Thursday 28 February 2013

పచ్చని ప్రకృతి... వందేళ్ల జీవితం

 ఆరు తరాలను చూసిన బామ్మ
మనచుట్టూ పచ్చదనముంటే మనమూ కలకాలం పచ్చగా ఉంటాం. తమిళనాడులోని ఊటీకి దగ్గరున్న కుగ్రామం పుడుముండులో రుజ్జం అనే అవ్వ ఇలాగే ఆరుతరాలను చూసిందిట. ఇంత వయస్సొచ్చినా రుజ్జం ఎప్పుడూ చలాకీగా ముని ముని ముని మనవళ్లతో ఆడుకుంటూ ఉంటుంది. ఈ బామ్మలకే బామ్మకి 110 ఏళ్లు నిండాయని లెక్క. తోడా అనే ఓ గిరిజన తెగకు చెందిన ఈ కుటుంబం ఆరోగ్యంగా ఉండడంలో రహస్యమేంటో తెలుసా... ప్రకృతిని ప్రేమించడం. ఆరు తరాల్లో 230 మంది సభ్యులున్న ఈ మహా కుటుంబంలో రుజ్జం దగ్గర నుంచి నిన్నామొన్నటి పసిగుడ్డు దాకా అందరి ఆహార అలవాట్లు మంచివి. 
సెల్ ఫోన్ లో మాట్లాడుతున్న 110 ఏళ్ల రుజ్జం

 బామ్మ మాట... బంగారు బాట

  • కృత్రిమ ఆహార పదార్ధాల జోలికి వెళ్లకపోవడం
  • చిప్స్, ఛాట్లు, నూడిల్స్ ఇలాంటివేవీ తినకపోవడం.
  • రాగుల జావ, సజ్జ సంగటి, జొన్న అంబలి, పల్చటి మజ్జిగ ప్రధాన ఆహారమం
  • వెన్న, తేనె, నెయ్యి విరివిగా వినియోగించడం
  • తాజా పండ్లు, కూరగాయలే ఆహారం
  • పల్లె పెరట్లో దొరికే ప్రతి ఆకు కూరా అమృతమే
  • ప్రకృతిని ప్రేమించడం, మూగజీవాలను చేరదీయడం
  • సదాలోచనలతో పొద్దుపుచ్చడం
  • తోటి వారికి తోడూనీడగా ఉండడం
  • పొలం పనులతో సహా అన్నీ సొంతగానే చేసేసుకోవడం
  ఇవీ రుజ్జుం ఆరోగ్యకరమైన సుదీర్గ జీవనానికి ఉపయోగపడుతున్న అలవాట్లు. ఆచరించేందుకు మనకూ మార్గాలున్నాయి. ప్రకృతిని మనం భక్షించకుండా ఉంటే అది మనల్ని రక్షిస్తుంది.

ఆంధ్రప్రదేశ్ లో 'చీకటి' రాజ్యం!

పల్లె నుంచి పట్నం దాకా పవర్ 'కట్'కట

ఈ చీకటి విడిపోదేమి...



