Thursday 17 April 2014

ద్వేషించకు.. ప్రేమించు!


పాపుల్ని ద్వేషించకు.. వారిని ప్రేమించు.. మంచి మనసుతో క్షమించు...


ప్రేమమూర్తి అయిన ఏసుక్రీస్తు విశ్వమానవాళికి చేసిన బోధన సారాంశం ఇదే. కల్వరి కొండ మీద శిలువనెక్కిన కరుణామయుడి నోటి వెంట ఆఖరిక్షణాల్లో వచ్చిన మాటల పరమార్ధం. 


      శిలువ మీద ఏసుక్రీస్తు ప్రాణం విడిచిన రోజు గుడ్ ఫ్రైడే. క్రైస్తవులంతా చర్చిల్లో ప్రాయశ్చిత్త ప్రార్ధనలు చేసే రోజు. ప్రజల కోసం ప్రాణం విడిచిన ఏసునులుచుకునే తరుణం. ప్రతినిత్యం జరిగే ప్రేయర్స్ గుడ్ ఫ్రైడే రోజున ఉండవు. చర్చిల్లో గంటలు కూడా మోగవు. కేవలం ఉపవాస దీక్షలు, క్రీస్తు నామస్మరణే.


      తన ప్రాణాలను పరలోకానికి పంపుతూ ప్రేమమూర్తి పలికిన ఏడు వాక్యాల్ని క్రైస్తువులు ధ్యానం చేస్తారు. ఆ మొదటి వాక్యం ఓ తండ్రీ.. ఈ పాపుల్ని క్షమించు.. ఎందుకంటే తాము చేస్తున్నదేమిటో వారికే తెలియదు..


తనను శిలువనెక్కించిన పాపుల్ని కూడా ఆయన క్షమించాడు. పాపుల్ని ద్వేషించం కాకుండా క్షమించడమే ధర్మమని చాటాడు. ఇక ఏడోదైన ఆ చివరి వాక్యం చూద్దాం.. ఓ తండ్రీ..  నా ప్రాణాల్ని నీ చేతుల్లో ఉంచుతున్నాను... ఈ వాక్యంతో ఏసుక్రీస్తు పరలోకానికి వెళ్లాడు. దేవుడు తనకు అప్పగించిన కర్తవ్యాన్ని పూర్తిచేసుకుని ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్లాడు. శుక్రవారం పరలోకానికి ఏగిన ఏసుక్రీస్తు- మళ్లీ రెండు రోజుల తర్వాత ఆదివారం రోజున పునరుత్థానం పొందుతాడు. అదే ఈస్టర్ సండే. ఆ రోజున ఏసుక్రీస్తు మళ్లీ జన్మించిన రోజుకు గుర్తుగా చర్చిల్లో ప్రత్యేక ప్రార్దనలు జరుగుతాయి. అయితే ఆయన బోధనలు నిత్య స్మరణీయం. ప్రేమ, దయ, క్షమాగుణం.. ప్రతి మనిషి ఆచరించాల్సిన  జీవన సూత్రాలు.       



No comments: