Saturday 2 February 2013

KIDS NEWS: ANOTHER SURGERY TO GUL MAKKAI MALALA

  • గుల్ మకాయ్ మలాలాకు మరో సర్జరీ



  • పుర్రెలో టైటానియంతో చేసిన కృత్రిమ భాగాలు

  • నోబెల్ శాంతి పురస్కారం నామినేట్ కావడంపై హర్షం

  • మలాలాకే నోబెల్ రావాలని ఆకాంక్ష

"గుల్ మకాయ్' సాహస బాలిక మలాలా యూసఫ్జాయ్ కలం పేరు. ఇదే పేరుతో ఆమె పదకొండేళ్ల వయస్సులోనే రాయడం మొదలెట్టింది. ఏకంగా ప్రపపంచ ప్రఖ్యాతి గాంచిన బీబీసీ ఉర్ధూ భాషలో వెలువరిస్తున్న వెబ్ సైట్లో ఆర్టికల్స్ రాయడం ప్రారంభించింది. పాకిస్థానలో అత్యంత వెనుకబడిన ప్రాంతమైన స్వాత్ లోయలో తాలిబన్లను ఎదిరించింది. బాలికలు చదువు కోకూడదన్న ఉగ్రవాదుల ఆంక్షలను వ్యతిరేకించింది. తన లాంటి వేల మంది బాలికలు పాఠశాలల్లో చేరి చదువుకునేలా పోరాటం నడిపిన మలాలా ప్రపంచ వ్యాప్తంగా హక్కుల ఉద్యమకారిణిగా గుర్తింపు పొందింది. అక్షరం కోసం గొంతెత్తిన నినదించిన మలాలాపై ఉగ్రవాదులు దాడి చేసి తీవ్రంగా గాయపరచడం ప్రపంచాన్ని కలవర పరిచింది. ఆ పోరాట స్ఫూర్తికి ఎన్నెన్నో అవార్డులు వచ్చాయి. ఇప్పుడు ప్రతిష్టాత్మకమైన నోబెల్ శాంతి పురస్కారానికి మలాలా పేరు నామినేట్ అయింది. ఆమెకు ఈ అవార్డు ఇవ్వాని ఎప్పటి నుంచే ప్రపంచ దేశాలు కోరుతున్నాయి.  హక్కుల ఉద్యమకారులు ప్రత్యేక వెబ్ సైట్ ప్రారంభించి మద్దతు కూడగట్టారు. ప్రస్తుతం లండన్లో కోలుకుంటున్న మలాలాకు మరి కొన్ని ఆపరేషన్లు చేయాల్సి ఉంది. క్వీన్ విక్టోరియా ఆస్పత్రి  వైద్యుల బృందం ఇందుకోసం ఏర్పాట్లు చేస్తోంది. తాలిబన్ల కాల్పుల్లో ఆమె పుర్రె బాగా చితికి పోయింది. దీంతో దెబ్బ తిన్న పుర్రె భాగాలను రీప్లేస్ చేయాలి. ప్రత్యేకంగా టైటానియమ్ లోహంతో పుర్రెకు సంబంధించి భాగాలను కృత్రిమంగా తయారు చేస్తన్నారు. అన్నీ సజావుగా జరిగి నోబెల్ బహుమతి కూడా వచ్చి మలాలా మళ్లీ హక్కుల పోరాటంలో ముందుడుగు వేయాలని ఆశిద్దాం.

No comments: