Sunday 6 April 2014

మొసళ్ళ చెరువులో దూకిన మోడి

ఎనిమిదేళ్ళ వయస్సు..
ఇతర పిల్లలెవరయినా చెరువులో నీళ్ళు చూస్తే ఆమడ
దూరం పరిగెడతారు. అందులో భయంకమైన మొసళ్ళు ఉన్నాయని తెలిస్తే అటువైపు కూడా చూడరు. కానీ ఒకానొక రోజు గుజరాత్ లోని వాడ్ నగర్ అనే ఊర్లో ఎనిమిదేళ్ళ వయస్సున్న పిల్లాడు ఆ చెరువులోకి దూకా|డు. ఈతకొట్టడానికి కాదు. ఆ చెరువు మద్యలో ఉన్న చిన్న గుడి గోపురం మీద కాశాయం జెండాను మార్చడానికి.

ఆ రోజుల్లో భారీ వర్షాల కారణంగా చెరువు నిండు కుండలా పొంగి పొరలుతోంది. అందులో మొసళ్ళు కూడా ఉండడంతో వూరి వాళ్ళువరూ అంత సాహసం చేయలేదు. కాని ఆ బాలుడు దైర్యంగా ఈదుకుంటూ వెళ్ళి గుడి గోపురం పైన కాశాయం జెండా  మార్చాడు. ఆ సహసి ఎవరో కాదు. అతనే ఈనాటి నరేంద్ర దామోదర దాస్ మోడి. బీజేపీ ప్రధాని అభ్యర్థి.
.            
మోడీ బాల్యంలో తండ్రితో పాటు రైల్వే స్టేషన్లో చాయ్ అమ్మేవాడు. చదువుకునే వయసులో ఓ న్యాయవాది ప్రోత్సాహంతో సంఘ్ లో స్వయం సేవక్ గా చేరాడు. బడిలో స్కౌట్ సభ్యుడిగా చురుకైనా పాత్ర పోషించాడు. సమస్త బాల భారతానికీ.. రేపటి తరానికీ మోడీ బాల్యం మార్గదర్శనమే కదా...?  ప్రధాని కావాలనుకుంటున్న మోడి ఈ రాజకీయ మహాసాగరంలో అంత సులువుగా ఈదగలుగుతాడా?                             
  

No comments: