Wednesday 30 April 2014

డిగ్గీ రాజా.. ఓ టీవీ యాంకర్..!

లేటు వయసు లవ్ స్టోరీ

కాంగ్రెస్ నాయకుడు దిగ్విజయ్ సింగ్ లేటు వయసు లవ్ స్టోరీ ఇది. ప్రస్తుతం రాజ్య సభ టీవీలో యంకర్గా పని చేస్తున్న అమ్రుతా రాయ్ తో తనకు సంబంధం ఉన్న మాట నిజమేనని ట్విట్టర్ లో ప్రకటించారు. త్వరలో ఆమె తన భర్తకు విడాకులు ఇవ్వనున్నట్లు డిగ్గీ రాజా స్పస్టం చేసారు.http://www.aptopnews.com/

డిగ్గీ భార్య ఆశా నిరుడే మరణించారు. వీరికి ఒక కుమారుడు, ముగ్గురు కుమార్తెలు. అయితే కొంతకాలంగా డిగ్గీ రాజా టీవీ యాంకర్ అమ్రుతా రాయ్ తో రిలేషన్ షిప్ కొనసాగిస్తున్నారు. ఈమధ్య ఇద్దరి వీడియో ఒకటి బయటికి వచ్చినా పట్టించుకోని డిగ్గీ చివరికి ఆమె ట్విట్టర్లో కన్ ఫాం చేయడంతో  తాను కూడా అదే ట్విట్టర్లో సందేశం పెట్టారు. తన భర్తతో విడాకుల గొడవ తెగాక డిగ్గీని పెళ్ళి చేసుకుంటానని టీవీ యాంకర్ అమ్రుతా రాయ్ చెప్తోంది. ఇప్పుడు డిగ్గీ వయసు 67.. రాయ్ వయసు ఫార్టీ ప్లస్సు. http://www.aptopnews.com/
http://www.aptopnews.com/

పాలు పడుతూ నిరసన

ఆడవారికి ఒళ్ళుమండిందంటే ఎంతకైనా తెగిస్తారు. బ్రిటన్ లోని నట్టింగ్ హం  సిటీలోని ఓ కార్పోరేట్ షోరూం మహిళా ఉద్యోగులు యజమానిపై వినూత్న నిరసనకు దిగారు. http://www.aptopnews.com/

స్పోర్ట్స్ డైరెక్ట్ అనే షోరూం ఉద్యోగిని పాతికేళ్ళ వైలెట్టే కొమర్ తన మూణ్ణెళ్ళ బిడ్డ ఆకలి తీర్చేందుకు పని చేసే చోటే పాలు పట్టించింది. దీంతో యాజమాన్యం ఆగ్రహించి ఆమెను బయటికి పంపించి వేయడం వివాదంగా మారింది. ఈ సంగతి తెలిసిన మిగితా మహిళా ఉద్యోగులు వెంటనే షోరూం ఎదుట నిరసనకు దిగారు. తమ బిడ్డలకు బహిరంగంగా పాలు ఇచ్చి నలుగురికీ ఈ విషయం తెలిసేలా చేశారు.http://www.aptopnews.com/  

Tuesday 29 April 2014

వేలి మీద సిరా చుక్క

మొదటిసారి తన చూపుడు వేలి మీద సిరా చుక్క పడిన అనుభూతిని జన్మజన్మలకీ మరచిపోలేనంటోంది హీరోయిన్ మధుశాలిని. మీ వేలు మాత్రం ఏం పాపం చేసింది! వెళ్లి ఓటేయండి.. వేలి మీద సిరా చుక్కా వేయించుకోండి! http://aptopnews.com/political-news/561-2014-04-29-18-40-40

ఇంత డొంక తిరుగుడుగా చెప్తేగానీ మన యూత్ ఓటు హక్కును బాధ్యతగా గుర్తించలేని ప్రజాస్వామ్యం మనది!. అందుకే ఈ ముద్దుగుమ్మ కూడా చాలా వెరైటీగా ఓటేయమంటూ యువతను రిక్వెస్ట్ చేస్తోంది. ఆ వీడియో ఇప్పుడు యూట్యూబ్ లో తెగ హల్ చల్ చేస్తోంది. హస్కీ వాయిస్ తో.. సెక్సీ లుక్స్ తో ‘లెటజ్ ఓట్’ అంటేగానీ మన యూత్ పోలింగ్ బూతు వైపు కదలరేమో మరి!
http://www.aptopnews.com/

తెలంగాణా జంగ్

పద్దెనిమిదేళ్లు నిండిన కొత్త ఓటరు చేతికి తొలి సంపాదన ఓ పచ్చనోటు! పొలానికి నీళ్లెక్కడివి.. మోటారు తిరిగేందుకు కరెంటు ఎలాగొస్తుంది అని ఆలోచించే రైతన్నకు ఓ పంచెల జోడి అందవచ్చు. వీలుంటే ఓ సారాయి సీసా.. మరీ మరీ మీ ఓటు కావాల్సి వస్తే బిర్యానీ పొట్లం మీ చేతికందవచ్చు. ఆడ పడుచుకు చుక్కల చీర.. లేదంటే వెండి ముక్కుపుడక.. ఓ స్టీలు బిందె.. ఇలా ఎన్నెన్ని కానుకలో మన ఇంటి ముంగిటికి రాత్రికి రాత్రే నడిచొచ్చేయవచ్చు. ఇవన్నీ ఓ పూట ఆకలి తీరుస్తాయి. ఆ క్షణం తృప్తి కలిగిస్తాయి. ఆ కృతజ్ఞతతో మనల్ని ప్రలోభపెట్టిన వారికి ఓటు వేశామంటే మన వేలితో మన కంట్లోనే పొడుచుకున్నట్లు.
http://aptopnews.com/telangana-news/559-2014-04-29-18-02-05
ఐదేళ్ల పాటు మన బతుకుల్లో కమ్ముకునే చీకట్లకు మనమే తెర లేపినట్లు. ఇంత మంది అభ్యర్థుల్లో ఎవరో ఒకరు మన మేలు కోరుకునే వారుంటారు. ఆ ఒక్కరినీ ముందుగా గుర్తించకపోతే మనం వేసే ఓటు వృధా. అరవై ఏళ్ల పోరాటం సాకారమవుతున్న వేళ... కొత్త రాష్ట్రం ఆవిష్కారమవుతున్న తరుణం.. ఒకటికి పదిసార్లు ఆలోచించాకే ఓటు హక్కు వినియోగించుకుందాం.
http://www.aptopnews.com/ 

Monday 28 April 2014

బాబాకి హానీమూన్ దెబ్బ...!

