Monday 26 May 2014

ఉయ్యాలవాడ కథతో చిరు చిత్రం

మెగాస్టార్ చిరంజీవి 150 చిత్రానికి కథ సిద్ధమవుతోంది. గతంలో ‘ఠాగూర్’ సినిమాకు దర్శకత్వం వహించిన వివి వినాయక్ ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు చేపట్టనున్నారు. రాంచరణ్ స్వయంగా నిర్మించే ఈ చిత్రం కోసం ఇప్పటికే సాంకేతిక బృందాన్ని ఎంపిక చేశారని టాలీవుడ్ టాక్. రాయలసీమ విప్లవ యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితగాధ ఆధారంగా పరుచూరి బ్రదర్స్ స్క్రిప్టు రెడీ చేస్తున్నారు. చిరంజీవి బర్త్ డే రోజైన ఆగస్టు 22 న షూటింగు మొదలెడతారని సమాచారం. సంక్రాంతి సీజన్ కు రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడైన చిరు- మొన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం తర్వాత మళ్లీ సినీ కెరీర్ మీద దృష్టి సారించారు. ఎన్నాళ్లుగానో నూటా యాభయ్యో చిత్రం మీద ఊహాగానాలున్నాయి. అయితే ఇప్పటికి ఆ ప్రతిష్టాత్మక చిత్రానికి శ్రీకారం చుట్టబోతున్నారు. 2007లో చిరు చివరి సారి పూర్తిస్థాయిలో ‘శంకర్ దాదా ఎంబీబీఎస్’ మూవీలో నటించారు. ఆ తర్వాత రెండేళ్లకు ‘మగధీర’లో ఓసారి కనిపించారు. దాదాపు ఏడేళ్ల తర్వాత పూర్తిస్థాయిలో మళ్లీ కెమెరా ముందుకొస్తున్నారు. ఇంతకీ సినిమా ఇతివృత్తమేమిటన్నదే ఆసక్తిగా మారింది. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి బ్రిటీష్ పాలకులను ఎదిరించిన వీరయోధుడు. కర్నూలు ప్రాంతానికి చెందిన ఈ సీమ సింహం కర్నూలు, అనంతపురం, బళ్లారి, కడప తదితర ప్రాంతాల్లోని డెబ్బై గ్రామాలకు సామంతరాజు. స్వాతంత్రానికి పూర్వం నిజాం నవాబు ఈ ప్రాంతాన్ని బ్రిటీష్ వాళ్లకు అప్పగించాడు. దీంతో పన్నులన్నీ బ్రిటీష్ వాళ్లు వసూలు చేసేవాళ్లు. దీన్ని వ్యతిరేకించిన ఉయ్యాలవాడ తెల్లదొరలపై పోరాటానికి సిద్ధపడ్డాడు. సీమ పౌరుషం చూపించి వీరోచితంగా పోరాడిన ఉయ్యాలవాడ చివరికి కొంతమంది నమ్మకద్రోహం కారణంగా ఓటమి పాలవుతాడు. ఆ తర్వాత బ్రిటీష్ పాలకులు కర్కశంగా ఆయన్ని ఉరితీస్తారు. దశాబ్ధాల నాటి ఈ వీరోచిత గాధను సీమ జిల్లాల్లో ఇప్పటికీ చెప్పుకుంటారు. చిరు 150వ చిత్రం ఘనంగా తెరకెక్కాలంటే ఆయనలోని హీరోయిజాన్ని బాగా ప్రొజెక్ట్ చేసేవిధంగా కథాబలం ఉండాలని ఉయ్యాలవాడ గాధను ఎంచుకున్నారు. http://aptopnews.com/life-and-style/647-150

Sunday 25 May 2014

ఎవరెస్ట్ ఎక్కిన తెలుగుతేజాలు

ఇద్దరు పల్లెటూరి చిన్నారులు.. ప్రపంచంలోనే ఎత్తైన పర్వతాన్ని అధిరోహించారు. ఆ ఇద్దరూ తెలుగుతేజాలు.. అదీ తెలంగాణా గడ్డ మీద పుట్టిన చిన్నారులు కావడం గర్వకారణం. ఆదివారం ఉదయం ఎవరెస్ట్ శిఖరాగ్రాన ఈ ఇద్దరు చిన్నారులు భారత జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. 
నిజామాబాద్ జిల్లా తాడ్వాయి మండలానికి చెందిన వ్యవసాయ కుటుంబంలో పుట్టిన మాలావత్ పూర్ణ స్వేరోస్ ఎవరెస్ట్ అధిరోహించిన అత్యంత పిన్న వయస్కురాలు. ఈ బాలిక తల్లిదండ్రులు లక్ష్మి, దేవదాస్. 14 ఏళ్ల పూర్ణ ప్రస్తుతం ఏపీ రెసిడెన్సియల్ స్కూల్లో తొమ్మిదో క్లాస్ చదువుతోంది. అలాగే ఖమ్మం జిల్లాచర్ల మండలం కలివేరు గ్రామానికి చెందిన లక్ష్మి, కొండలరావు దంపతుల కుమారుడు ఆనంద్ కుమార్ కూడా ఈ టీములో ఎవరెస్ట్ మీద అడుగు పెట్టాడు. 17 ఏళ్ల ఆనంద్ ప్రస్తుతం ఏపీ రెసిడెన్సియల్ కాలేజీలో ఫస్ట్ ఇంటర్ చదువుతున్నాడు. ఏపీ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్సియల్ సొసైటీ, ఫ్రాన్స్ అడ్వెంచర్స్ సంస్థలు సంయుక్తంగా ఈ చిన్నారులను ఎవరెస్ట్ యాత్రకు తీసుకువెళ్లింది. ప్రముఖ పర్వతారోహకుడు శేఖర్ బాబు పర్యవేక్షణలో ఈ ఇద్దరూ యాత్రను దిగ్విజయంగా కొనసాగించారు. సొసైటీ కార్యదర్శి ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ నేతృత్వంలో విజయవంతంగా ఎవరెస్ట్ అధిరోహించిన తెలంగాణా ముద్దుబిడ్డలకు అన్ని వర్గాల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.http://aptopnews.com/telangana-news/642-2014-05-25-07-04-20

