Tuesday, 8 April 2014

వెయిట్రెస్ టూ పొలిటీషియన్.. స్మ్రుతి!

డిల్లీ.. మెక్ డోనల్డ్స్ రెస్టారెంట్లో ఆమె ఓ వెయిట్రెస్.
పేరు- స్మ్రుతి మల్ హోత్రా. చదువు మద్యలో ఆపేసింది. అందానికి మాత్రం ఏమీ తక్కువ లేదు. కష్టమర్స్ వస్తే పిజ్జాలు బర్గర్లూ అందించడం.. టేబుళ్ళు తుడవడం.. ఆమెపని. అంతకు ముందు జెట్ ఎయిర్వేస్ లో ఉద్యోగం కోసం ప్రయత్నిస్తే రాలేదు.

ఆ తర్వాత 2000 సంవత్సరంలో టీవీ లో నటిగా చాన్సులు వచ్చాయి. కే ఎస్ బీ కే బీ టీ అనే సీరియల్లో తులసి పాత్ర దొరికే దాకా స్మ్రుతి పెద్దగా పరిచయం లేని నటి. బాలాజీ టెలీ ఫిలింస్ లో ఎక్తా కపూర్ ఇచ్చిన ప్రోత్సాహంతో తులసిగా యావత్  భారత దేశానికి బందువుగా మారింది స్మ్రుతి. ఆ సీరియలే క్యోంకీ సాస్ భీ కభీ బహూ థీ. 1800 ఎపిసోడ్లు నడిచిన సీరియల్ ఇది. ఆ రోజుల్లో ఎక్కడికి వెళ్ళినా తులసి గానే గుర్తింపు. అప్పటి నుంచే స్మ్రుతి బుల్లితెర స్టార్గా మారింది.

ఆమె తండ్రి డిల్లీలో కొరియర్ కంపెనీ నడుపుతుంటాడు. ఆయన పంజాబీ. తల్లి బెంగాలీ. పదహారేళ్ళకే కెరీర్ దారులు వెతుక్కున్న స్మ్రుతి 1997లో మిస్ ఇండియా పోటీలకు వెల్లింది. అందం.. టాలెంట్ తో టాప్ ఫైవ్ దాకా వెళ్ళినా కిరీటం దక్క లేదు.

ఇక బాల్య స్నేహితుడు జుబిన్ ఇరానీ తో పెళ్ళి ఆమె జీవితాన్ని మలుపు తిప్పింది. జొరాస్ట్రియన్ మతానికి చెందిన జుబిన్ ఇరానీ - స్మ్రుతిని రెండో పెళ్ళి చేసుకున్నాడు. అప్పటికే అతనికి ఒక కూతురు. తర్వాత వీరికి ఇద్దరు పిల్లలు. జొహార్.. జొయిశ్. స్మ్రుతి మల్ హొత్రా నుంచీ స్మ్రుతి ఇరానీ గా మారాక ఆమె రాజకీయాల్లో అడుగు పెట్టింది.


వెయిట్రెస్.. మోడల్.. టీవీ నటి..ఇలాగే పాలిటిక్స్ లోనూ విజయమే. బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలిగా ఆ తర్వాత బీజేపీ ఉపాధ్యక్షురాలిగా మంచి గుర్తింపు వచ్చింది. అయితే ఢిల్లీ చాందినీ చౌక్ లోక్ సభ స్తానం నుంచి కాంగ్రెస్ కాండిడేట్ కపిల్ సిబాల్  మీద పోటీ చేసి వోడి పోయింది. ఆ తర్వాత గుజరాత్ నుంచి రాజ్య సభకు ఎన్నికయింది.

అసలు విషయం స్మ్రుతి ఇరానీ ఇప్పుడు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు, ఆ పార్టీ పీ ఎం అభ్యర్థి రాహుల్ గాంధీ పై అమేథీ నియోజక వర్గం నుంచి పోటీ చేస్తోంది.  38 ఏళ్ళ స్మ్రుతి ఇరానీ గెలుస్తుందా లేదా అనేది చర్చ. పీపుల్ ఫర్ చేంజ్ అనే ఎన్ జీ వో ద్వారా సామాజిక సేవ చేస్తున్న స్మ్రుతి అమేథి సెగ్మెంట్లో రాహుల్ గాంధీ ని ఎదురుకుంటోంది.

ఇంతకీ అక్కడి వోటర్లు - కే ఎస్ బీ కే బీ టీలో తులసిని ఆదరించినట్లుగా పొలిటీషియన్ స్మ్రుతిని ఆదరిస్తారా..?                                                                                                                
 

1 comment:

hari.S.babu said...

just like sonia - bar girl in italy to (?) in india