Thursday 15 May 2014

చంద్ర బాబు ఏపీ పరీక్ష పాసవుతాడా?

చంద్ర బాబు ఏపీ పరీక్ష పాసవుతాడా?
మేధస్సు ఉపయోగిస్తే చంద్ర బాబే కాదు ఎవరైనా ఏపీ ఎన్నికల పరీక్ష పాసవుతారు!
 
ప్రస్తుత పరిస్థితుల్లో ఏపీ ఎన్నికల్లో పాసవడం అంటే రాంబాబు సీఏ పరీక్ష పాసైనంత తేలిక కాదు.

మరి చంద్ర బాబు తన మేధస్సు ఉపయోగించాడు కదా.. అనొచ్చు. మున్సిపాలిటీ, పరిషత్ ఎన్నికల్లో సీట్లు బాగానే వచ్చాయి కదా అనిపించొచ్చు! అయితే ఈ రెండు పోలింగులూ పూర్తయ్యాకే చంద్ర బాబు తన మేధస్సును ఉపయోగించాడు. బీజేపీ పొత్తు ఫైనల్ అయిందీ, పవన్ కల్యాణ్ తెలుగు దేశానికి ఓపెన్ గా మద్దతు తెలిపిందీ అప్పుడే. ఈ రెండు పరిణామాల తర్వాత టీడీపీ పరిస్థితి ఏమిటన్నది లెక్క!

  • బీజేపీ, టీడీపీ పొత్తు తో మైనారిటీలు సైకిల్ గుర్తుకు ఓటేశారా? 
  • పవన్ కల్యాణ్ మద్దతుతో కాపుల ఓట్లు బాబుకు పడ్డాయా? 
  • బీజేపీ వోట్లు టీడీపీకి  బదిలీ అయ్యాయా? 
  • చివరి నిమిషంలో కాంగ్రెస్ నుంచి వచ్చిన నాయకులే టీడీపీ అభ్యర్ధులుగా మారారు. ఈ ఫేసులను ఏపీ వోటర్లు ఆమోదించారా? 
ఈ ప్రశ్నలన్నిటికీ అవును అనే సమాధానం వస్తే టీడీపీకి 16 వ తేదీ ఫలితాలు అద్భుతంగా ఉంటాయి. కాదు అనే సమాధానం వస్తే సీట్ల లెక్క తారుమారు అవుతుంది. ఇప్పుడు ప్రశ్న మరో సారి.. చంద్ర బాబు ఏపీ పరీక్ష పాసవుతాడా? చంద్ర బాబే కాదు మేధస్సును సరైన సమయములో.. సరైన విధంగా  ఉపయోగిస్తే చంద్ర బాబే కాదు.. జగన్ బాబైనా ఏపీ ఎన్నికల పరీక్షలో పాసవుతారు. http://www.aptopnews.com

1 comment:

hari.S.babu said...

చివరి నిమిషంలో కాంగ్రెస్ నుంచి వచ్చిన నాయకులే టీడీపీ అభ్యర్ధులుగా మారారు.
>ఇదే అతని కొంప ముంచవచ్చు!భాజపా కి ఆంధ్రాలో మంచి మైలేజీ ఉందని పొరబడి వాళ్లకి కట్టబెట్టిన సీట్లు కూడా కలిస్తే సైకిలు తుక్కు సామాన్ల షాపుకే ఇక!!