Saturday 25 January 2014

...అదిగో ఎగిరే భరత పతాకం!

 

సురాజ్యమవలేని స్వరాజ్యమెందుకనీ

సుఖాన మనలేని వికాసమెందుకనీ

నిజాన్ని బలికోరే సమాజమెందుకనీ

అడుగుతోంది అదిగో ఎగిరే భరత పతాకం

వోటరు దేవుళ్లు


రేపటి తరానికి ఆచరణీయం.. ఆదర్శనీయం
అనాగరికులు, అజ్ఞానులు, సోమరిపోతులు కాదు
సమాజ నిర్మాణంలో పాల్గొనే వారు వోటరు దేవుళ్లు

విద్యావేత్త, వ్యవసాయదారు, అభ్యుదయ వాది..
వెరసి సమాజ నిర్మాణంలో పాల్గొనే ఒక మార్గ దర్శకుడు







Friday 24 January 2014

ఆడపిల్ల అగ్నికుంపటి కాదు.. అమృత కలశం

(జాతీయ బాలికల దినోత్సవం)



లింగ నిర్థారణ పరీక్షలు చట్టవ్యతిరేకమని, భ్రూణహత్యలు శిక్షార్హమైన నేరాలని ప్రభుత్వం ఎంతగా హెచ్చరికలు చేస్తున్నా, తల్లిదండ్రుల వైఖరిలో మార్పు లేదని మన రాష్ట్ర జనాభా లెక్కలు ఘోషిస్తున్నాయి. 2011 జనాభా లెక్కల వివరాలను పరిశీలిస్తే రాష్ట్రంలో బాలికల సంఖ్య తగ్గుముఖం పట్టిందని తేటతెల్లమవుతోంది.

బాలురతో పోలిస్తే బాలికల నిష్పత్తి గణనీయంగా తగ్గుతున్నట్లు, మరోవైపు పట్టణ ప్రాంతాల్లో స్ర్తి, పురుష నిష్పత్తి కూడా తగ్గుతున్నట్లు జనాభా లెక్కలు చెబుతున్నాయి. ఆరేళ్ల లోపు వయసులో ప్రతి వెయ్యి మంది బాలురకు 943 మంది బాలికలు ఉన్నట్లు తేలడం ఎవరినైనా కలవరపెడుతుంది. బాలబాలికల నిష్పత్తిలో ఇంతటి తేడా ఉండడం రాబోయే కాలంలో సమాజంపై తీవ్ర దుష్ఫలితాలు చూపే ప్రమాదం ఉంది.

మన రాష్ట్రంలో మొత్తం 1128 మండలాలు ఉండగా, 1066 మండలాల్లో ఆడపిల్లలు తక్కువగా ఉన్నారు. బాలికలు తక్కువగా ఉన్న మండలాల సంఖ్య 2001లో 12 మాత్రమే కాగా, 2011లో ఈ సంఖ్య 122 కావడం గమనార్హం. ప్రతి వెయ్యి మంది బాలురకు గ్రామీణ ప్రాంతాల్లో బాలికల సంఖ్య 942 కాగా, పట్టణ ప్రాంతాల్లో 946గా నమోదైంది. 2001లో గ్రామాలకు సంబంధించి బాలికల సంఖ్య 963, పట్టణ ప్రాంతాల్లో 955గా ఉంది.

దశాబ్ద కాలంలో పల్లెలు, పట్టణాలనే వ్యత్యాసం లేకుండా బాలికల సంఖ్య తగ్గుతోంది. 2011 జనాభా లెక్కల ప్రకారం బాలికల సంఖ్య (వెయ్యి మంది బాలురకు) మహబూబ్‌నగర్ జిల్లా ఆలంపూర్ మండలంలో 704 ఉండగా, నల్లగొండ జిల్లా చిట్యాల మండలంలో 528గా ఉంది. 2001లో ఏ మండలంలోనూ బాలికల సంఖ్య 800 కంటే తక్కువగా లేదు. 2001లో 111 మండలాల్లో బాలుర కంటే బాలికల జనాభా ఎక్కువగా ఉండేది. పదేళ్ల కాలంలో అనూహ్యంగా బాలికల సంఖ్య తగ్గుముఖం పట్టిందని తేలింది. 2011 లెక్కల మేరకు 62 మండలాల్లో మాత్రం బాలికలు సల్వ సంఖ్యలో అధికంగా ఉన్నారు.
 