@ ఆంధ్రప్రదేశ్ లో పవర్ కట్ సీజన్ మొదలు

@ హైదరాబాద్, తిరుపతి, విశాఖపట్నం, వరంగల్ రోజూ 2 గంటలు


@ అన్ని జిల్లా కేంద్రాలు, కార్పొరేషన్లలో రోజూ 4 గంటలు


@ పట్టణాలు, మున్సిపాలిటీల్లో రోజు 6 గంటలు


@ మండల కేంద్రాల్లో రోజు 8 గంటలు


@ గ్రామాల్లో రాత్రి 6 దాటాకే విద్యుత్ సరఫరా


@ పల్లెల్లో తెల్లవారాక 6 దాటితే పవర్ కట్


@ వ్యవసాయానికి భారీగా కోతలు

2016లో టైటానిక్ 2

థ్రిల్లింగ్ జర్నీకి అడ్వాన్స్ బుక్కింగ్స్

పసిఫిక్ మహా సముద్రంలో సరిగ్గా నూటా ఒక్కేళ్ల క్రితం మునిగి పోయింది ప్రపంచంలోనే అతిపెద్దదైన ఓడ టైటానిక్. విలాసానికి ఇది అసలుసిసలు చిరునామా. బ్రిటన్లోని సౌంతాప్టన్ తీరం నుంచి అమెరికాలోని న్యూయార్క్ కు బయలుదేరిన టైటానిక్ అర్దరాత్రి వేళ  సముద్ర జలాల్లోని ఓ భారీ మంచు శకలం ఢీకొని మునిగిపోయింది. టైటానిక్ సినిమా చూశాక గానీ దాని గురించి మనకు పెద్దగా తెలియలేదు. అయితే ఆ సినిమా చూశాక టైటానిక్ లాంటి మహాద్భుత ఓడలో విహరించాలని చాలా మందే అనుకుని ఉంటారు. అలాంటి వారి కోసమే టైటానిక్ 2 షిప్ రెడీ అవుతోంది.

టైటానిక్ నమూనా నా సొంతం...!

     ఆస్ట్రేలియాకు చెందిన బిలియనీర్ క్లైవ్ పామర్ ఈ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టాడు. 2016 లో ఇది సిద్ధమవుతుంది. యూరప్ ఇంజనీర్లు డిజైనింగ్ చేస్తే  చైనాలో ప్రభుత్వ షిప్పింగ్ కంపెనీ దీన్ని తయారు చేస్తోంది. ఎంత ఖర్చవుతుందన్నది తెలియదు గానీ ఇందులో ప్రయాణించడానికి అప్పుడే బుకింగ్స్ మొదలయ్యాయిట. ఇప్పటికే 40 వేల మంది టిక్కెట్లు కొనేసుకున్నారు. ప్రమాదానికి గురైన నాడు ఒరిజినల్ టైటానిక్ ప్రయాణించిన సౌంతాప్టన్ నుంచి న్యూయార్క్ వరకూ టైటానిక్ 2ను నడుపుతారట. టిక్కెట్ కు పది లక్షలు పెట్టి ఔత్సాహికులు అడ్వాన్స్ బుకింగ్ చేసుకుంటున్నారు. ఆనాటి ట్రాజడీని గుర్తుచేసకుంటూ సరికొత్త థ్రిల్లింగ్ అనుభవించాలనుకునే వారు క్లైవ్ పామర్ అడ్రస్ కనుక్కోండి.


తానా గ్లోబల్ సైన్స్ ఫెయిర్

విద్యార్థుల్లో విజ్ఞాన శోధన

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికితీసేందుకు తానా చేపట్టిన గ్లోబల్ సైన్స్ ఫెయిరుకు విశేష స్పందన వచ్చింది. ఆస్ర్టేలియా, అమెరికా, కెనడా, కువైట్, బెహ్రయిన్,  శ్రీలంకల్లో నివాసం ఉంటున్న తెలుగు విద్యార్థులు తమ ప్రతిభాసక్తులను ఇందులో ప్రదర్శిస్తున్నారు. సైన్స్ పట్ల తమకున్న ఆసక్తిని, ప్రయోగశీలతను ప్రదర్శించడానికి ఇది అంతర్జాతీయ వేదికగా తోడ్పడుతోందంటున్నారు కార్యక్రమ చైర్మన్ వి. రాజేష్, తానా అధ్యక్షుడు తోటకూర ప్రసాద్. 

 

వివిధ దేశాల్లో మొదటి దశలో వెయ్యి ప్రాజెక్టులు... వీటిలోంచి రెండో దశలో 180 ప్రాజెక్టులు ఎంపిక చేశారు. 11 సైన్స్  విభాగాల్లో 6 నుంచి 8 క్లాసుల విద్యార్థులు జూనియర్లుగా, 9 నుంచి 12 క్లాసుల వాళ్లు సీనియర్లుగా పోటీ నిర్వహిస్తున్నారు. సెమీ ఫైనల్స్లో ఎంపిక చేసిన ప్రాజెక్టులను మార్చి 31న ప్రకటించనున్నారు. అలాగే మే 24 నుంచి 26 వరకూ డాలన్లో జరిగే తానా సభల్లో ఫైనల్స్ పోటీలుంటాయి. ఈ గ్లోబల్ సైన్స్ ఫెయిర్కు తానాతో పాటు ఈనాడు, ఈటీవీ భాగస్వామిగా వ్యవహరిస్తోంది.