యోగా గురు రాందేవ్ బాబా హానీమూన్ దెబ్బ గట్టిగానే తగిలింది. బ్రహ్మ చారి బాబాకి హానీమూన్ ఏమిటా అనుకుంటున్నారా..? కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు  రాహుల్ గాంధీ ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో హానీమూన్లు, పిక్నిక్కులు జరుపుకుంటారంటూ రాందేవ్ బాబా సెటైర్లు వేసి ఇరకాటంలో పడ్డారు. ఇది ఎస్సీ, ఎస్టీలను కించ పరచడమేనని దిగ్విజయ్ లాంటి కాంగ్రెస్ అగ్రనేతలు మండిపడ్డారు. రాందేవ్ను అరెస్టే చేయాలన్న డిమాండు కూడా ఊపందుకుంది. అయితే అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గానూ బాబా నిర్వహించే యోగా శిబిరాలను అనేక రాష్ట్రాలు నిషేధించాయి.http://aptopnews.com/political-news/557-2014-04-29-01-52-29

ముందు ఉత్తర ప్రదేశ్ బ్యాన్ చేస్తే తాజాగా మహారాష్ట్ర, హిమాచల్ ప్రదేశ్, రాజస్ధాన్ ప్రభుత్వాలు కూడా నిషేధం విధించాయి. బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీకి మద్దతుగా ఉన్న రాందేవ్ బాబా- రాహుల్ పెళ్లి గురించి మాట్లాడుతూ హానీమూన్ కామెంట్లు చేశారు. యువనేత విదేశీ అమ్మాయిని పెళ్లి చేసుకోబోతే సోనియా గాంధీ అడ్డు తగులుతున్నారని బాబా చెప్తున్నారు. ఇదే జరిగితే రాహుల్ ఈ దేశానికి ప్రధాని కావడం అసాధ్యమన్నది ఆమె భయమంటారు రాందేవ్. ఇక్కడి అమ్మాయిని వివాహమాడటం రాహుల్ కు ఇష్టం లేదని చెప్తున్నారు. అందుకే యువనేత ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో హానీమూన్, పిక్నిక్ టూర్లకు వెళ్తుంటారని వ్యాఖ్యానించారు. దీని మీద రచ్చ రచ్చ అవుతోంది.http://aptopnews.com/political-news/557-2014-04-29-01-52-29

ఫేస్ బుక్ యమపాశం!

ఫేస్ బుక్ లో లీనమైపోతే ఏ లోకంలో ఉన్నారో కూడా తెలియడం లేదా...? ఇంతలా అడిక్ట్ ఐపోతే వెంటనే మేలుకోండి! లేదంటే డైరెక్టుగా యమ లోకంలోనే తేలుతారు. ఓ అమెరికన్ యువతి ఎలా ప్రాణాల మీదకు తెచ్చుకుందో చూడండి. మోబైల్ తో తీసుకున్న తన సొంత ఫొటోలను ఫేస్ బుక్ పేజ్ లో అప్ లోడ్ చేసిన రెండో నిమిషం లోనే ఆమె పైలోకాలకు వెళ్లింది.
http://www.aptopnews.com/

అదేలాగంటే- హైవేలో వెహికిల్ డ్రైవింగ్ చేస్తూ ఫేస్ బుక్ యాక్టివిటీలో మునిగి తేలుతున్నందుకు జరిగిన ప్రమాదం. కోర్ట్నీ శాన్ ఫోర్డ్ అనే 32 ఏళ్ల యువతి ఉదయం 8.33 కి ‘ది హ్యాపీ సాంగ్ మేక్ మీ సో హ్యాపీ...’ అంటూ ఓ మెసేజ్ పోస్టు చేసింది. అదే మోబైల్ తో డ్రైవింగ్ చేస్తున్న స్టిల్ లో ఫొటో తీసుకుంది. దాన్నే ఫ్రెండ్స్ కు షేర్ చేసుకుంది. కరెక్ట్ గా  రెండు నిమిషాల్లో ఫోలీసులకు యాక్సిడెంట్ సమాచారం తెలిసింది. వాళ్లు వెళ్లే లోపే కోర్ట్నీ శాన్ ఫోర్డ్ మరణించింది. ఆ తర్వాత ఆమె ఫేస్ బుక్ ఫ్రెండ్స్ అందరూ ఈ విషాదం గురించి తెలుసుకుని బాధ పడ్డారు.  ఏ పని చేస్తున్నా మోబైల్, ట్యాబ్ లాంటి గాడ్జెట్స్ ను వదిలిపెట్టని టెక్నో ఎడిక్ట్స్ కు ఇది హెచ్చరికే!
http://www.aptopnews.com/ 

ఎన్నికల బరిలో నాలుగో వంతు క్రిమినల్సే!

తెల్ల చొక్కా వేసుకున్న వాడు నాయకుడు అవ్వొచ్చేమోగానీ ప్రతి తెల్ల చొక్కా వెనుక క్లీన్ ఇమేజ్ ఉంటుందన్న భరోసా లేదు. మన రాష్ట్రంలో ప్రస్తుతం పోటీ చేస్తున్న వారిలో 25 శాతం మంది క్రిమినల్ రికార్డు ఉన్న వాళ్లేనని తేలింది. వివిధ పార్టీల నుంచి పోటీ చేస్తున్న 225 మంది నేరచరితుల జాబితాలో ఉన్నారు. ఇందులో 141 మంది హత్యలు, మహిళలపై దౌర్జన్యాలు, కిడ్నాపులు లాంటి తీవ్రమైన నేరాలకు పాల్పడిన వారు.


