Thursday, 28 February 2013

పచ్చని ప్రకృతి... వందేళ్ల జీవితం

 ఆరు తరాలను చూసిన బామ్మ
మనచుట్టూ పచ్చదనముంటే మనమూ కలకాలం పచ్చగా ఉంటాం. తమిళనాడులోని ఊటీకి దగ్గరున్న కుగ్రామం పుడుముండులో రుజ్జం అనే అవ్వ ఇలాగే ఆరుతరాలను చూసిందిట. ఇంత వయస్సొచ్చినా రుజ్జం ఎప్పుడూ చలాకీగా ముని ముని ముని మనవళ్లతో ఆడుకుంటూ ఉంటుంది. ఈ బామ్మలకే బామ్మకి 110 ఏళ్లు నిండాయని లెక్క. తోడా అనే ఓ గిరిజన తెగకు చెందిన ఈ కుటుంబం ఆరోగ్యంగా ఉండడంలో రహస్యమేంటో తెలుసా... ప్రకృతిని ప్రేమించడం. ఆరు తరాల్లో 230 మంది సభ్యులున్న ఈ మహా కుటుంబంలో రుజ్జం దగ్గర నుంచి నిన్నామొన్నటి పసిగుడ్డు దాకా అందరి ఆహార అలవాట్లు మంచివి. 
సెల్ ఫోన్ లో మాట్లాడుతున్న 110 ఏళ్ల రుజ్జం

 బామ్మ మాట... బంగారు బాట

  • కృత్రిమ ఆహార పదార్ధాల జోలికి వెళ్లకపోవడం
  • చిప్స్, ఛాట్లు, నూడిల్స్ ఇలాంటివేవీ తినకపోవడం.
  • రాగుల జావ, సజ్జ సంగటి, జొన్న అంబలి, పల్చటి మజ్జిగ ప్రధాన ఆహారమం
  • వెన్న, తేనె, నెయ్యి విరివిగా వినియోగించడం
  • తాజా పండ్లు, కూరగాయలే ఆహారం
  • పల్లె పెరట్లో దొరికే ప్రతి ఆకు కూరా అమృతమే
  • ప్రకృతిని ప్రేమించడం, మూగజీవాలను చేరదీయడం
  • సదాలోచనలతో పొద్దుపుచ్చడం
  • తోటి వారికి తోడూనీడగా ఉండడం
  • పొలం పనులతో సహా అన్నీ సొంతగానే చేసేసుకోవడం
  ఇవీ రుజ్జుం ఆరోగ్యకరమైన సుదీర్గ జీవనానికి ఉపయోగపడుతున్న అలవాట్లు. ఆచరించేందుకు మనకూ మార్గాలున్నాయి. ప్రకృతిని మనం భక్షించకుండా ఉంటే అది మనల్ని రక్షిస్తుంది.

No comments: