తానా గ్లోబల్ సైన్స్ ఫెయిర్
విద్యార్థుల్లో విజ్ఞాన శోధన
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికితీసేందుకు తానా చేపట్టిన గ్లోబల్ సైన్స్ ఫెయిరుకు విశేష స్పందన వచ్చింది. ఆస్ర్టేలియా, అమెరికా, కెనడా, కువైట్, బెహ్రయిన్, శ్రీలంకల్లో నివాసం ఉంటున్న తెలుగు విద్యార్థులు తమ ప్రతిభాసక్తులను ఇందులో ప్రదర్శిస్తున్నారు. సైన్స్ పట్ల తమకున్న ఆసక్తిని, ప్రయోగశీలతను ప్రదర్శించడానికి ఇది అంతర్జాతీయ వేదికగా తోడ్పడుతోందంటున్నారు కార్యక్రమ చైర్మన్ వి. రాజేష్, తానా అధ్యక్షుడు తోటకూర ప్రసాద్.
వివిధ దేశాల్లో మొదటి దశలో వెయ్యి ప్రాజెక్టులు... వీటిలోంచి రెండో దశలో 180 ప్రాజెక్టులు ఎంపిక చేశారు. 11 సైన్స్ విభాగాల్లో 6 నుంచి 8 క్లాసుల విద్యార్థులు జూనియర్లుగా, 9 నుంచి 12 క్లాసుల వాళ్లు సీనియర్లుగా పోటీ నిర్వహిస్తున్నారు. సెమీ ఫైనల్స్లో ఎంపిక చేసిన ప్రాజెక్టులను మార్చి 31న ప్రకటించనున్నారు. అలాగే మే 24 నుంచి 26 వరకూ డాలన్లో జరిగే తానా సభల్లో ఫైనల్స్ పోటీలుంటాయి. ఈ గ్లోబల్ సైన్స్ ఫెయిర్కు తానాతో పాటు ఈనాడు, ఈటీవీ భాగస్వామిగా వ్యవహరిస్తోంది.
No comments:
Post a Comment