for full story http://aptopnews.com/national-news/550-2014-04-27-12-47-45

ఓన్లీ మ్యాన్ షో

http://aptopnews.com/life-and-style/545-2014-04-27-11-58-18

ఇండియన్ పాలిటిక్స్ ఓన్లీ మ్యాన్ షోగా మారిపోయాయి. జనాభాలో సగం.. ఓటర్లలో సగం ఉన్న మహిళలకు రాజకీయాల్లో మాత్రం సమాన వాటా లేదు. అందరూ మహిళల్ని ఉద్ధరిస్తామని చెప్పేవారే. కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీ, రాష్ట్రీయ లోక్ దళ్.. ఇలా సాంప్రదాయ పార్టీలన్నీ మహిళా రిజర్వేషన్ బిల్లును చాలా జాగ్రత్తగా అటకెక్కించేశాయి. తమకు ప్రయోజనం చేకూర్చే అంశాల్లో అధికార, విపక్షాలు తెలివిగా చేతులు కలుపుతాయి. అదే ప్రజా ప్రయోజనం ఉండేపక్షంలో అందరూ తలోమాటా చెప్పి చట్ట సభల్లో తొక్కి పెట్టేయడం ఆనవాయితీగా మారింది. మహిళా బిల్లు విషయంలో ఏళ్ల తరబడిగా ఇదే జరుగుతోంది. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ మహిళ. బీఎస్పీ చీఫ్ మాయావతి, అన్నా డీఎంకే అధినేత్రి జయలలిత, తృణమూల్ కాంగ్రెస్ చీఫ్ మమతా బెనర్జీ.. ఇలా ప్రముఖ పార్టీల పగ్గాలు మహిళల చేతుల్లోనే ఉన్నాయి. జయ, మమత రెండు ప్రధాన రాష్ట్రాలకు సీఎంలుగా ఉన్నారు. మాయావతి ఒకప్పుడు సీఎం పదవి వెలగబెట్టారు. కానీ ఎన్నికల్లో మహిళలకు మాత్రం టికెట్లు తక్కువే. వారసులుగా వచ్చే మహిళలే తప్ప ఇతరులకు ఛాన్సే లేదు. 

http://aptopnews.com/life-and-style/545-2014-04-27-11-58-18

మన పార్లమెంటు ఉభయ సభల్లో మహిళల ప్రాతినిథ్యం కేవలం పదకొండు శాతం. అదే పాకిస్థాన్ లో 21 శాతం. రాజకీయంగా ఎంతో అస్థిరత ఉండే ఆప్ఘనిస్థాన్ లోనూ మన కంటే మూడు రెట్ల సంఖ్యలో మహిళా ఎంపీలున్నారు. అంటే  28 శాతం. మనదేశంలో ఎన్నికల వేళ మహిళల ఓట్ల కోసం పార్టీలన్నీ నానా తంటాలు పడుతున్నాయి.

Saturday 19 April 2014

మోడీ స్టైల్ అమెరికా ట్రైనింగా..!


నరేంద్ర మోడి... ఇండియన్ పొలిటీషియన్స్ లో ఓ  స్టైల్  ఐకాన్. తెల్లని క్రాఫు.. కాటన్ కుర్తా మోడి ఐడెంటిటి. మోడి ఎప్పుడూ మూడు అంశాలను మరచిపోరు. అవే- ఐస్, వాయిస్, క్లోథ్స్. రాజకీయాల్లో ప్రత్యేకంగా కనిపించాలంటే సంథింగ్ డిఫరెంట్ గా ఉండాలనేది బీజేపీ ప్రధాని అభ్యర్థి నిశ్చితాభిప్రాయం. ఎన్నికల వేళ ఆసక్తి కలిగించే మోడి కుర్తా కధ ఏంటి.. ? ఏ షాపులో దుస్తులు కొంటారు.. ? తెల్లని వెంట్రుకల వెనుక దాగిన రహస్యం ఏమిటి..? పర్స్ నల్ లుక్ కోసం మోడి అమెరికా ఎందుకు వెళ్ళారు..? సోనియా రాజకీయ సలహాదారు అహ్మెద్ పటేల్, పారిశ్రామిక వేత్త గౌతం అదానీ, బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడి.. ఈ ముగ్గురికీ ఒకే సలహాదారు.. ఆయనెవరు..? పూర్తి ఆసక్తికరమైన కథనం...


    మోడీ కుర్తాలకు ఓ బ్యాక్ గ్రౌండ్ ఉంది. అహ్మదాబాద్ సిటీలో ఉన్న "జడే బ్లూ" షోరూంలో మోడీ కుర్తాలు హాట్ కేకుల్లా సేల్ అవుతాయి. "జడే బ్లూ" ఓనర్ బిపిన్ చౌహాన్  నరేంద్ర మోడీ పర్సనల్ టైలర్. 20 ఏళ్ళుగా మోడీ డ్రెస్సులన్నీ ఆయనే కుడుతున్నారు.
    బిపిన్ వెనుకా ఓ కథ ఉంది! ఆయన తన సోదరుడితో కలిసి అహ్మదాబాద్ లోని ఓ బట్టల షాపులో గుండీలు కుట్టుకుంటూ జీవనం సాగించేవాడు. 1990లో నరేంద్ర మోడీ సంఘ్ లో స్వయం సేవక్ గా ఉన్నప్పుడే బిపిన్ పరిచయం. అప్పటినుంచే దుస్తుల విషయములో చాలా జాగ్రత్తలు తీసుకునే మోడీ ఎప్పుడైనా బిపిన్ తోటే  బట్టలు కుట్టించుకునేవారు.
    1995 లో  అహ్మదాబాద్ నగరంలో  "జడే బ్లూ" షోరూం పెట్టారు. ఇక మోడీ డ్రెస్సులన్నీ అక్కడే. కాలానుగుణంగా స్తైల్స్ మారుతున్నాయి. ఇప్పుడు కుర్తాలు వచ్చాయి. "జడే బ్లూ"లో మోడీ కుర్తాల పేరుతో ఎక్స్ క్లూజివ్ బ్రాండ్ దొరుకుతుంది.
        "జడే బ్లూ" యజమాని బిపిన్ - నరేంద్ర మోడీకే కాదు.. సోనియా రాజకీయ సలహా దారు అహ్మెద్ పటేల్, మరో పారిశ్రామిక వేత్త గౌతం అదానీలకు కూడా డ్రెస్ డిజైన్ చేస్తాడు. ఇందులో మొదటి ఇద్దరూ రాజకీయంగా బద్ద విరోధులు..చివరి ఇద్దరూ మంచి మిత్రులు!.
             నరేంద్ర మోడీ డ్రెస్ స్టైలింగ్ లో కుర్తా స్పెషల్. ఇక ఆయన తెల్లని క్రాఫ్.. ట్రిం చేసిన గడ్డం కూడా స్పెషలే. ఎప్పుడూ దువ్వెన వెంట ఉంచుకుంటారు. హెయిర్ స్టిలింగ్ను ఏ మాత్రం  నిర్లక్ష్యం చేయరు. దేశంలోని మిగితా నాయకుల్లో విభిన్నంగా కనిపించాలనే తపత్రయం మోడీకి బాగా ఎక్కువ. ఇదే - ఇమేజ్ మేనేజ్ మెంట్. లుక్ ఆండ్ ఫీల్ బాగా ఉండాలనే తపన. తనను తాను 100 పర్సెంట్ పర్ఫెక్ట్ గా ప్రజెంట్ చేసుకోవడం మోడీకి ఎలా అబ్బిందో తెలుసా? ఇందుకోసం ఆయన అమెరికాలో మూడు మాసాల ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు. అదే పబ్లిక్ రిలేషన్స్ ఆండ్ ఇమేజ్ మేనేజ్మెంట్ కోర్స్. రాజకీయల్లో అంచెలు అంచెలుగా ఎదిగేందుకు మోడీ చేయని ప్రయత్నమంటూ లేదు.
           2007 గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల నాటికి మోడీకి దాదాపు బట్టతలే. ఆ తర్వాతే హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ చేయించారు. ఇక అప్పటి నుంచీ క్రాఫ్ తో మోడీ లుక్ మారి పోయింది. బాలీహుడ్ హీరో లాగా స్టైల్ మెయింటెనన్స్.. లుక్ అండ్ ఫీల్ లోనూ స్పెషాలిటీ. హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ చేసినప్పుడు ఉలెన్ క్యాప్ నెత్తిన ఉండేది. ఎవరికీ అనుమానం రాకుండా!