ఉయ్యాలవాడ కథతో చిరు చిత్రం

మెగాస్టార్ చిరంజీవి 150 చిత్రానికి కథ సిద్ధమవుతోంది. గతంలో ‘ఠాగూర్’ సినిమాకు దర్శకత్వం వహించిన వివి వినాయక్ ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు చేపట్టనున్నారు. రాంచరణ్ స్వయంగా నిర్మించే ఈ చిత్రం కోసం ఇప్పటికే సాంకేతిక బృందాన్ని ఎంపిక చేశారని టాలీవుడ్ టాక్. రాయలసీమ విప్లవ యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితగాధ ఆధారంగా పరుచూరి బ్రదర్స్ స్క్రిప్టు రెడీ చేస్తున్నారు. చిరంజీవి బర్త్ డే రోజైన ఆగస్టు 22 న షూటింగు మొదలెడతారని సమాచారం. 
సంక్రాంతి సీజన్ కు రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడైన చిరు- మొన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం తర్వాత మళ్లీ సినీ కెరీర్ మీద దృష్టి సారించారు. ఎన్నాళ్లుగానో నూటా యాభయ్యో చిత్రం మీద ఊహాగానాలున్నాయి. అయితే ఇప్పటికి ఆ ప్రతిష్టాత్మక చిత్రానికి శ్రీకారం చుట్టబోతున్నారు. 2007లో చిరు చివరి సారి పూర్తిస్థాయిలో ‘శంకర్ దాదా ఎంబీబీఎస్’ మూవీలో నటించారు. ఆ తర్వాత రెండేళ్లకు ‘మగధీర’లో ఓసారి కనిపించారు. దాదాపు ఏడేళ్ల తర్వాత పూర్తిస్థాయిలో మళ్లీ కెమెరా ముందుకొస్తున్నారు. ఇంతకీ సినిమా ఇతివృత్తమేమిటన్నదే ఆసక్తిగా మారింది. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి బ్రిటీష్ పాలకులను ఎదిరించిన వీతరయోధుడు. కర్నూలు ప్రాంతానికి చెందిన ఈ సీమ సింహం కర్నూలు, అనంతపురం, బళ్లారి, కడప తదితర ప్రాంతాల్లోని డెబ్బై గ్రామాలకు సామంతరాజు. స్వాతంత్రానికి పూర్వం నిజాం నవాబు ఈ ప్రాంతాన్ని బ్రిటీష్ వాళ్లకు అప్పగించాడు. దీంతో పన్నులన్నీ బ్రిటీష్ వాళ్లు వసూలు చేసేవాళ్లు. దీన్ని వ్యతిరేకించిన ఉయ్యాలవాడ తెల్లదొరలపై పోరాటానికి సిద్ధపడ్డాడు. సీమ పౌరుషం చూపించి వీరోచితంగా పోరాడిన ఉయ్యాలవాడ చివరికి కొంతమంది నమ్మకద్రోహం కారణంగా ఓటమి పాలవుతాడు. ఆ తర్వాత బ్రిటీష్ పాలకులు కర్కశంగా ఆయన్ని ఉరితీస్తారు. దశాబ్ధాల నాటి ఈ వీరోచిత గాధను సీమ జిల్లాల్లో ఇప్పటికీ చెప్పుకుంటారు. చిరు 150వ చిత్రం ఘనంగా తెరకెక్కాలంటే ఆయనలోని హీరోయిజాన్ని బాగా ప్రొజెక్ట్ చేసేవిధంగా కథాబలం ఉండాలని ఉయ్యాలవాడ గాధను ఎంచుకున్నారు. ఈ విప్లవ యోధుడి కథకు సినిమా తళుకులు అద్దుతున్నారు పరుచూరి బ్రదర్స్. సో.. ఈ సంక్రాంతి సీజన్లో టాలీవుడ్ లో చిరు హంగామా మళ్లీ మొదలవుతుందన్న మాట!http://aptopnews.com/life-and-style/647-150

Tuesday 20 May 2014

బెజవాడే కొత్త రాజధాని?

ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని నగరం బెజవాడేనా..? ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు బెజవాడకే ఓటేశారా..? ఆ పార్టీలోని సీనియర్ నేతలు విజయవాడ కోసం జోరుగా లాబీయింగ్ మొదలెట్టారా..? ఎన్టీఆర్ ట్రస్టు వర్గాలు అవుననే అంటున్నాయి. విజయవాడ పరిసరాల్లోనే రాజధాని అభివృద్ధి చేయాలన్న ఆలోచనతో ఉన్నారు చంద్రబాబు. గుంటూరు, విజయవాడల మధ్య భవిష్యత్తు సింగపూరుకు పునాది వేస్తే తెలుగుదేశం పార్టీకి ఇక ఢోకా ఉండబోదన్నది ఆలోచన. ఈ రెండు జిల్లాలతో పాటు ఉభయ గోదావరి జిల్లాల్లోనూ పార్టీకి తిరుగులేని ఆధిపత్యం వస్తుంది. ఈ ఎన్నికల్లో ఈ నాలుగు జిల్లాలు సైకిల్ స్పీడుకు దోహదపడ్డాయి. అయితే కొత్త రాజధాని నిర్మాణానికి ఇంకా టైమ్ ఉన్నందున బెజవాడ ప్రతిపాదనపై చంద్రబాబు సన్నిహితులతో మంతనాలు సాగిస్తున్నారు. 2019 అసెంబ్లీ ఎన్నికల నాటికి రాజధాని అంశాన్ని ప్రధాన అజెండాగా మార్చాలన్నది చంద్రబాబు ఎత్తుగడ. సీమాంధ్రను సింగపూర్ గా మారుస్తామన్న హామీతో ఈసారి ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. వచ్చే ఎన్నికల నాటికి రాజధాని అంశాన్ని తెర మీదకు తెస్తారు. అయితే రాజధాని ఎంపికపై ఇప్పటికే కేంద్ర బృందం పర్యటనలు జరుపుతోంది. ఏడెనిమిది ప్రాంతాల నుంచి ప్రతిపాదనలు వచ్చాయి. వాటి సాధ్యాసాధ్యాలను అధికార బృందం పరిశీలన జరుపుతోంది.http://www.aptopnews.com/

‘ఆప్’ ఆమ్కే హై కౌన్!


చెడపకురా చెడేవు అన్న సామెతలా తయారైంది ఆమ్ ఆద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్ పరిస్థితి. కాంగ్రెస్ తమ ప్రధాన శత్రువంటూ పార్టీ ఆరంభించారు. అవినీతిపైనే తమ పోరాటమన్నారు. చివరికి బీజేపీని టార్గెట్ గా చేసుకుని ఎన్నికల పోరాటం సాగించారు కేజ్రీవాల్. ముఖ్యంగా బీజేపీ ప్రధాని కేండిడేట్ గా నరేంద్ర మోడీ బరిలోకి దిగిన వారణాసి నుంచే కేజ్రీవాల్ పోటీ చేయడం ఏదో మతలబుందనిపించింది. మోడీపై పోటీ చేస్తే బాగా ప్రచారం జరుగుతుందన్న ఆలోచన ఉన్నా గట్టి పోటీ ఇవ్వగలిగారు. కేజ్రీవాల్ ఈ ఎన్నికల్లో స్పాయిల్ స్పోర్ట్స్ ఆడారన్న విమర్శ ఉంది. ఢిల్లీ అసెంబ్లీ ఫలితాల్లో థర్డ్ ప్లేస్ వచ్చినా కాంగ్రెస్ మద్దతుతో సర్కారును ఏర్పాటు చేయడం.. 49 రోజుల్లోనే జెండా ఎత్తేయడం కేజ్రీవాల్ టీమ్ ను వీక్ చేసింది. కనీసం 20 పార్లమెంటు సీట్లైయినా వస్తాయన్న ఊహాగానాలునడిచాయి. చివరికి ఆమ్ ఆద్మీ పార్టీ ఉనికి నామమాత్రమే అని తేలిపోయింది. అవినీతికి వ్యతిరేకంగా ప్రజల్లో ఆలోచన రేకెత్తించిన ఘనత కచ్చితంగా కేజ్రీవాల్ దే. నిజంగానే యువత అవినీతికి వ్యతిరేకంగా కదిలారు. ఓటింగులోనూ పాల్గొన్నారు. కానీ ఆ ఓట్లన్నీ కేజ్రీవాల్ కు పడకుండా కాంగ్రెస్కు వ్యతిరేకంగా బీజేపీ ఖాతాకు జమయ్యాయి. జనంలో స్పందన కలిగించగలిగారు కానీ.. ఓట్లేసి గెలిపిస్తే ఏదైనా చేయగలరన్న భరోసా ఇవ్వలేకపోయారు. ఇదే కేజ్రీవాల్ బలహీనత. మొత్తానికి కాంగ్రెస్ పార్టీపైన జనంలో ఉన్న వ్యతిరేకతను మరింత రెచ్చగొట్టడంలో సక్సెస్ అయ్యారు. కానీ ఆమ్ ఆద్మీ పార్టీ బలం పెరగలేదు. ఆ ఓట్లన్నీ కమలం వైపు పడ్డాయి. మోడీ హవాకు ఇది తోడైంది. బీజేపీ సీట్ల సంఖ్య ఇబ్బడిముబ్బడిగా పెరిగేందుకు దోహదపడింది.http://www.aptopnews.com/