పైసా ఆనా... జానా !

సామాన్యుడి సణుగుడు

పట్టుమని జత బట్టలైనా పట్టని ఓ చిన్న సూట్ కేసులో సుమారు 16 లక్షల కోట్ల ఖర్చుకు లెక్కలేసిన కాగితాలు మోసుకొచ్చారు చిదంబరం. ఆ అంకెల గారడీ సమాన్యుడికేమీ అర్ధం కాదు గానీ, ఏ వస్తువు ధర పెరుగుతుంది... ఏది తగ్గుతుందనేది ముఖ్యం. 'ప్రపంచాన్ని కుదిపేస్తున్న ఆర్ధిక మందగమనం నుంచి బయట పడాలంటే 'సంస్కరణ'ల బాటపట్టక తప్పదు. అలాగని 'సంక్షేమం' పట్టదనుకోలేం. ద్రవ్యోల్బణం అదుపు చేస్తూ... ద్రవ్యలోటును అధిగమిస్తూ... సర్కారు ఖర్చును తగ్గిస్తూ... ఎలాగోలా ఖాళీ అయిన ఖజానాను నింపేందుకు 'పరోక్ష పన్నుల' మార్గాన్నెంచుకున్నారు ఆర్ధిక మంత్రి చిదంబరం. 

 

ఏ ఏ రంగాలపై చల్లని చూపు

  • మహిళా సంక్షేమానికి వెయ్యికోట్లతో 'నిర్భయ' నిధి
  • మహిళల కోసం త్వరలో వెయ్యికోట్లతో ప్రత్యేక బ్యాంకు
  • యువతకు నైపుణ్య శిక్షణ కేంద్రాలు, ఉపాధి అవకాశాల పెంపు
  • పిల్లల్లో పౌష్టికాహార లోపం నివారణకు పథకం
  • ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సబ్ ప్లాన్లకు దండిగా నిధులు
  • ఎల్ఐసీ విస్తరణ, పోస్టాఫీసుల్లో బ్యాంకింగ్ సేవలు
  • చేనేత కార్మికులకు తక్కువ వడ్డీ రుణాలు
  • టీచర్లు, అంగన్వాడీ వర్కర్లు, ఎస్ హెచ్ జీ సభ్యులకు గ్రూప్ ఇన్య్సూరెన్స్

వేతన జీవుల మాటేంటి...

  • ఉద్యోగుల ఆదాయంపై పన్ను రాయితీ లిమిట్ రూ. 2.20లక్షలు
  • మిగతా స్లాబులు యధాతథం
  • ఐదులక్షలలోపు ఆదాయం ఉంటే రూ. 2 వేల పన్ను రాయితీ
  • గృహరుణంపై వడ్డీకి పన్ను మినహాయింపు రూ. 2.50లక్షలు

పెరిగేవి...

  1. వెండి నగలు, వస్తువులు
  2. సిగరెట్లు, టొబాకో ప్రొడక్ట్స్
  3. రూ.2 వేలు దాటిన మోబైల్ ఫోన్లు
  4. 800 సీసీ మోటార్ బైకులు
  5. విలాసవంతమైన కార్లు
  6. డీటీహెచ్, సెట్ టాప్ బాక్సులు
  7. ఏసీ బార్లలో సర్వీసులు
  8. మార్బుల్ పలకలు

తగ్గేవి...

  1. చేనేత, నూలు వస్త్రాలు
  2. రెడీమేడ్ దుస్తులు
  3. చేనేత తివాచీలు
  4. లెదర్ వస్తువులు... చెప్పులు, బెల్టులు, బ్యాగులు

   

Wednesday 27 February 2013

బడ్జెట్ బాతాఖానీ

చిదంబరం పెట్టెలో ఏముంది?

బడ్జెట్ అంటే రానున్న 365 రోజుల్లో మనం ఏమేమి ఖర్చులు పెట్టబోతున్నాం, దేనికెంత వెచ్చించాలన్న లెక్కాపద్దూ. చిదంబరం కసరత్తంతా పూర్తి చేసి కాగితాలు పెట్టెలో సర్దేసుకున్నారు. 28న లోక్ సభలో తెరుస్తారు. అయితే అందులో ఏముంటుందనేదే ఆసక్తి. 130 కోట్ల భారతీయులందరి తలరాత రాసేది చిదంబరం. కానీ ఆయన లెక్కాపద్దుల పుస్తకం గురించి ఆలోచించే తీరిక సగటు పౌరుడికి లేకుండాపోయింది.