             మోడీ వ్యక్తిత్వం లోనూ ప్రత్యేకత ఉంది. స్వామీ వివేకానంద అంటే అయనకు ఆదర్శం. ఆ భోదనలను పాటిస్తారు. మద్యపానం, ధూమపానం అలవాట్లు లేవు. పూర్తిగా శాఖహారి. 
    మోడీ మంచి కవి కూడా! సొంతగా బ్లాగ్ రాస్తారు. తన పేరు మీదే వెబ్ సైట్ నడుస్తోంది. ఎప్పుడూ సోషల్ మీడియా లో ప్రజలకు దగ్గరగా ఉంటారు. టెక్ సావీ పొలిటీషియన్.
    గుజరాత్ ముఖ్యమంత్రిగా.. ఇప్పుడు బీజేపీ ప్రధాని అభ్యర్థిగా తనదంటూ  ఓ స్టైల్ చాటుకుంటున్నారంటే... తన మీద తాను ద్రుష్టి పెట్టుకోవడమే. తనను తాను తీర్చి దిద్దుకోవడమే. ఆయన ఇండియన్ పొలిటీషియన్స్ లో ఓ  స్టైల్  ఐకాన్.                                                                                        

                                                                                

'మోడి"ఫైడ్ స్తైల్

  • నరేంద్ర మోడి... ఇండియన్ పొలిటీషియన్స్ లో ఓ స్తైల్ ఐకాన్.
  • తెల్లని క్రాఫు.. కాటన్ కుర్తా మోడి ఐడెంటిటి. 
  • మోడి ఎప్పుడూ మూడు అంశాలను మరచిపోరు. అవే- ఐస్, వాయిస్, క్లోథ్స్. 

రాజకీయాల్లో ప్రత్యేకంగా కనిపించాలంటే...
సంథింగ్ డిఫరెంట్ గా ఉండాలనేది బీజేపీ ప్రధాని అభ్యర్థి నిశ్చితాభిప్రాయం.

  • ఎన్నికల వేళ ఆసక్తి కలిగించే మోడి కుర్తా కధ ఏంటి.. ? ఏ షాపులో దుస్తులు కొంటారు.. ? 
  • తెల్లని వెంట్రుకల వెనుక దాగిన రహస్యం ఏమిటి..? 
  • పర్స్ నల్ లుక్ కోసం మోడి అమెరికా ఎందుకు వెళ్ళారు..? 

సోనియా రాజకీయ సలహాదారు అహ్మెద్ పటేల్, పారిశ్రామిక వేత్త గౌతం అదానీ, బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడి.. ఈ ముగ్గురికీ ఒకే సలహాదారు.. ఆయనెవరు..?

  • పూర్తి ఆసక్తికరమైన కథనం కోసం చూడండి... 

    http://www.aptopnews.com/   

Friday 18 April 2014

వోటేయని షర్మిల!

మణిపూర్ సామాజిక ఉద్యమకారిణి ఇరోం షర్మిల..
ఈసారి ఓటేద్దామనుకుంది..
కానీ అధికారులు నో చెప్పారు..
ఇదా మన  ప్రజాస్వామ్య వ్యవస్థ..? !

ఈ ప్రజాస్వామ్య వ్యవస్థ మీద నమ్మకం లేకనే ఇన్నాళ్ళూ ఎన్నికలకు దూరంగా ఉంది. ఆం అద్మీ పార్టీ ని చూసాక మళ్ళీ ఓటు మీద నమ్మకం కలిగిందిట. కానీ పద్నాలుగేళ్ళుగా దీక్ష చేస్తున్న ఈమెకు ఓటు వేసే అవకాశం ఇవ్వలేదు. ఈశాన్య రాష్త్రాల్లో అమల్లో ఉన్న ఆర్ముడ్ ఫోర్సెస్  యాక్ట్ 1958 కి నిరసనగా అమె నిరహార దీక్ష చేస్తున్నారు. దీంతో అమెను పోలీసులు గతంలో అరెస్ట్ చేసి జైలుకు పంపారు. ఈ కారణంగా ఓటు హక్కును కోల్పొయింది. మణిపూర్ పోలింగ్ లో ఓటు వేసే అవకాశం ఇవ్వాలంటూ ఆమె చేసిన విన్నపాన్ని  ఎన్నికల కమిషన్ తోసిపుచ్చింది. ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం జైల్లో శిక్ష పడిన వారికి ఓటు హక్కు కల్పించడం కుదరదని స్పష్టం చేసింది. ఈ లెక్కన ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఎంత మంది నాయకులు ఆ హక్కును కోల్పోవాలో అధికారులకే తెలియాలి?              

Thursday 17 April 2014

ద్వేషించకు.. ప్రేమించు!


పాపుల్ని ద్వేషించకు.. వారిని ప్రేమించు.. మంచి మనసుతో క్షమించు...


ప్రేమమూర్తి అయిన ఏసుక్రీస్తు విశ్వమానవాళికి చేసిన బోధన సారాంశం ఇదే. కల్వరి కొండ మీద శిలువనెక్కిన కరుణామయుడి నోటి వెంట ఆఖరిక్షణాల్లో వచ్చిన మాటల పరమార్ధం. 