బాలికల సంఖ్య 900 కన్నా తగ్గడం ఆందోళనకర పరిణామమని నిపుణులు అంటున్నారు. 15 మండలాల్లో బాలికల సంఖ్య 850 కన్నా మించకపోవడం మరో విపరిణామం. ఇక- జనాభాలో మహిళల నిష్పత్తి కూడా తగ్గిపోతోంది. ప్రతి వెయ్యి మంది పురుషులకు మహిళల నిష్పత్తి 992గా ఉంది. 481 మండలాల్లో పురుషుల కంటే మహిళలు అధికంగా ఉన్నారు. ఆదిలాబాద్, విజయనగరం జిల్లాల్లో మాత్రం మహిళల జనాభా ఎక్కువగా ఉంది. 76 మండలాల్లో మహిళల నిష్పత్తి 950 కన్నా తక్కువగా ఉంది. 5 మండలాల్లో ఈ సంఖ్య 900 కన్నా తగ్గిపోయింది. రాష్ట్ర రాజధానిలోని గోల్కొండ, ఖైరతాబాద్, జిన్నారంతో పాటు శ్రీశైలం, విజయవాడ రూరల్ మండలాల్లో మహిళలు తక్కువ సంఖ్యలో ఉన్నారని తేలింది. ఇక గత పదేళ్లలో పట్టణ జనాభా వృద్ధి రేటు పెరిగి, గ్రామీణ జనాభా వృద్ధి రేటు తగ్గింది. పట్టణ ప్రాంతాలకు వలసలు పెరగడం, ఉమ్మడి కుటుంబాల సంఖ్య బాగా తగ్గిపోవడంతో పిల్లల జనాభా తగ్గుతోంది.

బాలికలైతే భారమని, మగపిల్లలైతే లాభమన్న భావన కారణంగానే తల్లిదండ్రులు ఆడశిశువులంటేనే అయిష్టత చూపుతున్నారు. ఈ కారణంతోనే కొందరు లింగ నిర్ధారణ పరీక్షలకు, మరికొందరైతే భ్రూణహత్యలకు సైతం తెగిస్తున్నారు. సామాజిక, ఆర్థిక పరిస్థితుల కారణంగా గత దశాబ్ద కాలంలో శిశు జనాభా తగ్గింది. 2001- 2010 కాలంలో పిల్లల జనాభా -7.23 నుంచి -15.03గా నమోదైంది.

గ్రామీణ జ నాభా పెరుగుదలలో ఆదిలాబాద్ అగ్రభాగాన, కృష్ణా జిల్లా దిగువ భాగాన ఉన్నాయ. పట్టణ జనాభా వృద్ధిలో రంగారెడ్డి జిల్లా తొలి స్థానంలోనూ, ఆదిలాబాద్ చివరి స్థానంలోనూ నిలిచాయి.ఆడపిల్ల పుడుతుందని తెలిస్తే అబార్షన్‌లు చేయించేందుకు గర్భిణులపై కొన్ని కుటుంబాల్లో వత్తిడి చేస్తున్న సంఘటనలు రాష్ట్రంలో వెలుగు చూస్తున్నాయి.

ఆకులో ఆకునై పూవులో పూవునై...



ఆకులో ఆకునై పూవులో పూవునై
కొమ్మలో కొమ్మనై నునులేత రెమ్మనై
ఈ అడవి దాగిపోనా… ఎటులైనా ఇచటనే ఆగిపోనా…

ఆకులో ఆకునై పూవులో పూవునై
కొమ్మలో కొమ్మనై నునులేత రెమ్మనై
ఈ అడవి దాగిపోనా… ఎటులైనా ఇచటనే ఆగిపోనా…

గలగలనీ వీచూ చిరుగాలిలో కెరటమై..
గలగలనీ వీచూ చిరుగాలిలో కెరటమై..
ఝలఝలనీ పారూ సెలపాటలో తేటనై
పగడాల చిగురాకు తెరచాటు తేటినై
పరువంపువిరిచేడే చిన్నారి సిగ్గునై
ఈ అడవి దాగిపోనా… ఎటులైనా ఇచటనే ఆగిపోనా…
ఈ అడవి దాగిపోనా… ఎటులైనా ఇచటనే ఆగిపోనా…