Sunday 18 May 2014

గుజరాత్ మోడల్ గురికుదిరేనా..?

నూటా పాతిక కోట్ల భారతీయుల ఆశాకిరణం నరేంద్ర దామోదర దాస్ మోడీ. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం పగ్గాలందుకున్న ఈ చాయ్ వాలా ముందు భారీ లక్ష్యాలే ఉన్నాయి. భారత్ ను సూపర్ పవర్ గా తీర్చిదిద్దాల్సిన బృహత్తరమైన బాధ్యత మొదటిది. స్వతంత్ర భారతదేశంలో ఓటర్లు స్పష్టమైన ఆధిక్యం కట్టబెట్టిన తొలి కాంగ్రెసేతర ప్రభుత్వం ఇదే. ఇప్పటిదాకా ఇండిపెండెన్స్ కు ముందు పుట్టిన ప్రధానులను చూశాం. ఇప్పుడు 1947 తర్వాత అదీ ఇండియాలోనే జన్మించిన మోడీని చూస్తున్నాం. గుజరాత్ మోడల్ తో ఆయన సొంత రాష్ట్రంలో ఏదో మహాద్భుతం చేశారని జనం నమ్ముతున్నారు. అదే అభివృద్ధిని దేశమంతటికీ విస్తరిస్తారనీ ఆశిస్తున్నారు. 

కేసీఆర్ తొలిసంతకం 15000 కోట్లు

బంగారు తెలంగాణా లక్ష్యంతో కోటి రతనాల వీణ మొదటి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయబోతున్న కేసీఆర్ తొలి సంతకం విలువ ఎంతో తెలుసా..? అక్షరాలా పదిహేను వేల కోట్లు. ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చినట్లుగా లక్ష రూపాయల లోపు వ్యవసాయ రుణాలను టీఆర్ఎస్ సర్కారు మాఫీ చేస్తోంది. కేసీఆర్ ముఖ్యమంత్రి పదవి స్వీకరించగానే తొలి సంతకం ఇదే ఫైలుపై చేయనున్నారు. టీఆర్ఎస్ పార్టీకి అండదండగా నిలిచిన మాజీ ఐఏఎస్ అధికారులు ఏకే గోయెల్, రేవీ రమణాచారి, రామచంద్రుడు, రామ్ లక్ష్మణ్ తదితరులు రైతు రుణ మాఫీ ఫైలును సిద్ధం చేస్తున్నారు. దీన్ని తెలంగాణా అధికార యంత్రాంగం ఫైనల్ చేసి కేసీఆర్ ప్రమాణ స్వీకారం రోజుకు ఆయన ముందు పెట్టబోతోంది. ప్రస్తుతం తెలంగాణాలో వివిధ బ్యాంకుల్లో రైతులు తీసుకున్న పంట రుణాలు  24 వేల కోట్లకు పైమాటే. ఇందులో లక్షల రూపాయల లోపు రుణాలను టీఆర్ఎస్ సర్కారు మాఫీ చేయనుంది. దీంతో 22  వేల మంది అన్నదాతలు లాభపడతారు. ఇక ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా రైతు రుణ మాఫీ ఫైలుపైనే తొలి సంతకం చేయబోతున్నారు. తెలుగుదేశం కూడా ఈ ఎన్నికల్లో ఇచ్చిన ప్రధాన హామీ ఇదే. 2004లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పుడు ఆయన చేసిన తొలి సంతకంతో ఉచిత విద్యుత్ హామీ అమల్లోకి వచ్చింది. ఇలా తొలి సంతకం హామీలు మన నేతల్ని ఎన్నికల్లో గట్టెక్కిస్తున్నాయి. 

Saturday 17 May 2014

మోడీతో నితీష్ లడాయేంటి!

నరేంద్ర మోడీ ప్రధాని పీఠం ఎక్కే తరుణంలోనే బీహారులో రాజకీయ ముసలం రగులుకుంది. దేశంలోనే సమర్ధుడైన ముఖ్యమంత్రుల్లో ఒకరైన నితీష్ కుమార్ వికెట్ మోడీ హవాకి డౌన్ అయింది. మోడీని పీఎం గా ఏమాత్రం అంగీకరించని నితీష్ సీఎం పదవికి రాజీనామా చేశారు. తాజా ఎన్నికల్లో జేడీయూ వైఫల్యంతో ప్రత్యర్థుల నుంచి విమర్శల దాడి పెరగడమే ఆయన వైదొలగడానికి కారణం. http://www.aptopnews.com/

బీహారులో 40 పార్లమెంటు సీట్లుంటే బీజేపీ 22 స్థానాలు సొంతం చేసుకుంది. బీజేపీ మిత్రపక్షమైన రాంవిలాస్ పాశ్వాన్ పార్టీ ఎల్జేపీకి 6 సీట్లు వచ్చాయి. జేడీయూకి కేవలం రెండు స్థానాలే మిగిలాయి. ఎన్డీయేకి దూరమవడం వల్లే ఓటమి పాలయ్యామంటూ నితీష్ ప్రత్యర్థులు విమర్శలు మొదలెట్టారు. నితీష్ సీఎం పదవి నుంచి వైదొలగాలని కొందరు.. ఒకటి రెండు నెలల్లో సర్కారు పడిపోవడం ఖాయమంటూ మరికొందరు కామెంట్లు చేశారు. దీంతో మనస్థాపం చెందిన నితీష్ రాజీనామాకు సిద్ధపడ్డారు. అయితే ఈ పరిణామం వెనుక పన్నెండేళ్ల విభేదాల కథ ఉంది.     http://www.aptopnews.com/
అసలు మోడీ, నితీష్ లడాయి ఎప్పటిది..? ఇద్దరి మధ్య గొడవ ఎప్పటి నుంచీ నడుస్తోంది..? మోడీని బీజేపీ ప్రధాని కేండిడేట్ గా ప్రకటించిన తక్షణమే ఎన్డీయే కూటమి నుంచి జేడీయూ ఎందుకు వైదొలిగింది..? తాజా ఎన్నికల్లో బీహారులోని లాలూ ప్రసాద్, నితీష్ కుమార్ కోటలకు బీజేపీ ఎలా గండికొట్టింది..? మోడీ, నితీష్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనడానికి కులాల చిచ్చే కారణమా..?
మోడీ, నితీష్ కులాల చిచ్చుపై పూర్తి కథనం.. http://www.aptopnews.com/