      శిలువ మీద ఏసుక్రీస్తు ప్రాణం విడిచిన రోజు గుడ్ ఫ్రైడే. క్రైస్తవులంతా చర్చిల్లో ప్రాయశ్చిత్త ప్రార్ధనలు చేసే రోజు. ప్రజల కోసం ప్రాణం విడిచిన ఏసునులుచుకునే తరుణం. ప్రతినిత్యం జరిగే ప్రేయర్స్ గుడ్ ఫ్రైడే రోజున ఉండవు. చర్చిల్లో గంటలు కూడా మోగవు. కేవలం ఉపవాస దీక్షలు, క్రీస్తు నామస్మరణే.


      తన ప్రాణాలను పరలోకానికి పంపుతూ ప్రేమమూర్తి పలికిన ఏడు వాక్యాల్ని క్రైస్తువులు ధ్యానం చేస్తారు. ఆ మొదటి వాక్యం ఓ తండ్రీ.. ఈ పాపుల్ని క్షమించు.. ఎందుకంటే తాము చేస్తున్నదేమిటో వారికే తెలియదు..


తనను శిలువనెక్కించిన పాపుల్ని కూడా ఆయన క్షమించాడు. పాపుల్ని ద్వేషించం కాకుండా క్షమించడమే ధర్మమని చాటాడు. ఇక ఏడోదైన ఆ చివరి వాక్యం చూద్దాం.. ఓ తండ్రీ..  నా ప్రాణాల్ని నీ చేతుల్లో ఉంచుతున్నాను... ఈ వాక్యంతో ఏసుక్రీస్తు పరలోకానికి వెళ్లాడు. దేవుడు తనకు అప్పగించిన కర్తవ్యాన్ని పూర్తిచేసుకుని ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్లాడు. శుక్రవారం పరలోకానికి ఏగిన ఏసుక్రీస్తు- మళ్లీ రెండు రోజుల తర్వాత ఆదివారం రోజున పునరుత్థానం పొందుతాడు. అదే ఈస్టర్ సండే. ఆ రోజున ఏసుక్రీస్తు మళ్లీ జన్మించిన రోజుకు గుర్తుగా చర్చిల్లో ప్రత్యేక ప్రార్దనలు జరుగుతాయి. అయితే ఆయన బోధనలు నిత్య స్మరణీయం. ప్రేమ, దయ, క్షమాగుణం.. ప్రతి మనిషి ఆచరించాల్సిన  జీవన సూత్రాలు.       



Wednesday 16 April 2014

*నా బంగారు తల్లి*కి జాతీయ అవార్డులు

*నా బంగారు తల్లి*

అమ్మాయిల అక్రమ రవాణా అంశంతో తీసిన చిత్రం *నా బంగారు తల్లి*. ఇది నిజ జీవిత గాధ అని చిత్ర నిర్మాతలు చెప్తున్నారు. సంఘ సేవకురాలు  సునీతా క్రిష్ణన్ రాసిన కధతో రాజేష్ టచ్ రివర్ దర్శకత్వంలో *నా బంగారు తల్లి* నిర్మించారు. ఎం ఎస్ రాజేష్ చిత్ర నిర్మాత. ఇప్పటికే మళయాంలో దబ్ చేసిన ఈ చిత్రం ఇప్పటికే అనేక అవార్డులు పొందింది.ఇప్పుడు నాలుగు జాతీయ సినిమా అవార్డులు దక్కాయి. 
    

Tuesday 15 April 2014

లివింగ్ బార్బీ ఒరిజినల్ సోకులు!

బార్బీ అంటే పడుచుపిల్లలకు ప్రాణం.
అచ్చం బార్బీ లాగానే ఉండాలనుకునే అమ్మాయిల సంఖ్యకు లెక్కలేదు. అయితే రష్యాలో నిజమైన బార్బీ ఉంది.

వలేరియా లుక్యనోవా


                                              లివింగ్ బార్బీ ఒరిజినల్ సోకులు!                                                 




ఆమే 28 ఏళ్ళ వలేరియా లుక్యనోవా. 1985లో ఉక్రయిన్లో పుట్టింది. ఎత్తు 5.7 అడుగులు. బరువు 42 కిలోలు. వలేరియా లుక్యనోవా 2007లో అందాల పోటీల్లో పాల్గొని మిస్ డైమండ్ క్రౌన్ ఆఫ్  వరల్డ్ కిరీటం దక్కించుకుంది. ఇక అప్పటి నుంచి వలేరియా లుక్యనోవా లివింగ్ బార్బీ గా గుర్తింపు సంపాదించింది. అచ్చం బార్బీగా కనిపించేందుకు లెన్స్ వాడుతోంది. బార్బీలాగా శరీర సౌష్టవం  కనిపించేందుకు ప్రతినిత్యం జిమ్ముకు వెలుతుంది. పింక్ కలర్లో ఉండే సింథటిక్ దుస్తులే వేసుకుంటుంది. 365 రోజులూ ఇదే గెటప్లో కనిపిస్తుంది. అయితే బార్బీ తరహా దుస్తులు కాకుండా మామూలుగా ఆమె ఎలా ఉంటుందనే ఆసక్తి అందరికీ ఉంటుంది! అందుకే ఈ బార్బీ బొమ్మ ఓన్ గెటప్లో తీసుకున్న ఫోటోలను అన్ లైన్లో పెట్టింది. బార్బి అభిమానులైన అమ్మాయిలంతా లివింగ్ బార్బీ ఒరిజినల్ గెటప్ ఇమేజెస్ చూసి తెగ ముచ్చట పడుతున్నారు.

Thursday 10 April 2014

మోడీ పెళ్లయిన బ్యాచిలరే!


నరేంద్ర మోడీ బీజేపీ ప్రధాని అభ్యర్థిగా ఓ నిజాన్ని బయటపెట్టారు. అది తాను పెళ్లయిన బ్యాచిలర్నని. 

నలభై ఐదేళ్ల తర్వాత మోడీ పెళ్లి విషయం అధికారికంగా బయటికొచ్చింది. గుజరాత్్లోని వడోదర నుంచి లోక్సభ ఎన్నికల్లో పోటీచేస్తున్న మోడీ నామినేషన్ పత్రాల్లో తన భార్య వివరాలు వెల్లడించారు. ఆమె పేరు జశోదా బెన్. 