ఎన్న సారువాడూ... ఏమిదా తెస్తివి?

 

      ఆర్ధిక సర్వే ఏం చెప్తోంది?

బడ్జెట్ సమర్పించడానికి ముందురోజు ఆర్ధిక సర్వే పార్లమెంటు ముందు పెట్టారు. ఆర్ధిక రంగం మందగమనం చాలించి పురోగమనం దిశగా సాగుతోందిట. ఇక వేగవంతమవడం ఖాయమంటారు మన మంత్రిగారు. సామాన్యుడి బతుకులు చూస్తుంటే ఇందులో ఏ మాత్రం నిజం లేదనిపిస్తుంది. సబ్సిడీలకు స్వస్తిపలకండి, పన్నుల మోత మోగించి ద్రవ్యలోటును పూడ్చుకోండి, సంస్కరణల పేరుతో ఆర్ధిక పొదుపు పాటించండి, ఖజానా ఖాలీచేస్తున్న సర్కారీ ఖర్చులు తగ్గించుకోండి... ఇలా సాగిపోయింది సర్వే లెక్క.

      2014 ఎన్నికలే టార్గెట్...సంక్షేమమనే బ్రాండ్

యూపీఏ 2 సర్కారు యూపీఏ 3గానూ కొనసాగాలంటే 2014 ఎన్నికల్లో పెద్ద గండమే గట్టెక్కాలి. డీజిల్ ధరల బాదుడు, ఎల్పీజీ సిలిండర్లపై పరిమితులు, నిత్యావసరాల రేట్లు మండిపోవడం, మహిళలపై హింసాకాండ... ఇలా సామాజిక, ఆర్ధిక సమస్యల చిట్టా చాలా పెద్దది. వీటన్నిటినీ అధిగమించి ఓటర్లను సమ్మోహన పరిచే అస్త్రం మన్మోహన్ సింగ్ దగ్గరైతే లేదు. అంతా టెన్ జన్ పథ్ నుంచి మేడమ్ ఆడించే గారడీయే. ఆహారం, ఎరువుల సబ్సిడీల్లో కోత పెట్టాలనేది ఆలోచన. గరీబుకు, రైతన్నకు ఇది దెబ్బే. రైల్వేకి బడ్జెటరీ సాయాన్ని బాగా తగ్గించేశారు. రక్షణ శాఖకు అరకొరగా విదులుస్తారు. అన్నీ ఉండి పాకిస్థాన్, చైనా లాంటి దేశాలకు భయపడాల్సిన పిరికితనం. ఇక రక్షణ శాఖ ఖజానా డొల్లగా మారితే దేశ సార్వభౌమత్వం ఏమిగాను? సంక్షేమమనే బ్రాండ్ వేసినా ఆచుతూచి ఖర్చుపెట్టుకోవాలని ప్రణాళిక సంఘం ముందునుంచే నూరిపోస్తోంది.

      ప్రభుత్వ రంగానికి విఘాతమే...

ప్రభుత్వ రంగ పరిశ్రమల్లో పెట్టుబడులను ఉపసంహరించేసి చకచకా ప్రైవేట్ వ్యక్తులకు ధారాదత్తం చేసే పని ఊపందుకుంటోంది. 40 వేల కోట్ల రూపాయల సర్కారు షేర్లను అమ్మేయాలన్నది లక్ష్యం. ఇలా ఒక్కోటీ ప్రయివేటీకరించేశాక సర్కారు వ్యవస్థ కేవలం సేవారంగానికే పరిమితమవుతుంది. కీలకమైన ఉత్పాదక, నిర్మాణ రంగాల నుంచి చేతులుదులుపుకుంటుంది.

      టాక్స్ నెట్ చాలా పెద్దది!

      పన్నులు పెంచడం లేదంటూనే పరోక్షంగా ముక్కు పిండి వసూలు చేసే టెక్నిక్కులు ఇటలీమాత దగ్గర పుష్కలంగా ఉన్నాయి. మరింత మందిని పన్ను పరిధిలోకి లాగేసేయండని ఆర్ధిక సర్వే కూడా పురిగొల్పింది

డ్జెట్ లైన్స్... 

