Wednesday 8 May 2013

డబ్బున్న బ్యాచిలర్ మళ్లీ గెలిచాడోచ్!

యంగ్ తరంగ్!

డబ్బున్న ఓ బ్యాచిలర్ ఎమ్మెల్యే... శీర్షికతో ఈమధ్య నేనో పోస్టు పెడితే అనూహ్య స్పందన వచ్చింది. నా బ్లాగులో టాప్ టెన్ పోస్టుల్లోనూ ఇదే రెండో ప్లేసులోకి వచ్చింది. ఎందుకోగానీ చాలా మంది అమ్మాయిలు స్పందించారు. ఇంకా ముప్పై ఏళ్లయినా నిండకుండానే కర్నాటకలో ఎమ్మెల్యేగా గెలిచిన ప్రియా కృష్ణ గురించిన ఆసక్తికరమైన కథనం ఇది. 

 

ప్రస్తుత ఎన్నికల్లోనూ ప్రియా కృష్ణ కాంగ్రెస్ అభ్యర్థిగా రెండో దఫా ఎమ్మెల్యేగా గెలిచారు. బెంగళూరు గోవిందనగర్ నియోజకవర్గంలో ఈ యువ నాయకుడు బీజేపీ అభ్యర్థి మీద సుమారు 42 వేల ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. అధికారికంగా వెల్లడించిన ఆస్తుల లెక్క ప్రకారం ప్రియా కృష్ణన్ అత్యంత సంపన్నుడు. మొత్తం ఆస్తులు తొమ్మిది వందల కోట్లు దాటాయి. ఈ యువనేత రెండోసారి విజయం సాధించినందుకు ఆల్ ది బెస్ట్. ప్రియా కృష్ణ ఆసక్తికరమైన కథనం గురించి ఈ కింది లింకు నొక్కండి.....   

డబ్బున్న ఓ బ్యాచిలర్ ఎమ్మెల్యే!

6 comments:

Anonymous said...

డబ్బు లేని బ్రహ్మచారి గెలుస్తాడా మన ఎన్నికలలో అది కలలోని మాటే కదా!!!!!!

nihar said...

సూర్యప్రకాశ్ గారూ బాగా చెప్పారు. ఈ డబ్బున్న బ్యాచిలర్ అట్లాంటి ఇట్లాంటి సౌండ్ పార్టీ కాదు... ఏకంగా తొమ్మిది వందల కోట్లకు పైమాటే. పైగా 29 ఏళ్లకే రెండోసారి ఎమ్మెల్యేగా విజయం... డబ్బు లేకుండా ఎవరూ గెలవరనేది అక్షరసత్యం... థాక్స్... నిహార్

Anonymous said...

yes,yes. . మీ టపా గుర్తుంది. గొప్ప వ్యక్తే. ఏమౌతాడో చూడాలి future లో.

nihar said...

అనూ గారూ థాంక్యూ... రాజకీయ వారసత్వం ఉంటే ఎంతెత్తులకైనా ఎదగడం మన దేశంలో సాధ్యమే...నిహార్

జలతారు వెన్నెల said...

హా హా!! గెలిచాడన మాట!

nihar said...

జలతారువెన్నెల గారూ... డబ్బున్న బ్యాచిలర్ మళ్లీ గెలిచాడు... మీరు చదివి స్పందించినందుకు థాంక్స్. మీలాగే చాలా మంది ఈ పోస్టు చదివారు. టాప్ టెన్ లో థర్డ్ ప్లేసులోకి వచ్చేసింది....అందరికీ కృతజ్ఞతలు... నిహార్