ఆడపిల్ల.. ఆరున్నరవేల ఫొటోలు

ఫొటో అంటే చెరిగిపోని తీపిగుర్తు. జీవితంలోని ప్రతి ఘట్టాన్ని కెమెరాలో బంధిస్తే తరతరాలకూ ఆ జ్ఞాపకాలు పదిలంగా ఉంటాయి. బ్రిటన్ లో నివసిస్తున్న ఓ ప్రవాస భారతీయ కుటుంబం మనిషి జీవితంలో ఫొటోగ్రఫీకి ఉన్న ప్రాధాన్యాన్ని గుర్తించింది.http://www.aptopnews.com/

 లండన్ దగ్గరున్న కెంట్ వాసి మునీష్ బన్సల్ అక్కౌంటెంట్. తమ కుమార్తె సుమన్ బన్సల్ ప్రతి కదలికనూ కెమెరాలో ఒడిసిపట్టారు. పాప తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఆల్ట్రాసౌండ్ స్కాన్ దగ్గర నుంచే ఫొటో గ్రఫీ మొదలైంది. ఇప్పుడామెకు పద్దనిమిదేళ్లు. చిన్నారి సుమన్ చిట్టి చిట్టి అడుగులు వేసినప్పటి నుంచి ఉరుకులు పరుగుల జీవితంలో ప్రతి డెవలప్ మెంటునూ ఆ తండ్రి ఫొటోగా మార్చారు.

1996 మేలో జన్మించిన సుమన్ ఫొటోలు ఇప్పటి దాకా 6575 దాటేశాయి. సో.. మీరూ ఇలాంటి హాబీ పెట్టుకుంటే బాగుంటుందేమో ఆలోచించండి! http://www.aptopnews.com/

1652 పార్టీలకు నో ఎంపీస్

మన దేశంలో రాజకీయ పార్టీలకు కొదవ లేదు. 1687 రిజిష్టర్డ్  పార్టీలున్నాయి. అందులో 1652 పార్టీలకు ఈసారి పార్లమెంట్లో అడుగు పెట్టే చాన్సేలేకుండా పోయింది. ఇందులో జాతీయ పార్టీలుగా గుర్తింపు పొందిన బీఎస్పీ, సీపీఐ సహా  డీఎంకే, నేషనల్ కాన్ ఫరెన్స్, ఆరెల్డీ, ఎం ఎన్ ఎస్, ఏజీపీ పార్టీలున్నాయి.

ప్రస్తుతం దేశంలో  ఆరు నేషనల్ పార్టీలు , 56 స్టేట్ పార్టీలు, 1627 అన్ రికగ్నైజ్డ్ పార్టీలు ఉన్నాయి. బీజేపీ ప్రభంజనం ముందు జాతీయ పార్టీ కాంగ్రెస్ కే ప్రతిపక్ష హోదా దక్కలేదు. ఇక బీఎస్పీ, సీపీఐ ప్రాతినిధ్యం లేక పోవడం ఆశ్చర్యమే!   

Friday 16 May 2014

అమెరికాయే నమోకరిల్లుతోంది!

నరేంద్రమోడీ సాధించిన విజయం అట్లాంటి ఇట్లాంటి విజయం కాదు. అమెరికా అహం మీద చావుదెబ్బకొట్టారు. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంలో ప్రధానిగా ఎన్నికవడం ఒకెత్తయితే.. ఇన్నాళ్లూ తనకు వీసా నిరాకరించిన అగ్రరాజ్యం కూడా కదిలొచ్చి రెడ్ కార్పెట్ స్వాగతాలు చెప్పేలా చేశారు.


బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీయే అపూర్వ విజయం సాధించగానే అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా మోడీకి ఫోన్ ద్వారా శుభాకాంక్షలు చెప్పారు. తమ దేశానికి రావాలని ఆహ్వానించారు. భారత్-అమెరికా సంబంధాలతో పాటు ప్రపంచ ఆర్ధిక పరిస్థితిని మోడీతో చర్చించారు. ఇక భారత్ వెలిగిపోవడం ఖాయమన్న ఆశాభావం ఒబామా మాటల్లో కనిపించింది. గుజరాత్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మోడీ అమెరికాలో పర్యటించాలనుకుంటే వీసా నిరాకరించిన అమెరికా ఇప్పుడు కళ్లు తెరిచింది. గతంలో మూడు నాలుగు దఫాలు అగ్రరాజ్యం అహంకారంతో వ్యవహరించింది. మోడీ తన పర్యటన మానుకుని ఇక్కడి నుంచే అమెరికాలోని ఓ యూనివర్సిటీ విద్యార్థులను ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు. గోధ్రా అల్లర్లతో నరేంద్ర మోడీపై మతపరమైన ముద్ర పడింది. ఈ కారణంగానే అమెరికా ఆయనను దూరంగా పెట్టేది. ఇప్పుడా మచ్చలన్నీ చెరిగిపోతున్నాయి. వైట్ హౌసే ఎర్రతివాచీలు పరుస్తోంది.

వ్వనంలో మోడీ హిమాలయాలకు ఎందుకు వెళ్లాడు...!

 http://niharkid.blogspot.in/2014/04/blog-post_6.html

మోడీ చెప్పిన పిజ్జా కథ! 

http://niharkid.blogspot.in/2013/04/blog-post_9.html 

మోడీ వారసురాలు! 

http://niharkid.blogspot.in/2014/05/blog-post_13.html 

మోడి నెత్తిన టోపీయే! 

http://niharkid.blogspot.in/2014/05/blog-post_6.html 

 మోడీ స్టైల్ అమెరికా ట్రైనింగా..! 

http://niharkid.blogspot.in/2014/04/blog-post_3143.html 

'మోడి"ఫైడ్ స్తైల్ 

http://niharkid.blogspot.in/2014/04/blog-post_19.html 

యవ్వనంలో మోడీ హిమాలయాలకు ఎందుకు వెళ్లాడు...! 

http://niharkid.blogspot.in/2014/04/blog-post_6.html

మొసళ్ళ చెరువులో దూకిన మోడి 

http://niharkid.blogspot.in/2014/04/blog-post.html 

 

 

 

 

 

ఎవరి బలమెంత!


