బార్బీ అంటే పడుచుపిల్లలకు ప్రాణం.
అచ్చం బార్బీ లాగానే ఉండాలనుకునే అమ్మాయిల సంఖ్యకు లెక్కలేదు. అయితే రష్యాలో నిజమైన బార్బీ ఉంది.
|
వలేరియా లుక్యనోవా
|
|
లివింగ్ బార్బీ ఒరిజినల్ సోకులు!
|
ఆమే 28 ఏళ్ళ వలేరియా లుక్యనోవా. 1985లో ఉక్రయిన్లో పుట్టింది. ఎత్తు 5.7 అడుగులు. బరువు 42 కిలోలు. వలేరియా లుక్యనోవా 2007లో అందాల పోటీల్లో పాల్గొని మిస్ డైమండ్ క్రౌన్ ఆఫ్ వరల్డ్ కిరీటం దక్కించుకుంది. ఇక అప్పటి నుంచి వలేరియా లుక్యనోవా లివింగ్ బార్బీ గా గుర్తింపు సంపాదించింది. అచ్చం బార్బీగా కనిపించేందుకు లెన్స్ వాడుతోంది. బార్బీలాగా శరీర సౌష్టవం కనిపించేందుకు ప్రతినిత్యం జిమ్ముకు వెలుతుంది. పింక్ కలర్లో ఉండే సింథటిక్ దుస్తులే వేసుకుంటుంది. 365 రోజులూ ఇదే గెటప్లో కనిపిస్తుంది. అయితే బార్బీ తరహా దుస్తులు కాకుండా మామూలుగా ఆమె ఎలా ఉంటుందనే ఆసక్తి అందరికీ ఉంటుంది! అందుకే ఈ బార్బీ బొమ్మ ఓన్ గెటప్లో తీసుకున్న ఫోటోలను అన్ లైన్లో పెట్టింది. బార్బి అభిమానులైన అమ్మాయిలంతా లివింగ్ బార్బీ ఒరిజినల్ గెటప్ ఇమేజెస్ చూసి తెగ ముచ్చట పడుతున్నారు.
No comments:
Post a Comment