మోడీకి పదిహేడేళ్ల వయసులో వీరి వివాహమైంది. అయితే ఒకటి రెండు వారాల్లోనూ ఇద్దరూ దూరమయ్యారు. తమ కుటుంబ ఆచారం ప్రకారం మోడీకి బాల్య వివాహం జరిగిందని ఆయన సోదరుడు వెల్లడించారు. అప్పట్లో తమ కుటుంబంలో ఎవరూ చదువుకున్న వాళ్లు లేనందున  పెళ్లి.. ఆ వెంటనే విడిపోవడం జరిగాయంటున్నారు. అయితే కాళ్ల పారాణి ఆరకముందే పుట్టింటికి చేరిన జశోద ఏడో క్లాస్తో ఆపేసిన చదువును కొనసాగించారు.  టెన్త్ ప్యాసయ్యాక టీచర్ ట్రైనింగ్ చేసి ప్రభుత్వ పాఠశాలలో ఉద్యోగం సంపాదించారు. ఆనాటి నుంచే మోడీ కుటుంబంతో ఆమెకు ఎలాంటి సంబంధం లేదు. సాదాసీదా జీవితం గడిపిన జశోద ఇప్పటికీ అతి సామాన్యంగా ఉంటారు.

      ఇక మోడీ విషయానికి వద్దాం.. పెళ్లి తర్వాత భార్యకు దూరమైన ఆయన ఆ తర్వాత పీజీ చదివారు. ఆర్ఎస్ఎస్ ప్రచారక్ గా చేరి పూర్తి జీవితాన్ని సంఘ్ కార్యకలాపాలకే అంకితం చేశారు. విశ్వ హిందూ పరిషత్,  బీజేపీలో జాతీయస్థాయి నేతగా ఎదిగినా ఏనాడూ తన వైవాహిక జీవితం గురించి బయటపెట్టలేదు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో నాలుగు సార్లు గెలుపొందినా పలు దఫాలు ముఖ్యమంత్రిగా పనిచేసినా భార్య గురించిన వివరాలేవీ బయటకు పొక్కలేదు. 

అయితే గతంలో కాంగ్రెస్ పార్టీ దీనిపై వివాదం సృష్టించింది. జశోదా బెన్ గురించిన కథనాలు జాతీయ మీడియాలో వచ్చాయి. అయితే మోడీ దీన్ని అధికారికంగా ధృవీకరించలేదు, ఇతర బీజేపీ నేతలూ పెద్దగా పట్టించుకోలేదు. ఇప్పుడు ప్రధానమంత్రి పదవి రేసులో ఉన్నందున ఈ అంశంపై రచ్చ జరుగుతుందన్న భయంతోనే మోడీ ఈ నిజాన్ని వెల్లడించారని భావించవచ్చు. 

గతంలో అనేక సందర్భాల్లో తాను అవివాహితుడనని మోడీ చెప్పుకున్నారు. పెళ్లాం.. పిల్లలు లేని తనకు అవినీతిమార్గాల్లో సొమ్ము సంపాదించాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు. దీనిపై ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ అభ్యంతరం తెలిపారు. పెళ్లయిన నాయకులు అవినీతికి పాల్పడినట్లా అంటూ మోడీని ప్రశ్నించారు. ఇలా పలు సందర్భాల్లో తాను అవివాహితుడననే చాటుకున్న మోడీ ఎన్నికలవేళ పెళ్లి గుట్టును బయటపెట్టారు. 

అయితే ఏనాటికైనా భర్త దగ్గరకు చేరతావని జశోద బెన్ కు జ్యోతిష్యులు గతంలో చెప్పారుట. ఇప్పటికైనా ఈ మాట నిజమవుతుందా...? నలుగురు సోదరులు, ఒక సోదరి ఉన్న మోడీ ఎప్పుడైనా తల్లి దగ్గరే ఆశీర్వాదం తీసుకుంటారు. ఇకపై భార్య అభిమానాలు తోడవుతాయేమో! 






Tuesday 8 April 2014

వెయిట్రెస్ టూ పొలిటీషియన్.. స్మ్రుతి!

డిల్లీ.. మెక్ డోనల్డ్స్ రెస్టారెంట్లో ఆమె ఓ వెయిట్రెస్.
పేరు- స్మ్రుతి మల్ హోత్రా. చదువు మద్యలో ఆపేసింది. అందానికి మాత్రం ఏమీ తక్కువ లేదు. కష్టమర్స్ వస్తే పిజ్జాలు బర్గర్లూ అందించడం.. టేబుళ్ళు తుడవడం.. ఆమెపని. అంతకు ముందు జెట్ ఎయిర్వేస్ లో ఉద్యోగం కోసం ప్రయత్నిస్తే రాలేదు.

ఆ తర్వాత 2000 సంవత్సరంలో టీవీ లో నటిగా చాన్సులు వచ్చాయి. కే ఎస్ బీ కే బీ టీ అనే సీరియల్లో తులసి పాత్ర దొరికే దాకా స్మ్రుతి పెద్దగా పరిచయం లేని నటి. బాలాజీ టెలీ ఫిలింస్ లో ఎక్తా కపూర్ ఇచ్చిన ప్రోత్సాహంతో తులసిగా యావత్  భారత దేశానికి బందువుగా మారింది స్మ్రుతి. ఆ సీరియలే క్యోంకీ సాస్ భీ కభీ బహూ థీ. 1800 ఎపిసోడ్లు నడిచిన సీరియల్ ఇది. ఆ రోజుల్లో ఎక్కడికి వెళ్ళినా తులసి గానే గుర్తింపు. అప్పటి నుంచే స్మ్రుతి బుల్లితెర స్టార్గా మారింది.

ఆమె తండ్రి డిల్లీలో కొరియర్ కంపెనీ నడుపుతుంటాడు. ఆయన పంజాబీ. తల్లి బెంగాలీ. పదహారేళ్ళకే కెరీర్ దారులు వెతుక్కున్న స్మ్రుతి 1997లో మిస్ ఇండియా పోటీలకు వెల్లింది. అందం.. టాలెంట్ తో టాప్ ఫైవ్ దాకా వెళ్ళినా కిరీటం దక్క లేదు.

ఇక బాల్య స్నేహితుడు జుబిన్ ఇరానీ తో పెళ్ళి ఆమె జీవితాన్ని మలుపు తిప్పింది. జొరాస్ట్రియన్ మతానికి చెందిన జుబిన్ ఇరానీ - స్మ్రుతిని రెండో పెళ్ళి చేసుకున్నాడు. అప్పటికే అతనికి ఒక కూతురు. తర్వాత వీరికి ఇద్దరు పిల్లలు. జొహార్.. జొయిశ్. స్మ్రుతి మల్ హొత్రా నుంచీ స్మ్రుతి ఇరానీ గా మారాక ఆమె రాజకీయాల్లో అడుగు పెట్టింది.


