మాతృభాషా దినోత్సవం జరుపుకుందాం...
ఫిబ్రవరి 21 అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం. అంటే మనకు తెలుగు దినోత్సవం. కనీసం ఈ ఒక్క రోజైనా ఇంట్లో, ఆఫీసులో... పిల్లలతో, పెద్దలతో తెలుగులో మాట్లాడదాం. గొప్పకోసం పరభాషను అంటించుకుని తేనెలొలికే తెలుగును దూరం చేసుకోకుండా ఉండడం అందరికీ అవసరం.
తెలుగ దేలయన్న దేశంబు తెలుగేను
తెలుగు వల్లభుండ తెలుగొకండ
ఎల్లవారు వినగ ఎరుగవే బాసాడి
దేశ భాషలందు తెలుగు లెస్స
—శ్రీ కృష్ణదేవ రాయలు
జనని సంస్కృతంబు సకల భాషలకును
దేశభాషలందు తెలుగు లెస్స
జగతి తల్లికంటె సౌభాగ్యసంపద
మెచ్చు టాడుబిడ్డ మేలు గాదె?
— వినుకొండ వల్లభరాయడు
సంస్కృతంబులోని చక్కెర పాకంబు
అరవ భాషలోని అమృతరాశి
కన్నడంబులోని కస్తూరి వాసన
కలిసిపోయె తేట తెలుగునందు?
— మిరియాల రామకృష్ణ
No comments:
Post a Comment