2014-పార్లమెంటు

 తెలంగాణా అసెంబ్లీ

 


తెలంగాణా పార్లమెంటు


ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ


ఆంధ్రప్రదేశ్ పార్లమెంటు



Thursday 15 May 2014

సెకండ్ హీరోయిన్ గా త్రిష

ఓడలు బండ్లు... బండ్లు ఓడలు కావడమంటే ఇదేనేమో! ఒకప్పుడు ఒక్క మెట్టు కూడా దిగని నటి త్రిష ఇక చేసేది లేక సెకండ్ హీరోయిన్ పాత్రకు ఓకే చెప్పేసింది. అజిత్ హీరోగా ప్రముఖ డెరెక్టర్ గౌతం మీనన్ నిర్మిస్తున్న ఓ చిత్రంలో అనుష్క ప్రధాన పాత్రలో కనిపిస్తుంది. తమిళ ముద్దుగుమ్మ త్రిష రెండో కథానాయికగా ఉంటుంది. ఇంతకీ ఈ డీల్ ఎందుకు ఒప్పుకుందంటే-  త్వరలో గౌతమ్ మీనన్ తమిళ హీరో శింబుతో మరో ప్రాజెక్టు మొదలెట్టబోతున్నారు. అందులో మెయిన్ హీరోయిన్ రోల్ త్రిషకే రిజర్వ్ చేశాడట. గతంలో శింబు, త్రిష జంటగా ‘విన్నై తాండి వరువాయా’ మూవీ హిట్టయింది. దీంతో శింబుతో చేసే ఛాన్సు కోసం అజిత్ సరసన సెకండ్ హీరోయిన్ గా నటించేందుకు త్రిష ఓకే అందిట!http://www.aptopnews.com/tv-cinema-news/cinema-news

చంద్ర బాబు ఏపీ పరీక్ష పాసవుతాడా?

చంద్ర బాబు ఏపీ పరీక్ష పాసవుతాడా?
మేధస్సు ఉపయోగిస్తే చంద్ర బాబే కాదు ఎవరైనా ఏపీ ఎన్నికల పరీక్ష పాసవుతారు!
 
ప్రస్తుత పరిస్థితుల్లో ఏపీ ఎన్నికల్లో పాసవడం అంటే రాంబాబు సీఏ పరీక్ష పాసైనంత తేలిక కాదు.

మరి చంద్ర బాబు తన మేధస్సు ఉపయోగించాడు కదా.. అనొచ్చు. మున్సిపాలిటీ, పరిషత్ ఎన్నికల్లో సీట్లు బాగానే వచ్చాయి కదా అనిపించొచ్చు! అయితే ఈ రెండు పోలింగులూ పూర్తయ్యాకే చంద్ర బాబు తన మేధస్సును ఉపయోగించాడు. బీజేపీ పొత్తు ఫైనల్ అయిందీ, పవన్ కల్యాణ్ తెలుగు దేశానికి ఓపెన్ గా మద్దతు తెలిపిందీ అప్పుడే. ఈ రెండు పరిణామాల తర్వాత టీడీపీ పరిస్థితి ఏమిటన్నది లెక్క!

  • బీజేపీ, టీడీపీ పొత్తు తో మైనారిటీలు సైకిల్ గుర్తుకు ఓటేశారా? 
  • పవన్ కల్యాణ్ మద్దతుతో కాపుల ఓట్లు బాబుకు పడ్డాయా? 
  • బీజేపీ వోట్లు టీడీపీకి  బదిలీ అయ్యాయా? 
  • చివరి నిమిషంలో కాంగ్రెస్ నుంచి వచ్చిన నాయకులే టీడీపీ అభ్యర్ధులుగా మారారు. ఈ ఫేసులను ఏపీ వోటర్లు ఆమోదించారా? 
ఈ ప్రశ్నలన్నిటికీ అవును అనే సమాధానం వస్తే టీడీపీకి 16 వ తేదీ ఫలితాలు అద్భుతంగా ఉంటాయి. కాదు అనే సమాధానం వస్తే సీట్ల లెక్క తారుమారు అవుతుంది. ఇప్పుడు ప్రశ్న మరో సారి.. చంద్ర బాబు ఏపీ పరీక్ష పాసవుతాడా? చంద్ర బాబే కాదు మేధస్సును సరైన సమయములో.. సరైన విధంగా  ఉపయోగిస్తే చంద్ర బాబే కాదు.. జగన్ బాబైనా ఏపీ ఎన్నికల పరీక్షలో పాసవుతారు. http://www.aptopnews.com

Tuesday 13 May 2014

మోడీ వారసురాలు!

నరేంద్ర మోడీ ఢిల్లీ బాట పడితే గుజరాత్ రాష్ట్ర సీఎం ఎవరన్న దానిపై చర్చ జరుగుతోంది. ఎన్నికల ప్రచారం ముగిసి ఫలితాలు రావడానికి కొంత విరామం ఉన్నందువల్ల మోడీ గుజరాత్ రాజకీయాలపై ద్రుష్టి పెట్టారు. తన వారసత్వాన్ని ఎవరి చేతుల్లో పెట్టాలన్నదానిపై సహచరులతో మంతనాలు జరుపుతున్నారు. http://www.aptopnews.com/

నాలుగేళ్ళుగా అనుకున్నట్లే సెకండ్ కమాండ్ ఆఫ్ గుజరాత్ ఆనందీ బెన్ జెతాభాయ్ పటేల్ (73) పేరు బాగా వినిపిస్తోంది. మోడీ వారసురాలు దాదాపు ఆనందీయే.

పాలనా సమర్ధత.. రాజకీయ అనుభవం,. కొన్ని వివాదాలు.. కలగలిసిన మహిళే ఆనందీ బెన్. 1941లో జన్మించిన ఆమె ప్రస్తుతం గుజరాత్ రాష్ట్ర రెవెన్యూ మంత్రి.

స్కూల్ టీచర్ నుంచి 1987లో రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. బిజేపీ మహిళా మోర్చా ప్రెసిడెంట్ గా పని చేశారు. 1994లో రాజ్య సభ ఎంపీగా.. 1994 నుంచి ఎమ్మెల్యేగా పని చేస్తున్నారు. గుజరాత్లో నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన మహిళా నేత ఆనందీ బెన్ ఒక్కరే. మోడీ సర్కార్లో డిఫాక్టో సీఎంగా పని చేస్తున్నారనే  విమర్ష ఉంది.

గుజరాత్ మెహసాన జిల్లాలోని ఓ కుగ్రామంలో రైతు కుటుంబంలో జన్మించిన ఆనందీ బెన్ ఎమెస్సీ బీఎడ్ చదివారు. టీచరుగా పనిచేస్తూ మోడీ ప్రోత్సాహంతో రాజకీయాల్లో అడుగు పెట్టారు. 1965లో భర్త మఫత్ లాల్ పటేల్ తో కలిసి అహ్మదాబాద్లో స్థిరపడిన  ఆమె అంచెలంచెలుగా పైకి ఎదిగారు.