వెయిట్రెస్.. మోడల్.. టీవీ నటి..ఇలాగే పాలిటిక్స్ లోనూ విజయమే. బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలిగా ఆ తర్వాత బీజేపీ ఉపాధ్యక్షురాలిగా మంచి గుర్తింపు వచ్చింది. అయితే ఢిల్లీ చాందినీ చౌక్ లోక్ సభ స్తానం నుంచి కాంగ్రెస్ కాండిడేట్ కపిల్ సిబాల్  మీద పోటీ చేసి వోడి పోయింది. ఆ తర్వాత గుజరాత్ నుంచి రాజ్య సభకు ఎన్నికయింది.

అసలు విషయం స్మ్రుతి ఇరానీ ఇప్పుడు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు, ఆ పార్టీ పీ ఎం అభ్యర్థి రాహుల్ గాంధీ పై అమేథీ నియోజక వర్గం నుంచి పోటీ చేస్తోంది.  38 ఏళ్ళ స్మ్రుతి ఇరానీ గెలుస్తుందా లేదా అనేది చర్చ. పీపుల్ ఫర్ చేంజ్ అనే ఎన్ జీ వో ద్వారా సామాజిక సేవ చేస్తున్న స్మ్రుతి అమేథి సెగ్మెంట్లో రాహుల్ గాంధీ ని ఎదురుకుంటోంది.

ఇంతకీ అక్కడి వోటర్లు - కే ఎస్ బీ కే బీ టీలో తులసిని ఆదరించినట్లుగా పొలిటీషియన్ స్మ్రుతిని ఆదరిస్తారా..?                                                                                                                
 

నీతి, నిజాయితీ, ధర్మం కలగలిసిన పాలనే రామరాజ్యం

రాముడు మంచి బాలుడే!

రామాయణం జీవిత విలువల్ని బోధించడమే కాదు వాటిని కాపాడేందుకు మార్గాలు చూపిస్తుంది. మనిషి గుణగణాలు ఎలాఉండాలన్నదానికి రఘుకులోత్తముడైన శ్రీరాముడు ప్రతీక. అలాగే సాద్వీమణి సీతమ్మ కూడా ఆడవారికి మార్గదర్శి. రాముడి నుంచి మనం ఏం నేర్చుకోవాలన్నది రామాయణం చెప్తుంది. దైవికశక్తులతో దుష్టసంహారం చేసిన చారిత్రక పురుషుడు శ్రీరాముడు. దైర్యసాహసాలు, సహనశీలత, దయార్ధగుణం, పితృవాక్యపాలన, ధర్మనిరపేక్షత... ఇలా చెప్పకుంటూపోతే చాలా గుణాలుంటాయి. అందుకే సకల గుణాభిరాముడంటారు.

దేవుడెలా ఉంటాడో చెప్పిన మహామనిషి

రాముడు మనిషా... దేవుడా అనే సందేహం రావచ్చు. రాముడు ఆదర్శవంతమైన రాజు. అందుకే చారిత్రక పురుషుడయ్యాడు. శ్రీమహావిష్ణు అవతారం. కాబట్టి దేవుడయ్యాడు. సకల శక్తి సంపన్నుడైన రాజుగా జనాధరణ పొందాడు. దశరథ మహారాజు మాటను జవదాటని   ఆదర్శ కుమారుడు రాముడు. ధర్మం నాలుగు పాదాలా నడిచేలా చూసిన ధర్మబద్ధపాలకుడు. ప్రజావాక్కునే దైవవాక్కుగా భావించిన న్యాయపరిపాలకుడు. ఏకపత్నీవ్రతానికి కట్టుబడిన ఆదర్శపతి. లక్ష్మణ, భరత, శత్రుఘ్నులకు మార్గనిర్దేశంనం చేసిన మంచి సోదరుడు. రావణుడి సోదరుడు విభీషణుడికి, వాలి సోదరుడైన సుగ్రీవుడికీ స్నేహహస్తం అందించిన మంచి మిత్రుడు. అతులిత బలశాలి హనుమంతుడికి గురువు. అందుకే రాముడు ఏ ఆజ్ఞ ఇచ్చినా శిరసావహించేందుకు ఎప్పుడూ వెనుకాడలేదు ఆ ఆంజనేయుడు.

ఆదర్శ కుమారుడు రాముడే

శ్రీరాముడు ఆదర్శ కుమారుడు కావడంతోనే రామాయణం మొదలవుతుంది. అయోధ్యానగరానికి రాజైన తండ్రి దశరథుడు,  తల్లి కౌసల్యాదేవి మాటను రాముడేనాడూ జవదాటలేదు. దశరథుడి మరో భార్య అయిన కైకేయి... రాముడు రాజ్యాన్ని విడిచి వెళ్లాలని కోరగానే తండ్రి మాటను కాదనకుండా అడవులకు వెళ్లిపోయాడీ ఆదర్శ కుమారుడు. రాచరిక దర్పాన్ని, భోగభాగ్యాలను, సుఖసౌఖ్యాలను తృణప్రాయంగా  భావించి అడవులకు వెళ్లిపోయిన నిరాడంబరత్వం రాముడిది.తనను రాజ్యం వదిలేసి వెళ్లమన్న తల్లి కైకేయి గురించి ఒక్క క్షణమైనా చెడుగా ఆలోచించలేదు. అరణ్యవాసం ముగించి తిరిగి రాజ్యానికి వచ్చినప్పుడు రాముడు మొదట కైకేయి పాదాలనే తాకి నమస్కరించాడు. ఆ తర్వాతే మిగతా ముగ్గురు తల్లులకు నమస్కరించాడు. రాముడు సదా తండ్రి మాటను గౌరవించడమొక్కటే తన ముందున్న మార్గమనుకున్నాడు.

సమర్ధుడైన సోదరుడు

లక్ష్మణ, భరత, శతృఘ్నులు ముగ్గురినీ సమానంగా ఆదరించిన అన్న రాముడు. సీతాదేవితో కలిసి రాముడు  అరణ్యవాసం చేస్తున్నప్పుడు  సోదరుడు లక్ష్మణుడు కూడా తోడుండేవాడు. రాజ్యానికి తిరిగిరావాలని, పాలనాధికారం చేబట్టాలని కోరేందుకు భరతుడు అన్నను వెతుక్కుంటూ అడవులకు వస్తాడు. అయితే భరతుడిని చూసిన లక్ష్మణుడు చెడుగా ఆలోచిస్తాడు. రాముడిని అరణ్యవాసానికి పంపించిన కైకేయి భరతుడికి తల్లి కావడమే ఆ కోపానికి కారణం. అయితే రాముడు సోదర ప్రేమతోనే ఆప్యాయంగా ఆహ్వానించి ఆదరిస్తాడు.

