దీపకాంతుల్లో జీవనసత్యం!
బుద్ధం శరణం గచ్చామి!
బుద్ధం శరణం గచ్చామి.... సియోల్ లాంథర్ ఫెస్టివల్లో పాల్గొనే లక్షల మంది నినాదం. ఇదే వారి జీవన సూత్రం. గౌతమ బుద్ధుడి బోధనలు దేశవిదేశాల్లో వేనవేల మందిని ప్రభావితం చేశాయి.... చేస్తున్నాయి...చేస్తూనే ఉంటాయి.
సిద్ధార్థుడు కుచ్చితంగా ఎప్పుడు జన్మించాడో తెలియదు కానీ క్రీస్తు పూర్వం 563 నుంచి 483 మద్యలో పుట్టి ఉంటాడని చరిత్రకారుల అంచనా. ప్రపంచంలోనే ఏకైక హిందూ దేశమైన నేపాల్లో ఆయన జన్మించారు. అప్పట్లో ప్రాచీన భారతదేశం కిందకి వచ్చే కపిలవస్తు దేశంలోని లుంబినిలో బుద్ధుడు జన్మించాడు. దక్షిణ కొరియాలో ఏటా బుద్ధుని జయంతిని ఘనంగా జరుపుకుంటారు. బౌద్ధమత ఆరాధకులంతా ఈ ఉత్సవల్లో పాల్లొంటారు. రంగురంగుల విద్యుద్దీపాలతో ప్రదర్శన నిర్వహించి, ఆ తర్వాత వాటిని ఆకాశంలోకి వదిలిపెట్టడం కన్నులపండువగా ఉంటుంది.
కొరియా తో పాటు థాయ్ లాండ్, తైవాన్, మయన్మార్, టిబెట్, మంగోలియా తదితర ప్రాంతాల నుంచి సియోల్ లో ఏటా జరిగే లాంథర్ ఫెస్టివల్ చూసేందుకు బౌద్ధులు వస్తుంటారు.
No comments:
Post a Comment