20 ఏళ్ళ క్రితమే భర్తతో విడిపోయారు. ఆమె భర్త మఫత్ లాల్ కొంతకాలంగా మోడీ పై రాజకీయంగా పోరాటం చేస్తున్నారు. తన భార్యను రాజకీయాల్లోకి తీసుకొచ్చి తనకు కాకుండా చేశారనేది మఫత్ లాల్ ఆవేదన.  మోడీ అవినీతి పరుడంటూ మఫత్ లాల్ ఆరోపణలు చేస్తుంటారు. వాజపేయి ప్రధానిగా ఉన్నప్పుడు అనేక దఫాలు లేఖలు కూడా రాశారు. ప్రస్తుతం ఆయన ఆం అద్మీ పార్టీ లో చేరారు. భర్త చేసే ఆరోపణలే కాకుండా ఆనందీ బెన్ వ్యవహార శైలిని విమర్షించే వాళ్ళూ ఎక్కువే.

చదువుకునే వయసులోనే ఆనందీ బెన్ అనేక సాహసాలకు సిద్ధపడ్డారు. టీచరుగానూ అనేక ఆవార్డులు అందుకున్నారు. అసలు రాజకీయాల్లోకి రావడమే ఓ సాహసంతో మొదటి అడుగు పడింది. స్కూల్ టీచరుగా ఉన్నప్పుడు పిల్లలతో  కలిసి విహర యాత్రకు వెళితే నర్మద సరోవర్ డ్యాంలో ఇద్దరు అమ్మాయిలు మునిగిపోయారు. దీంతో వారి సమ్రక్షకురాలిగా ఉన్నా ఆనంది బెన్ వెంటనే నీళ్ళలోకి దూకి ఆ ఇద్దరినీ కాపాడారు. బాల్యం లోనే ఆటలు, ఇతర సామాజిక కార్య కలాపాల్లో పాల్గొన్న అనుభవం ఆమెకు గుర్తింపు తెచ్చిపెట్టింది. ఈ సాహసం గురించి తెలిసిన బీజేపీ నేతలు వెంటనే ఆమెను రాజకీయాల్లోకి అహ్వానించారనేది ఓ కధనం.

ఇప్పుడు రెండు దశాబ్ధాల అనుభవంతో గుజరాత్ లాంటి అతిపెద్ద రాష్ట్రానికి  మహిళా ముఖ్యమంత్రి రేసులో ఉన్నారు. మోదీ సర్కార్లో పేరుకు రెవెన్యూ మంత్రే అయినా ఆనందీ బెన్ మిగతా శాఖల వ్యవహారాలు కూడా సమీక్షిస్తుంటారు. అందుకే ప్రత్యర్ధులు ఆమెను డిఫాక్టో సీఎం అని వ్యంగ్యంగా అంటుంటారు. ఇప్పుడు ఆ మాటే నిజం అయ్యేట్లుగా ఉంది!    http://www.aptopnews.com/                                         

Monday 12 May 2014

ఇంట గెలవలేని ‘మౌన’మోహన్

ఇంట గెలవలేనమ్మ  రచ్చ గెలిచినట్లుంది ప్రధాని మన్మోహన్ సింగ్ పరిస్థితి. వరుసగా రెండు దఫాలుగా యూపీఏ సర్కార్లను గట్టెక్కించిన ఆయనకు విపక్షాలు ‘మౌన’మోహన్ సింగ్ అన్న బిరుదు తగిలించారు. స్వతహాగా మేధావి, ఆర్ధిక నిపుణుడూ అయిన మన్మోహన్ దేశానికి నిస్సందేహంగా సేవలందించారు. 1991లో అప్పటి ప్రధాని పీవీ నరసింహారావు అమల్లోకి తెచ్చిన ఆర్ధిక సరళీకరణ విధానాల రూపకల్పనలో మన్మోహన్ పాత్రను ఎవరూ తోసిపుచ్చలేరు. కానీ అతుకుల బొంత లాంటి యూపీఏ ప్రయోగంలో చెడంతా ఆయన ఖాతాలో పడింది. తెర వెనకుండి నడింపించిన సోనియా గాంధీ ప్లస్ పాయింట్లను సొంతం చేసుకుని.. మైనస్ పాయింట్లన్నీ సింగ్ వైపు డైవర్ట్ చేశారు. 2004 నుంచి పదేళ్ల పాటు కాంగ్రెస్ పెద్దల వైఫల్యాలకు ఆయన బాధ్యుడయ్యారు. నిందలన్నీ భరించారు.ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యే తరుణంలో ఆయన తన అధికార నివాసం ఖాళీ చేసేందుకు రెడీ అవుతున్నారు. ఇప్పటికే సెవన్ రేస్ కోర్స్ రోడ్డు లోని మన్మోహన్ నివాసంలో సర్దుడు కార్యక్రమం పూర్తయింది. వీడ్కోలుకూ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈనెల 14న సోనియా గాంధీ విందు కూడా ఇవ్వబోతున్నారు. 16న ఫలితాలు వచ్చాక ఆ మరుసటి రోజు ప్రధాని వైదొలుగుతారు. ఇంతటితో రిటైర్మెంటు తీసుకుంటున్నట్లు గతంలోనే ఆయన ప్రకటించారు. http://www.aptopnews.com

16 ఫలితం ఎలా ఉండబోతోంది..?

సోమవారం సాయంత్రం ఆరు గంటలకు దేశవ్యాప్తంగా తొమ్మిదో విడత పోలింగు ముగియగానే జాతీయ స్థాయిలో ఎగ్జిట్ పోల్ సర్వేలు వెల్లువెత్తాయి. జాతీయ న్యూస్ ఛానళ్లు నిర్వహించిన ఈ సర్వేల్లో బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ గాలి బలంగా వీస్తున్నట్లు తెలుస్తోంది. 543 స్థానాలున్న  లోక్ సభలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 272 సంఖ్యా బలం అవసరం. ఎగ్జిట్ పోల్ సర్వేల ప్రకారం మోడీ ప్రధాని అయ్యేందుకు అన్ని అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. http://www.aptopnews.com

2014 పార్లమెంటు ఎన్నికల ఫలితాలపై వివిధ ఎగ్జిట్ పోల్స్ వివరాలు...