స్నేహశీలత చాటిన కిష్కింధకాండ

శ్రీరాముడిలోని స్నేహశీలతకు రామాయణంలోని కిష్కింధకాండ దర్పణం పడుతుంది. కిష్కింధ రాజైన వాలి సోదరుడు సుగ్రీవుడు, రావణుడి సోదరుడైన విభీషణుడు రాముడికి మంచి స్నేహితులు. సుగ్రీవుడి రాజ్యాన్ని తిరిగి అప్పగించడానికి రాముడు వాలిని హతమారుస్తాడు. లంకలో రావణుడితో యుద్ధం జరుగుతున్నప్పుడు న్నాయబద్ధ ఆలోచనతో విభీషణుడు రాముడికి అండగా నిలుస్తాడు. రావణ సంవారం తర్వాత లంకా రాజ్యాన్ని విభీషుణికే అప్పగించి తన గొప్పదనాన్ని చాటుకున్నాడు రాముడు.

ఏకపత్నీవ్రతుడిగా ఆదర్శనీయుడు

తండ్రి మాట జవదాటకుండా అడవుల్లోకి వెళ్తున్నప్పుడు ధర్మపత్రి సీతాదేవిని రాజ్యంలోనే ఉండిపొమ్మని ఎంతగానో నచ్చచెప్పాడు రాముడు. తాను అనుభవించబోయే కష్టాల్లో పాలుపంచుకోవాల్సిన అవసరం తన సతికి లేదనేది ఆయన భావన. అయినా సీతాదేవి పతియే ప్రత్యక్ష దైవమనుకుంటూ భర్తవెంట నడిచింది.

ప్రజాక్షేమం కోరిన రామరాజ్యం

అయోధ్య ప్రజలే తనకు ముఖ్యమనుకున్న ఆదర్శ రాజు రాముడు. అందుకే అరణ్యవాసం తర్వాత ఓ అనామకుడు లేవనెత్తిన సందేహాన్ని పరిగణనలోకి తీసుకుని కట్టుకున్న భార్యను అగ్ని పరీక్షకు పంపించాడు. ప్రజల మాటకు విలువనిచ్చాడే గానీ ఆ లోకాభిరాముడు ఏనాడూ సాద్వీమణి సీతాదేవిని శంకించలేదు. నీతి తప్పని ధర్మబద్ధపాలన అందించడమే రామ రాజ్యమనుకున్నాడు రాముడు. ప్రజలందరికీ సమాన న్యాయం, సమాన గౌరవం అందించడమే రాజుగా తన కర్తవ్యమని భావించాడు రాముడు. నీతి, నిజాయితీ, ధర్మం కలగలిసిన పాలనలోనే ప్రజలకు నిజమైన న్యాయం అందుతుందని ఆశించాడు. అందుకే సర్వాజనామోదం పొందిన మర్యాదాపురుషోత్తముడిగా కీర్తి ప్రతిష్టలందుకున్నాడు. 

Monday 7 April 2014

మెదక్ పిల్లగాడు నవ్వులతో “సంపు’తున్నడు!



టాలీవుడ్లో సరికొత్త సంచలనం.. సంపూర్ణేష్ బాబు. స్టయిల్, డైలాగ్ డెలివరీ అన్నీ కలిసి కడుపుబ్బా నవ్వించే కామెడీ. టోటల్గా బర్నింగ్ స్టార్ అన్న టైటిల్ సొంతం చేసుకున్నాడు. 



సంపూర్ణేష్ గెటప్ చూసి కన్నడసీమ కామెడీ ఆర్టిస్టేమో అనుకున్నారు. కానీ అతగాడు ఫక్తు తెలంగాణా కళాకారుడు. మెతుకుసీమ మెదక్ జిల్లా నుంచి హైదరాబాద్ సినీ ఇండస్ట్రీలో అవకాశాలు వెతక్కుంటూ వచ్చినవాడు.
        సొంతూర్లో గోల్డ్ స్మిత్ గా ఉపాధి పొందేవాడు. కానీ తనలో దాగిన నటన అక్కడ నిలవనీయలేదు. అందుకే సిటీకొచ్చి ఫిల్మ్ స్టూడియోల చుట్టూ చక్కర్లు కొట్టాడు. డైరెక్టర్లు, నిర్మాతల చుట్టూ ప్రదక్షిణలు చేశాడు. ఒకటి రెండు సినిమాల్లో కామెడీ, క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేస్తుండగా హృదయ కాలేయం అనే సినిమా ఛాన్సొచ్చింది. స్స్టీవెన్ శంకర్ అనే డైరెక్టర్ సంపూర్ణేష్ టాలెంటును గుర్తించాడు.
        హృదయ కాలేయం మూవీ ఆడియో రిలీజ్ ఫంక్షన్ కన్నా ముందే సంపూర్ణేష్ గురించి ఇండస్ట్రీలో టాక్ మొదలైంది. పబ్లిసిటీ కొత్తగా ఉండాలనే ఉద్దేశంతో యూట్యూబ్లో ట్రైలర్ పెడితే లక్షల్లో హిట్లు, లైకులు వచ్చాయి. దీంతో సినిమా రిలీజ్ కన్నా ముందే సంపు బర్నింగ్ స్టారై కూర్చున్నాడు. సినిమా రిలీజ్ తర్వాత మరిన్ని బాక్సాఫీసు హిట్లు. తొలిరోజే  కోటికి పైగా కలెక్షన్. వారం తిరక్కుండా బడాబడా సినిమాల కలెక్షన్లను దాటేసింది. ఇక శాటిలైట్ రైట్స్ ద్వారానూ దండిగానే ఆదాయం వచ్చిందిట.
థియేటర్ కు వెళ్లివచ్చిన వారంతా సంపు యాక్టింగ్కు హండ్రెడ్ మార్కులేస్తున్నారు. ముఖ్యంగా యూత్, సాఫ్ట్ వేర్ ఎంప్లాయీస్ రిపీటెడ్ ఆడియన్స్  జాబితాలో చేరారు. వెరైటీ కామెడీతో కడుపుబ్బా నవ్విస్తున్నాడని పొగుడుతున్నారు. మొత్తానికి తెలుగు ఇండస్ట్రీకి మెదక్ జిల్లా బాబూ మోహన్ తర్వాత మరో కామెడీ యాక్టర్ వచ్చాడు. నవ్వుల్లో ముంచెత్తుతున్నాడు.