తరులెక్కి అలనీలి గిరినెక్కి మెలమెల్ల..
తరులెక్కి అలనీలి గిరినెక్కి మెలమెల్ల
చదులెక్కి జలదొంపునీలంపు నిగ్గునై
ఆకలా దాహమా.. చింతలా వంతలా..
ఈ తరలి వెర్రినై ఏకతమా తిరుగాడ
ఈ అడవి దాగిపోనా… ఎటులైనా ఇచటనే ఆగిపోనా…
ఈ అడవి దాగిపోనా… ఎటులైనా ఇచటనే ఆగిపోనా…

ఆకులో ఆకునై పూవులో పూవునై
కొమ్మలో కొమ్మనై నునులేత రెమ్మనై
ఈ అడవి దాగిపోనా… ఎటులైనా ఇచటనే ఆగిపోనా…
.. ఎటులైనా ఇచటనే ఆగిపోనా…
            - మేఘసందేశం 

Tuesday 21 January 2014

నటనే తన ఊపిరి

Akkineni Updates

- అక్కినేని కుటుంబానికి ప్రముఖుల పరామర్శ

- అన్నపూర్ణ స్టూడియోలో అక్కినేని పార్థివదేహం

- ఎర్రగడ్డ శ్మశానవాటికలో రేపు ఏఎన్నార్ అంత్యక్రియలు

- నవరాత్రి సినిమాలో 9 పాత్రలు

- మూడుతరాల అక్కినేని నటులు చేస్తున్న సినిమా 'మనం'

- నాలుగో తరగతితో చదువుకు ఫుల్ స్టాప్

- పట్టుదలతో ఇంగ్లీష్ లో ప్రావీణ్యం

మూడుతరాల అక్కినేని నటులు

నటనలో నిత్యవిద్యార్థి

    పదిహేడేళ్ల వయసులోనే ముఖానికి రంగు వేసుకుని తెరంగేట్రం చేసిన అక్కినేని నాగేశ్వరరావు.. చిట్టచివరి వరకు కూడా సినీ కళామతల్లికి సేవ చేస్తూనే ఉన్నారు. తనకు కేన్సర్ వచ్చిందని, దాన్ని కూడా జయిస్తానని ప్రెస్ మీట్ పెట్టి మరీ ప్రకటించిన ఘనత ఆయనొక్కరికే దక్కుతుంది. కేన్సర్ మహమ్మారి ఒకవైపు తన శరీరాన్ని కబళిస్తున్నా... నటనే తన ఊపిరి అంటూ చిట్ట చివర కూడా మూడుతరాల అక్కినేని నటులు కలిసి చేస్తున్న 'మనం' సినిమాలో నటించారు. దాంతో కలిపి మొత్తం 256 సినిమాల్లో ఆయన చేశారు. నటనలో ఆయన నిత్యవిద్యార్థి.
    అక్కినేని నాగేశ్వరరావు నాలుగో తరగతితోనే చదువుకు ఫుల్ స్టాప్ పెట్టేశారు. ఆయన యంగ్ హీరోగా రాణిస్తున్న రోజుల్లో చాలామంది ఇంగ్లీష్ లో మాట్లాడుకునేవారు. దాంతో అక్కినేనికి ఇంగ్లీష్ అర్ధమయ్యేది కాదు.  ఆయన శ్రీలంక వెళ్లినప్పుడు అందరూ ఇంగ్లీష్ లో మాట్లాడితే.. అక్కినేని మాత్రం తమిళంతో మేనేజ్ చేశారు. ఆ తర్వాత పట్టుదలతో ఆయన ఆంగ్లం నేర్చుకున్నారు. ఆంగ్లంలో అనర్గళంగా మాట్లాడగలిగే స్థాయికి చేరుకున్నారు.  హిందూ పత్రికను క్రమం తప్పకుండా చదువుతూ ఇంగ్లీష్ లో ప్రావీణ్యం సంపాదించారు.  ఆయన నటనలో తానెప్పుడూ నిత్యవిద్యార్థినే అని వినయంగా చెబుతుండేవారు.

