Monday 28 April 2014

ఓన్లీ మ్యాన్ షో

http://aptopnews.com/life-and-style/545-2014-04-27-11-58-18

ఇండియన్ పాలిటిక్స్ ఓన్లీ మ్యాన్ షోగా మారిపోయాయి. జనాభాలో సగం.. ఓటర్లలో సగం ఉన్న మహిళలకు రాజకీయాల్లో మాత్రం సమాన వాటా లేదు. అందరూ మహిళల్ని ఉద్ధరిస్తామని చెప్పేవారే. కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీ, రాష్ట్రీయ లోక్ దళ్.. ఇలా సాంప్రదాయ పార్టీలన్నీ మహిళా రిజర్వేషన్ బిల్లును చాలా జాగ్రత్తగా అటకెక్కించేశాయి. తమకు ప్రయోజనం చేకూర్చే అంశాల్లో అధికార, విపక్షాలు తెలివిగా చేతులు కలుపుతాయి. అదే ప్రజా ప్రయోజనం ఉండేపక్షంలో అందరూ తలోమాటా చెప్పి చట్ట సభల్లో తొక్కి పెట్టేయడం ఆనవాయితీగా మారింది. మహిళా బిల్లు విషయంలో ఏళ్ల తరబడిగా ఇదే జరుగుతోంది. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ మహిళ. బీఎస్పీ చీఫ్ మాయావతి, అన్నా డీఎంకే అధినేత్రి జయలలిత, తృణమూల్ కాంగ్రెస్ చీఫ్ మమతా బెనర్జీ.. ఇలా ప్రముఖ పార్టీల పగ్గాలు మహిళల చేతుల్లోనే ఉన్నాయి. జయ, మమత రెండు ప్రధాన రాష్ట్రాలకు సీఎంలుగా ఉన్నారు. మాయావతి ఒకప్పుడు సీఎం పదవి వెలగబెట్టారు. కానీ ఎన్నికల్లో మహిళలకు మాత్రం టికెట్లు తక్కువే. వారసులుగా వచ్చే మహిళలే తప్ప ఇతరులకు ఛాన్సే లేదు. 

http://aptopnews.com/life-and-style/545-2014-04-27-11-58-18

మన పార్లమెంటు ఉభయ సభల్లో మహిళల ప్రాతినిథ్యం కేవలం పదకొండు శాతం. అదే పాకిస్థాన్ లో 21 శాతం. రాజకీయంగా ఎంతో అస్థిరత ఉండే ఆప్ఘనిస్థాన్ లోనూ మన కంటే మూడు రెట్ల సంఖ్యలో మహిళా ఎంపీలున్నారు. అంటే  28 శాతం. మనదేశంలో ఎన్నికల వేళ మహిళల ఓట్ల కోసం పార్టీలన్నీ నానా తంటాలు పడుతున్నాయి.

No comments: