లేడీసుకు 'రివర్స్' ప్రాబ్లం!
ముందుకైతే దూసుకుపోతారు...!
హైదరాబాద్ నగరమనేంటి రాష్ట్రంలో చిన్నాచితకా పట్టణాల్లోనూ మహిళలు కార్లు నడపేస్తున్నారు. డ్రైవింగ్ స్కూళ్లలో నలభై శాతం మంది మహిళలే ఉంటున్నారు. ఇదివరకు వందలో ఒకటిఅరా వాహనాలు లేడీస్ డ్రైవ్ చేస్తున్నవి కనిపించేవి. ఇప్పుడు కార్లు నడిపే మహిళలు పెరిగారు. మగవారితో పోల్చితే ఆడవారు వాహనాన్ని పర్ ఫెక్ట్ గా నడపగలరనేది నిపుణుల విశ్లేషణ. అయితే రివర్స్ గేరుతోనే ఆడవారికి ప్రాబ్లం ఎక్కువని ఈమధ్య ఓ సర్వేలో తేలింది.
ఎదురుగుండా రోడ్డు క్లియర్ గా ఉంటే ఎన్నికిలోమీటర్లయినా దూసుకుపోయే మహిళలు రివర్స్ లో బండిని పార్క్ చేయాల్సివచ్చిందంటే బెంబేలెత్తిపోతున్నారట. పార్కింగ్ కాంప్లెక్సుల్లో బాక్సులు గీసి ఉన్నా వాహనాన్నిసరైన డైరెక్షన్ లో పెట్టడం ఇబ్బందిగా ఉంటోందిట.
డ్రైవింగ్ లైసెన్సు కోసం వెళ్తున్న మహిళలు రివర్స్ గేరుతో ఎక్కువగా కంగారుపడి టెస్ట్ గట్టెక్కడం లేదని బ్రిటన్ అధ్యయనం తేల్చింది. అయితే డ్రైవింగ్ టెస్టులో మగవారెక్కువగా రోడ్ సిగ్నల్స్ విషయంలో పొరపాట్లు చేస్తున్నారు. ఇంతేకాదు డ్రైవింగ్ టెస్టుల్లో యూటర్న్, సర్కిల్ లాంటి చోట్ల మగవారు ఎక్కువగా తప్పులు చేస్తున్నారు. కానీ ఆడవారు మాత్రం అన్నిచోట్టా దాదాపు పర్ఫెక్టుగానే బండితోలగలరు గానీ రివర్స్ దగ్గరే సమస్య వస్తోందిట.
రివర్స్ లో పార్కింగు చేసేప్పుడే ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. వెహికల్ రివర్స్ లో వెనుక ఉన్న వాహనాలకు, గోడలకు డీకొట్టడమనేది 60 శాతం జరుగుతున్నాయి. రివర్స్ వెళ్తున్నప్పుడు స్టీరింగ్ సరిగ్గా తిప్పడం తెలియక పక్కనే ఆడుకునే పిల్లల మీదకు ఎక్కించేస్తున్న ఘటనలూ జరుగుతున్నాయి. టోటల్ ప్రమాదాల్లో ఇలాంటివి 14 శాతం. అందుకే కార్ల వెనుక వైపున ఎప్పుడూ ఉండకండి. రివర్స్ గేరు ప్రాబ్లం ఉన్న వారు డ్రైవింగ్ సీటులో కూర్చుంటే మనకు ప్రాబ్లం. జాగ్రత్త సుమీ...!
No comments:
Post a Comment