నటసామ్రాట్ అజరామరుడు

చెరిగిపోని నవ్వులు

20 Sept, 1924 - 21 Jan, 2014


కృష్ణాజిల్లా గుడివాడ తాలూకాలోని వెంకటరాఘవపురంలో (ప్రస్తుతం రామాపూరం) 1924 సెప్టెంబర్ 20న పున్నమ్మ, వెంకటరత్నం దంపతులకు జన్మించారు అక్కినేని నాగేశ్వరరావు. నిజానికి అక్కినేని కుటుంబంలో కళాకారులు లేరు. కళ అనేది దైవదత్తంగా ఆయనకు అబ్బింది. చిన్నతనం నుంచే నాటకల్లో వేషాలు వేసేవారాయన. అక్కినేని ధరించిన తొలి పాత్ర ‘నారదుడు’. వెంకటరాఘవపురంలో పిల్లలందరూ కలిసి వేసిన ‘సత్యహరిశ్చంద్ర’ నాటకంలో పట్టుబట్టి అక్కినేనితో నారద పాత్రను వేయించారు. కారణం ఆ ఊళ్లో ఆయన మంచి పాటగాడు కావడమే. ఆ తర్వాత ఏఎన్నార్ నటించిన పాత్ర చంద్రమంతి. తర్వాత ‘కనకతార’ అనే నాటకంలో తారగా నటించారు. అప్పట్నుంచీ నాటకాల్లో స్త్రీ వేషాలు విరివిగా రావడం మొదలయ్యాయి. ‘సత్యహరిశ్చంద్ర’ నాటకంలో మాతంగకన్య, ‘భక్తకుచేల’ నాటకంలో మోహిని, ‘సారంగధర’ నాటకంలో చెలికత్తె పాత్ర ఇలా ఖాళీ లేకుండా నాటకాలు వేస్తూ ఉండేవారు. రంగస్థల కళాకారునిగా అక్కినేని తొలి పారితోషికం అర్థరూపాయి. ఆ స్థాయి నుంచి అయిదొందలు తీసుకునే స్థాయికి ఎదిగారు. అమ్మ, అన్న ప్రోత్సాహం వల్లే రంగస్థలంపై రాణించగలిగానని చెబుతూ ఉండేవారు అక్కినేని. అప్పట్లో అక్కినేని కుటుంబానికి ఓ పాతిక ఎకరాలు పొలం ఉండేది. అందుకే ఆయన్ను అందరూ చిన్నదొర అంటుండేవారు. కలిగిన కుటుంబంలో పుట్టినా... డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండేవారాయన. ప్రతి ఏడాదీ కుప్పనూర్పిళ్ల సమయంలో... పొలంలో కష్టపడితే ఓ పావలా వచ్చేది. ఆ డబ్బుతో దాపుడు చొక్కా కొనుక్కునేవారు. భజనల్లో గెంతడాలు, కోలాటాలు ఆయనకు చాలా ఇష్టం. ఆ విధంగా చిన్నతనం నుంచే అక్కినేనికి తాళజ్ఞానం అలవడింది. ఇప్పుడు నడుస్తున్న డాన్స్‌ల ట్రెండ్‌కి బీజం అక్కడ పడిందనమాట. సినిమాల్లో డాన్సులు వేయాలంటే తొలితరంలో అక్కినేనికే చెల్లు అని తెలుగు ప్రేక్షకులంతా మెచ్చుకునేవారు. 

మరచిపోలేని గురుతులు

  ముగ్గురు మరాఠీలు(1946) మాయాలోకం(1945) చిత్రాలతో మంచి పేరు తెచ్చుకున్న అక్కినేనికి ‘బాలరాజు’(1948) చిత్రం స్టార్‌ని చేసింది. ఆ వెంటనే వచ్చిన మరో జానపదం ‘కీలుగుర్రం’(1949) ఆయన్ను నంబర్‌వన్‌ని చేసింది. దేవదాసు(1953),  అనార్కలి(1955), బాటసారి(1961), మూగమనసులు(1964), మనసేమందిరం,(1966), ప్రేమనగర్(1971), దేవదాసు పళ్లీపుట్టాడు(1978), ప్రేమాభిషేకం(1981), ప్రేమమందిరం(1981), అమరజీవి(1983)... ఇలా చెప్పుకుంటూ పోతే... ఎన్నో ప్రేమకథలు. దక్షిణాదిన ఇన్ని ప్రేమకథల్లో నటించిన హీరో మరొకరు లేరు. అందులోనూ పాత్ర పాత్రకూ వ్యత్యాసం. అక్కినేని భక్తునిగా పేరుతెచ్చిన చిత్రాలు విప్రనారాయణ(1954), భక్తజయదేవ(1961), భక్తతుకారం(1973), మహాకవి క్షేత్రయ్య(1976), చక్రధారి(1977), శ్రీరామదాసు(2006). ఇక అక్కినేని నటించిన సాంఘిక చిత్రాల గురించి చెప్పడమంటే సాహసమే!