  • డీజిల్, ఎల్పీజీల రేట్లు పెంచాలనుకుంటున్నారు.
  • సిమెంట్ మీద సుంకం పెంచితే ఇళ్లు కట్టి చూడటం కష్టసాధ్యమే.
  • బంగారు నగల మీద పన్ను మోత తప్పేట్లు లేదు.
  • చిన్న కార్లమీద జీవిత పన్ను 12 శాతం నుంచి 10 శాతానికి తగ్గించాలంటోంది ఆటోమోబైల్ రంగం
  • డీజిల్ వాహనాలు, రవాణా వాహనాల మీద సుంకం పెంచే ఛాన్స్
  • లెవీ, టాక్స్ భారం తగ్గించాలంటూ టెలికాం రంగం ఒత్తిళ్లు
  • పన్ను రాయితీలడుగుతున్న ఐటీ సెక్టర్
  • ప్రోత్సాహకాలు కోరుతున్న గృహ నిర్మాణ రంగం
  • రిటైల్ రంగం నుంచి పన్ను మినహాయింపు ఒత్తిళ్లు



Monday 25 February 2013

KIDS NEWS: Maha Kumbhmela Maghapoorinima





















త్రివేణి సంగమంలో మాఘ పౌర్ణమి శోభ

అలహాబాద్ మహా కుంభమేళా త్రివేణి సంగమం భక్త జన సంద్రంలా మారింది. మాఘ పౌర్ణమి సందర్భంగా కోటిన్నర మంది భక్తులు త్రివేణి సంగమంలో పవిత్ర సా్ననాలు ఆచరించారు. మౌని అమావాస్య రోజుల మూడున్న కోట్ల మంది రావడంతో తిరుగు ప్రయాణంలో రైల్వే స్టేషన్లో తొక్కిసలాటకు కొందరు దుర్మరణం పాలయ్యారు. దీన్నిదృష్టిలో ఉంచుకుని ఈసారి అదనపు భద్రతా చర్యలు చేపట్టారు.  

Sunday 24 February 2013

KIDS NEWS: CHINA Lanthern Festival

చైనాలో దీపాల ఉత్సవం

చైనాలో చంద్రమాన సంవత్సరం మొదలైంది. కాలెండర్ ఇయర్ ప్రారంభమైన పదిహేనో రోజున లాంతర్ ఫెస్గివల్ నిర్వహించడం అక్కడ ఆనవాయితీ. మన దీపావళి లాగా ఈ ఉత్సవం దీప కాంతులతో తళుకులీనుతుంటుంది. అయితే లాంతర్లను ఆకాశంలోకి వదలడం ఈ ఉత్సవాల ప్రత్యేకత. వేల దీపాల కాంతులతో గగనతలం కొత్త శోభతో కళకళలాడుతుంటే చూసేందుకు వేల కన్నులున్నా చాలవు.






 

KIDS NEWS: Anjanagiri Brahmostavalu

బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం

మముబ్రోవ కదలివచ్చితివా... దేవదేవా...


ఇది ఇలవైకుంఠపురమే...


పెరుమాళ్లు కొలువైన దివ్యధామమిదిగో..

నిను కొలుచు భాగ్యం ఈ జన్మలో...


నను బ్రోవమని చెప్పవే... సీతమ్మతల్లీ...


దివ్య మంగళ స్వరూపం

అంజనగిరి శ్రీవేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవం
మహబూబ్ నగర్ జిల్లా ఖిల్లా ఘన్ పూర్ మండలం అంజనగరిలో వెలిసిన శ్రీలక్ష్మీ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. 21న క్షీరాభిశేకంతో మొదలైన ఉత్సవాలు 23న కల్యాణోత్సవం, 25న రాత్రి రథోత్సవం, 26న ధ్వజావరోహణంతో ముగుస్తాయి.

దేవదేవుడి వైభవం
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు స్వయంభువుగా వెలసి దివ్యక్షేత్రం అంజనగిరి దేవస్థానం. మహబూబ్ నగర్ జిల్లాలో సుందర ప్రకృతి సౌందర్యం నడుమ వెలసిన మహిమాన్విత దివ్యధామమిది. ఎంతో పురాతనమైన గట్టుకాడిపల్లెలోని ఈ దేవాలయానికి ఆసక్తికర స్థల పురాణం ఉంది.

