ముద్దు తెచ్చిన ముప్పు!
కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీ ఈమధ్య అసోం వెళ్ళినప్పుడు మహిళల భద్రత గురించి ఉపన్యాసం ఇచ్చారు. ఆడది దైర్యంగా బస్సు ఎక్కలేనప్పుడు మన దేశం సూపర్ పవర్ ఎలా అవుతుందని ప్రశ్నించారు. వరుసగా రెందేళ్ళు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా దశాబ్దాలుగా పెండింగులో ఉన్న మహిళా బిల్లును గట్టెక్కించలేకపోయడు గానీ మహిళల భద్రత గురించి మాత్రం మహా గొప్ప డయిలాగులు చెప్పడం విడ్డూరం. ఏ సభలో సంచలనం జరిగింది.. అదే కలకలం రేపింది.రాహుల్ ముచ్చట్లు విన్న కొందరు మహిళలు ఉద్వేగంతో యువనేతకు ముద్దు పెట్టారు. ఇందులో బొంతి చుటియా అనే గిరిజన మహిళ అనుమానాస్పదంగా మరణించింది. అస్సాం జోర్హాత్ జిల్లా బెకాజన్ గావ్ పంచాయత్ వార్ద్ మెంబర్గా పని చేస్తున్న బొంటి చుటియాను ఆమె భర్త సోమేశ్వర్ కాల్చి చంపినట్లు అనుమానం. తన భార్య రాహుల్ గాంధీకి ముద్దు పెట్టిన ద్రుశ్యాలు టీవీల్లో రావడంతో సోమేశ్వర్ కలత చెందాడు. దీనిపై భార్యాభర్తలకు గొడవలు అయ్యాయి. చివరికి బొంటి సజీవ దహనం అయ్యింది. వ్యవసాయం చేసుకునే సోమేశ్వర్ కూదా 60 శాతం గాయాలతో చికిస్త పొందుతున్నాడు. మొత్తానికి రాహుల్ గాంధీకి పెట్టిన ముద్దు ఓ గిరిజన కుటుంబంలో విషాదం నింపింది. అయితే రాహుల్ కి ముద్దు పెట్టిన మహిళల్లో బొంటి లేదని అధికారులు చెప్తున్నారు. సభలో ముగ్గురు నలుగురు మహిళలు రాహుల్ని చుట్టుముట్టారు. మధ్యలో ఓ గిరిజన మహిళ మాత్రం ప్రాణం పోగొట్టుకుంది. ముద్దు ముచ్చట కాదు.. ముప్పు!?
No comments:
Post a Comment