ఇండియాటుడే - సిసెరో ఎగ్జిట్ పోల్
ఎన్డీయే 261 – 283
యూపీఏ  110 – 120
ఇతరులు  150 – 160

 
న్యూస్ ఎక్స్ – సీ ఓటరు
ఎన్డీయే  289
యూపీఏ  101
ఇతరులు 153

ఏబీపీ – నీల్సన్ సర్వే
ఎన్డీయే 272
యూపీఏ 110

ఆజ్ తక్ టీవీ
బీజేపీ 298
కాంగ్రెస్ 93
ఇతరులు  152

ఇండియా న్యూస్
బీజేపీ 315
కాంగ్రెస్ 80
ఇతరులు 148

జీ న్యూస్
బీజేపీ 299
కాంగ్రెస్ 112
ఇతరులు 132

ఇండియా టీవీ
బీజేపీ 317
కాంగ్రెస్ 104
ఇతరులు 122

ఎన్డీటీవీ ఎగ్జిట్ పోల్
బీజేపీ 283
కాంగ్రెస్ 99
ఇతరులు 161

Sunday 11 May 2014

పదిహేనేళ్లకే అబార్షన్

ముంబైలో హైస్కూలు చదువుల్లోనే శృంగార పాఠాలు అధ్యయనం చేస్తున్నారంటే కచ్చితంగా సామాజిక విపత్కరమే. ఇక పెళ్లీడు కూడా రాని ఇరవైఏళ్ల లోపు వయసులో పన్నెండు వేల మంది బాలికలు గర్భవిచ్ఛిత్తికి సిద్ధపడ్డారంటే ఆలోచించాల్సిన అంశమే.

ఏ పాపం తెలియకుండానే గర్భం దాల్చుతున్న బాలికల సంఖ్యే ఎక్కువగా ఉంటుందని అంచనా. టీనేజీ వయసులో లైంగిక వేధింపులు, బలత్కారాలు ఎదురయ్యే ప్రమాదం ఎక్కువ. ఇలాంటి దుశ్చర్యలకు బలవుతున్న పసిమొగ్గలకు ఏదీ దారి...!? http://aptopnews.com/life-and-style/589-2014-05-11-13-20-53

శింబు మనసు చంచలం!

సీరియల్ లవర్ శింబు తన ప్రేమ వ్యవహారాల గురించి కొత్త నిర్వచనం చెప్పాడు. తాను ఎంతో సిన్సియర్ గా అమ్మాయిల్ని ప్రేమిస్తున్నా.. వాళ్లే మనసు మార్చుకుంటున్నారని సెలవిచ్చాడు. 

http://www.aptopnews.com/

ప్రస్తుతం తాజా మాజీ లవర్ హన్సికతో బెంగుళూరులో షూటింగ్ జరుగుతోంది. ఈ తమిళ మూవీ సెట్ లోకి రాకముందే ఇద్దరూ లవ్ లో పడ్డారు. షూటింగ్ చివరికి వచ్చేలోగా విడిపోయారు. ఇది షూటింగ్ మీద ఎఫెక్ట్ చూపించడంతో ఈ పంచాయితీ కోలీవుడ్ నిర్మాత మండలి దాకా వెళ్లింది. చివరికి పెద్ద వాళ్లు సెటిల్ చేశారు. ఇప్పుడు ఇద్దరూ పాత ప్రేమ ముచ్చట్లు పక్కనపెట్టేసి బుద్ధిగా షూటింగ్ లో పాల్గొంటున్నారు. తాను శింబు కోసం నటించడం లేదని.. డైరెక్టర్ కోసం ఈ పనిచేయాల్సి వస్తోందని హన్సిక చెప్పింది. ఇక సీరియల్ లవర్ మాత్రం వేదాంత ధోరణిలో తన ప్రియురాళ్ల మనసులే చెంచలం అని వ్యాఖ్యానించిరు. హన్సిక కన్నా ముందు నయన తారతో ఎఫైర్ నడిపిన శింబు- అది పెళ్లి పీటల దాకా రాకుండానే ప్లేటు ఫిరాయించాడు. నయనతో మొహం మొత్తి హన్సికతో జత కలిశాడు. చివరికి ఆమెతోనూ యవ్వారం చెడింది. http://www.www.aptopnews.com/

Friday 9 May 2014

ప్రియాంక కథతో మాజీ దోస్త్ సినిమా


బాలీవుడ్ హాట్ గర్ల్ ప్రియాంకా చోప్రా సినిమాల్లోకి రాకముందు మోడలింగు చేసేది. ఆ రోజుల్లో ఆమె బాయ్ ఫ్రెండ్ గా ఉన్న అసీమ్ మర్చంట్ - ఆమె రియల్ లైఫ్ స్టోరీతో సినిమా తీయబోతున్నాడు. సల్మాన్ ఖాన్ మూవీ ‘వాంటెడ్’ లో ఓ చిన్న పాత్ర వేసిన మర్చంట్ ఆ తర్వాత సినిమా ప్రొడ్యూసర్ గా మారాడు. ఇప్పుడతని దృష్టి మాజీ గర్ల్ ఫ్రెండ్ ప్రింయాక చోప్రా మీద పడింది. ఆమె మోడలింగ్ రంగంలో ఉన్నప్పుడు జరిగిన కొన్ని ఘటనల ఆధారంగా కథ రెడీ అవుతోంది. ప్రియాంక, అసీమ్ మర్చంట్.. ఇద్దరూ రెండు మూడేళ్ల పాటు చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. అయితే ప్రియాంక నెత్తిన ‘మిస్ వరల్డ్’ కిరీటం ఎక్కగానే బాయ్ ఫ్రెండ్ కు దూరమైంది. ఇప్పుడా బాయ్ ఫ్రెండే పాత కథలు తవ్వితీసి తెరకెక్కించబోతున్నాడని సమాచారం.http://www.aptopnews.com

Wednesday 7 May 2014

80 శాతం ఎవరికి లాభం?

డివైడెడ్ ఆంధ్రప్రదేశ్ కు యునైటెడ్ గా జరుగుతున్న  ఎన్నికల్లో పోలింగు ఘట్టం ముగిసింది. తెలంగాణాతో పోల్చితే పోలింగు శాతం పెరిగిందని ఎన్నికల అధికారులు సంబరపడుతున్నారు. 80 శాతం పోలింగు సాధించేందుకు అధికారులు నానా తంటాలు పడ్డారు. అయితే ఇంత భారీ పోలింగు ఎవరికి లాభం...? ఏ పార్టీ విజయావకాశాలను పెంచుతుంది...? సీమాంధ్రలో తమ గాలే వీస్తోందన్న ధీమాతో ఉన్న  పార్టీకి ఈ పర్సంటేజ్ నష్టం తెస్తుందా..? ఓటింగు శాతం పెరగకుండా ఫలానా పార్టీ జనాన్ని భయభ్రాంతులకు గురిచేసిందని చక్రం తిప్పే ఓ బడా నేత ఎందుకు ఆరోపించారు...?
అధికారులు ఆశించినట్లే అటూఇటూగా 80 శాతం లెక్క తేలింది. ఇక అధినేతలకు మెజారిటీల గుబులు పట్టుకుంది. సీమాంద్ర సీఎం కుర్చీ మీద కన్నేసిన టీడీపీ, వైసీపీ అధినేతలు సీట్ల లెక్కల్లో మునిగిపోయారు. 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మెజారిటీ చోట్ల ఆధిక్యాలు చాలా స్వల్పంగా ఉంటాయన్నది అంచనా. పోటీ టీడీపీ, వైసీపీల మధ్యే కొనసాగింది. కాంగ్రెస్ అభ్యర్థులు నామమాత్రమే. http://www.aptopnews.com/seemandhra-news/576-80

ఓటరు దేవుళ్లను ప్రసన్నం చేసుకోవడానికి మన నాయకులు ఎన్నోరకాలుగా ప్రయత్నించారు. నానా పాట్లు పడ్డారు. ఇంతకీ ఈ దేవుడు ఎవరిని కరుణించాడో.. ఎవరిని పీఠం ఎక్కిస్తాడో!

