టాలీవుడ్లో
సరికొత్త సంచలనం.. సంపూర్ణేష్ బాబు. స్టయిల్, డైలాగ్ డెలివరీ అన్నీ కలిసి కడుపుబ్బా
నవ్వించే కామెడీ. టోటల్గా బర్నింగ్ స్టార్ అన్న టైటిల్ సొంతం చేసుకున్నాడు.
సంపూర్ణేష్
గెటప్ చూసి కన్నడసీమ కామెడీ ఆర్టిస్టేమో అనుకున్నారు. కానీ అతగాడు ఫక్తు తెలంగాణా కళాకారుడు.
మెతుకుసీమ మెదక్ జిల్లా నుంచి హైదరాబాద్ సినీ ఇండస్ట్రీలో అవకాశాలు వెతక్కుంటూ వచ్చినవాడు.
సొంతూర్లో గోల్డ్ స్మిత్ గా ఉపాధి పొందేవాడు.
కానీ తనలో దాగిన నటన అక్కడ నిలవనీయలేదు. అందుకే సిటీకొచ్చి ఫిల్మ్ స్టూడియోల చుట్టూ
చక్కర్లు కొట్టాడు. డైరెక్టర్లు, నిర్మాతల చుట్టూ ప్రదక్షిణలు చేశాడు. ఒకటి రెండు సినిమాల్లో
కామెడీ, క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేస్తుండగా ‘హృదయ
కాలేయం’ అనే సినిమా ఛాన్సొచ్చింది. స్స్టీవెన్ శంకర్ అనే డైరెక్టర్
సంపూర్ణేష్ టాలెంటును గుర్తించాడు.
హృదయ కాలేయం మూవీ ఆడియో రిలీజ్ ఫంక్షన్ కన్నా
ముందే సంపూర్ణేష్ గురించి ఇండస్ట్రీలో టాక్ మొదలైంది. పబ్లిసిటీ కొత్తగా ఉండాలనే ఉద్దేశంతో
యూట్యూబ్లో ట్రైలర్ పెడితే లక్షల్లో హిట్లు, లైకులు వచ్చాయి. దీంతో సినిమా రిలీజ్ కన్నా
ముందే సంపు బర్నింగ్ స్టారై కూర్చున్నాడు. సినిమా రిలీజ్ తర్వాత మరిన్ని బాక్సాఫీసు
హిట్లు. తొలిరోజే కోటికి పైగా కలెక్షన్. వారం
తిరక్కుండా బడాబడా సినిమాల కలెక్షన్లను దాటేసింది. ఇక శాటిలైట్ రైట్స్ ద్వారానూ దండిగానే ఆదాయం వచ్చిందిట.
థియేటర్ కు వెళ్లివచ్చిన
వారంతా సంపు యాక్టింగ్కు హండ్రెడ్ మార్కులేస్తున్నారు. ముఖ్యంగా యూత్, సాఫ్ట్ వేర్
ఎంప్లాయీస్ రిపీటెడ్ ఆడియన్స్ జాబితాలో చేరారు.
వెరైటీ కామెడీతో కడుపుబ్బా నవ్విస్తున్నాడని పొగుడుతున్నారు. మొత్తానికి తెలుగు ఇండస్ట్రీకి
మెదక్ జిల్లా బాబూ మోహన్ తర్వాత మరో కామెడీ యాక్టర్ వచ్చాడు. నవ్వుల్లో ముంచెత్తుతున్నాడు.
No comments:
Post a Comment