముందుకొస్తున్నారు. ఇంతకీ సినిమా
ఇతివృత్తమేమిటన్నదే ఆసక్తిగా మారింది. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి బ్రిటీష్
పాలకులను ఎదిరించిన వీతరయోధుడు. కర్నూలు ప్రాంతానికి చెందిన ఈ సీమ సింహం
కర్నూలు, అనంతపురం, బళ్లారి, కడప తదితర ప్రాంతాల్లోని డెబ్బై గ్రామాలకు
సామంతరాజు. స్వాతంత్రానికి పూర్వం నిజాం నవాబు ఈ ప్రాంతాన్ని బ్రిటీష్
వాళ్లకు అప్పగించాడు. దీంతో పన్నులన్నీ బ్రిటీష్ వాళ్లు వసూలు చేసేవాళ్లు.
దీన్ని వ్యతిరేకించిన ఉయ్యాలవాడ తెల్లదొరలపై పోరాటానికి సిద్ధపడ్డాడు. సీమ
పౌరుషం చూపించి వీరోచితంగా పోరాడిన ఉయ్యాలవాడ చివరికి కొంతమంది నమ్మకద్రోహం
కారణంగా ఓటమి పాలవుతాడు. ఆ తర్వాత బ్రిటీష్ పాలకులు కర్కశంగా ఆయన్ని
ఉరితీస్తారు. దశాబ్ధాల నాటి ఈ వీరోచిత గాధను సీమ జిల్లాల్లో ఇప్పటికీ
చెప్పుకుంటారు. చిరు 150వ చిత్రం ఘనంగా తెరకెక్కాలంటే ఆయనలోని హీరోయిజాన్ని
బాగా ప్రొజెక్ట్ చేసేవిధంగా కథాబలం ఉండాలని ఉయ్యాలవాడ గాధను ఎంచుకున్నారు.
ఈ విప్లవ యోధుడి కథకు సినిమా తళుకులు అద్దుతున్నారు పరుచూరి బ్రదర్స్.
సో.. ఈ సంక్రాంతి సీజన్లో టాలీవుడ్ లో చిరు హంగామా మళ్లీ మొదలవుతుందన్న
మాట!http://aptopnews.com/life-and-style/647-150
Tuesday, 20 May 2014
బెజవాడే కొత్త రాజధాని?
‘ఆప్’ ఆమ్కే హై కౌన్!
చెడపకురా చెడేవు అన్న సామెతలా తయారైంది ఆమ్ ఆద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్ పరిస్థితి. కాంగ్రెస్ తమ ప్రధాన శత్రువంటూ పార్టీ ఆరంభించారు. అవినీతిపైనే తమ పోరాటమన్నారు. చివరికి బీజేపీని టార్గెట్ గా చేసుకుని ఎన్నికల పోరాటం సాగించారు కేజ్రీవాల్. ముఖ్యంగా బీజేపీ ప్రధాని కేండిడేట్ గా నరేంద్ర మోడీ బరిలోకి దిగిన వారణాసి నుంచే కేజ్రీవాల్ పోటీ చేయడం ఏదో మతలబుందనిపించింది. మోడీపై పోటీ చేస్తే బాగా ప్రచారం జరుగుతుందన్న ఆలోచన ఉన్నా గట్టి పోటీ ఇవ్వగలిగారు. కేజ్రీవాల్ ఈ ఎన్నికల్లో స్పాయిల్ స్పోర్ట్స్ ఆడారన్న విమర్శ ఉంది. ఢిల్లీ అసెంబ్లీ ఫలితాల్లో థర్డ్ ప్లేస్ వచ్చినా కాంగ్రెస్ మద్దతుతో సర్కారును ఏర్పాటు చేయడం.. 49 రోజుల్లోనే జెండా ఎత్తేయడం కేజ్రీవాల్ టీమ్ ను వీక్ చేసింది. కనీసం 20 పార్లమెంటు సీట్లైయినా వస్తాయన్న ఊహాగానాలునడిచాయి. చివరికి ఆమ్ ఆద్మీ పార్టీ ఉనికి నామమాత్రమే అని తేలిపోయింది. అవినీతికి వ్యతిరేకంగా ప్రజల్లో ఆలోచన రేకెత్తించిన ఘనత కచ్చితంగా కేజ్రీవాల్ దే. నిజంగానే యువత అవినీతికి వ్యతిరేకంగా కదిలారు. ఓటింగులోనూ పాల్గొన్నారు. కానీ ఆ ఓట్లన్నీ కేజ్రీవాల్ కు పడకుండా కాంగ్రెస్కు వ్యతిరేకంగా బీజేపీ ఖాతాకు జమయ్యాయి. జనంలో స్పందన కలిగించగలిగారు కానీ.. ఓట్లేసి గెలిపిస్తే ఏదైనా చేయగలరన్న భరోసా ఇవ్వలేకపోయారు. ఇదే కేజ్రీవాల్ బలహీనత. మొత్తానికి కాంగ్రెస్ పార్టీపైన జనంలో ఉన్న వ్యతిరేకతను మరింత రెచ్చగొట్టడంలో సక్సెస్ అయ్యారు. కానీ ఆమ్ ఆద్మీ పార్టీ బలం పెరగలేదు. ఆ ఓట్లన్నీ కమలం వైపు పడ్డాయి. మోడీ హవాకు ఇది తోడైంది. బీజేపీ సీట్ల సంఖ్య ఇబ్బడిముబ్బడిగా పెరిగేందుకు దోహదపడింది.http://www.aptopnews.com/
Sunday, 18 May 2014
గుజరాత్ మోడల్ గురికుదిరేనా..?
కేసీఆర్ తొలిసంతకం 15000 కోట్లు
Subscribe to:
Posts (Atom)