అతడు.. ఆమె.. తొలి వోటు!

స్వతంత్ర భారతదేశంలోని తొలి వోటరు శ్యాం శరణ్ నేగీ 30వ సారి వోటు హక్కు  వినియోగించుకున్నాడు. 97 ఏళ్ళ వయసులోనూ ఏమాత్రం ఉత్సాహం తగ్గలేదు.

http://www.aptopnews.com/
తన భార్య 92 ఏళ్ళ హీరా మణి తో కలిసి ఉదయం 6.55 కే పొలింగ్ బూత్ ముందు నిలుచున్నాడు. అందరికన్నా ముందుగా వోటు వేసి తనలో 46 ఏళ్ళుగా ఉన్న ప్రజా స్వామ్య స్పూర్తిని మరోసారి చాటుకున్నడు. 1952 ఫిబ్రవరిలో  స్వతంత్ర భారతదేశంలో తొలి సారి ఎన్నికలు జరిగితే నేగీ సొంత రాష్ట్రమైన హిమాచల్ ప్రదేశ్ లో 3 నెలల ముందుగానే  1951 అక్టోబర్లో పోలింగ్ నిర్వహించారు. అప్పట్లో చిన్ని పేరుతో ఉన్న ప్రస్తుత కిన్నౌర్ నియోజక వర్గంలో నేగీయే తొలి వోటరు. ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా 1975లో రిటైర్ అయిన నేగీ ఇప్పటి దాకా 17 పార్లమెంట్(ఒకసారి ఉప ఎన్నిక), 13 అసెంబ్లీ ఎన్నికల్లో వోటు వేశాడు. తన భార్య కూడా ఏనాడు వోటు వేయడం మరువదు. దేశంలోని తొలి వోటరుగా గుర్తింపు పొందిన శ్యాం శరణ్ నేగీ  తో 2014 ఎన్నికల కోసం ఓ ప్రచార చిత్రం రూపొందించారు. ఆ వీడియోను నెటిజనులు  బాగా ఆదరించారు. సెంచరీకి చేరువలో ఉన్నా నవ యువకుడిలా లయిన్లో నిలబడి వోటు వేసిన నేగీకి... ఆయన సతీమణి హీరా మణికి  నూటా ముప్పై కోట్ల భారతీయులూ  అభినందనలు తెలపాల్సిందే...! http://www.aptopnews.com/  

Tuesday 6 May 2014

థ్రిల్లివ్వని ‘అనామిక’


విద్యాబాలన్ ప్రెగ్నెంట్ క్యారెక్టర్తో హిందీలో తీసిన ‘కహానీ’ మూవీ దేశవ్యాప్తంగా హిట్టయింది. ఇదే సినిమాను కొన్ని మార్పులతో తెలుగు, తమిళ భాషల్లో రీమేక్ చేశారు డైరెక్టర్ శేఖర్ కమ్ముల. తన టేస్టుకు భిన్నంగా ఈ ప్రాజెక్టు చేపట్టిన శేఖర్ కమ్ముల సినిమాను ఆసక్తిగా మలచేందుకు చాలా కసరత్తు చేశారు. చిన్న వారితో సినిమాలు చేసే ఈ డైరెక్టర్ మొదటిసారి నయనతార లాంటి పెద్ద హీరోయిన్ ను ఎంచుకున్నారు. ‘కహానీ’లో విద్యాబాలన్ గర్భవతిగా ఉండడమే కథకు బలం. ఆమె పాత్రపై సానుభూతి వచ్చింది. ‘అనామిక’లో నయనతారను ప్రెగ్నెంట్ వుమెన్ గా చూపించలేని శేఖర్ కమ్ముల.
http://www.aptopnews.com 

సెకండ్ హీరోయిన్ గా త్రిష

ఓడలు బండ్లు... బండ్లు ఓడలు కావడమంటే ఇదేనేమో! ఒకప్పుడు ఒక్క మెట్టు కూడా దిగని నటి త్రిష ఇక చేసేది లేక సెకండ్ హీరోయిన్ పాత్రకు ఓకే చెప్పేసింది. అజిత్ హీరోగా ప్రముఖ డెరెక్టర్ గౌతం మీనన్ నిర్మిస్తున్న ఓ చిత్రంలో అనుష్క ప్రధాన పాత్రలో కనిపిస్తుంది. తమిళ ముద్దుగుమ్మ త్రిష రెండో కథానాయికగా ఉంటుంది. ఇంతకీ ఈ డీల్ ఎందుకు ఒప్పుకుందంటే-  త్వరలో గౌతమ్ మీనన్ తమిళ హీరో శింబుతో మరో ప్రాజెక్టు మొదలెట్టబోతున్నారు. అందులో మెయిన్ హీరోయిన్ రోల్ త్రిషకే రిజర్వ్ చేశాడట. గతంలో శింబు, త్రిష జంటగా ‘విన్నై తాండి వరువాయా’ మూవీ హిట్టయింది. దీంతో శింబుతో చేసే ఛాన్సు కోసం అజిత్ సరసన సెకండ్ హీరోయిన్ గా నటించేందుకు త్రిష ఓకే అందిట!

మోడి నెత్తిన టోపీయే!



Monday 5 May 2014

సట్టాబజార్ హాట్ ఫేవరెట్ ?




2014 ఎన్నికల ఖర్చు లక్ష కోట్లు
సట్టాబజార్ బెట్టింగులే 60 వేల కోట్లు
ఎన్నికలపై పందెంరాయుళ్ల అమితాసక్తి 
దివాళా తీస్తున్న వేల కుటుంబాలు 
అభ్యర్థుల ఖర్చుకన్నా బెట్టింగులే ఎక్కువ
ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంలో టోటల్ ఎన్నికల వ్యయమెంతో తెలుసా..? అక్షరాలా లక్ష కోట్లు! అంటే దేశంలోని మూడొంతుల రాష్ట్రాల్లో వార్షిక బడ్జెట్ కన్నా ఎక్కువ. నిన్న మొన్నటి దాకా ఏపీ బడ్జెట్ లక్ష కోట్లే. అంటే మన ఓటును పచ్చనోటే నడిపిస్తోంది. సంక్రాంతి పండగొస్తే కోడిపందేలు. క్రికెట్ సీజనొస్తే బెట్టింగు. ఈ విషసంస్కృతి మన ఎన్నికల వ్యవస్థనూ గుర్రండెక్కలా అల్లుకుంటోంది. ప్రస్తుత ఎన్నికల్లో సట్టాబజార్ లావాదేవీలు అరవై నుంచి డైబ్బై వేల కోట్లని సమాచారం. 
ఎలక్షన్ హెడ్ క్వార్టర్ ముంబై సట్టాబజార్http://www.aptopnews.com