స్థల పురాణం
బ్రాహ్మణ వేషధారియైన ఓ దివ్యపురుషుడు కొండ గుహలోకి వెళ్తుండగా ఓ పశువుల కాపరి గమనించాడు. ఈ విషయాన్ని ఊరి పెద్దలకు తెలియడంలో అందరూ గుహ వైపొచ్చిన పరిశీలించారు. అయితే అక్కడ శిలారూపంలో ఉన్న విగ్రహం తప్ప ఇంకేమీ కనిపించలేదు. అయితే ఆ శ్రీనివాసుడే స్వయంభువుగా వెలిసాడని భావించిన గ్రామ పెద్దలు  దేవాలయం నిర్మించి నిత్య దీపధూపారాధనలు మొదలెట్టారు. కొండమీ మూలవిరాట్టూ కొండ కింద ఆలయ గోపుర నిర్మాణాలు చేపట్టారు.

మాఘమాసంలో జాతర
350 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ ఆలయంలో ప్రతిఏటా మాఘమాసంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతాయి. ఈ ప్రాంతానికి చెందిన భక్తులు ఎక్కడెక్కడో ఉన్నా అందరూ ఈ ఉత్సవాల కోసం తరలివస్తుంటారు.

Saturday 23 February 2013

KIDS NEWS: 101 yrs marathon runner

యువతకు స్ఫూర్తిదాత... వృద్ధ మారథాన్ రన్నర్

101 ఏళ్ల వయసున్న ఈ మారథాన్ రన్నర్  సింగ పూర్లో ఆదివారం జరిగిన పది కిలోమీటర్ల పరుగుపందెంతో రిటైర్మెంట్ ప్రకటించాడు.ఈ వృద్ద ఔత్సాహికుడు పౌజన్ సింగ్ భారత్లో జన్మించినా బ్రిటన్లో నివాసం ఉంటున్నాడు. 86వ ఏట భార్య, కుమారుడు దుర్మరణం పాలైన తర్వాత రన్నింగ్ వైపు దృష్టి సారించాడు. అప్పటి నుంచి ప్రపంచ వ్యాప్తంగా కొన్ని వందల మారథాన్ రేసుల్లో పాల్గొన్నాడు. రికార్డులు కూడా నమోదు చేశాడు. అలాగని యవ్వనంలో ఉన్నప్పుడు పరుగు పందేల్లో పాల్గొన్న అనుభవమేదీ లేదీయనకు. పట్టుదల, కృషి అనే రెండు పాజిటివ్ దృక్పథాలు ఈయనను తిరుగులేని వక్తిగా మలిచాయి. గిన్నిస్ బుక్ రికార్డుకు అర్హత ఉన్నా వయస్సు ధృవీకరణ పత్రమేదీ లేనందున రికా్రడ్ఉల్లో పేరు నమోదు కాలేదు. అయితే ప్రపంచంలో అత్యంత ఎక్కువ వయస్సున్న మారథాన్ రన్నర్ ఈ సింగ్ గారే. పుట్టుకతో వృద్ధులైన యువకులకు, బద్ధకిస్టులైన బావితరం దూతలకు సింగ్ ఆదర్శప్రాయుడు. తలవంచి నమస్కరించాల్సిన స్ఫూర్తిదాత.....  

KIDS NEWS: Michelle ads


KIDS NEWS: Michelle dancing

అమెరికా ప్రథమ మహిళ స్టెప్పులేస్తే...

అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా సతీమణి మిషెలీ ఒబామా డాన్సులతో అదరగొడుతున్నారు. ఓ టీవీ ఛానల్ షో కోసం ఆమె తన స్టెప్పులతో అందరినీ అలరించారు.దేహదారుడ్యం అంశంపై మిషెలీ ప్రచారం నిర్వహించి స్ఫూర్తిదాయకంగా నిలిచారు. యూట్యూబ్లో ఉన్న ఆ వీడియో మీ కోసం...

KIDS NEWS: Jaisalmer culture fest





KIDS NEWS: POKHRAN IRON FIST 2013