"నిర్భయ' కేసులో స్పందించారు.. "అనూహ్య'ను పట్టించుకోరేం?


మచిలీపట్నం అమ్మాయి అనూహ్య హత్య, అత్యాచారం కేసులో ఘోరమైన నిజాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. క్రిస్మస్ సెలవులు ముగించుకుని ఉద్యోగం కోసం ముంబై వెళ్లిన అనూహ్యను క్యాబ్ డ్రైవరే ట్రాప్ చేసి అత్యంత క్రూరమైన రీతిలో లైంగిక దాడికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. రైల్వే స్టేషన్ లో క్యాబ్ మాట్లాడుకున్న అనూహ్య తానో రాక్షసుడి చెరలో చిక్కినట్లు ఊహించలేకపోయింది. ఆమెను తప్పుడు మార్గంలో తీసుకువెళ్లిన క్యాబ్ డ్రైవర్ మరో ముగ్గురితో కలిసి ఒక గదిలో బంధించాడు. ఐదు రోజుల పాటు లైంగికంగా వేధింంపులకు పాల్పడ్డాడు. ఢిల్లీలో "నిర్భయ' కేసు విషయంలో అన్ని వర్గాల ప్రజలూ స్పందించారు. అదే మన తెలుగమ్మాయి పొరుగు రాష్ట్రంలో అత్యాచారానికి గురైతే ఎక్కడా ఆందోళనలు రావడం లేదు. ఇదే తరహాలో హైదరాబాద్  సాఫ్ట్ వేర్ ఉద్యోగిని "అభయ'  మీద సామూహిక లైంగిక దాడి జరిగినప్పుడూ పెద్దగా ఆందోళనలు తలెత్త లేదు. మీడియా కూడా దేశ రాజధాని ఘటనలపై స్పందినట్లుగా స్థానికంగా ఆఘాయిత్యాలు జరిగినప్పుడు పట్టించుకోవడం లేదు. జనమంతా ముక్త కంఠంతో ఖండిస్తేనే ఇలాంటి నేరగాళ్లకు భయం పట్టుకుంటుందనేది నిజం.

బందరుకు చెందిన "అనూహ్య'కు సంబంధించిన కొంత సమాచారాన్ని మిత్రులు అందించారు.

Esther Anuhya, a TCS employee, takes a train from Vijayawada to Mumbai on the 4th of Jan, returning to work. Doesn't reach Mumbai. Friends and family trace her charred body on the 16th in Mumbai ...based on a last signal found in the area.

Walking on the streets...going in a bus ...taking a train...we are done with all of them..........No words again....


A mail from her friend detailing the tragic incident:

Name: Esther Anuya Singavarapu. D/o: Mr. SJS Prasad

Age: 23 years, Height: 5' 3"
Profession: Software Engineer with TCS

Boarded Train: TRAIN NO: 18519, LTT EXP in VIJAYAWADA on 4-1-2014 7 A.M (Lokmanya Tilak Terminus Express). She was travelling in Coach S-5 berth 47

Complaint given in Vijayawada railway police station.....as Mumbai Kurla Railway police said that they cannot take the complaint there....

She was supposed to reach Mumbai on 5th January at 5.10 am, but her father got a call from the hostel (YWCA Hostel) saying that she didn’t come to hostel yet.....The father was trying to call her on both her numbers but there was no response. Both her Numbers got switched off at around 15.15 pm on 5th January.....we got information from BSNL and AIRTEL that both the numbers got switched off at the same time and the signal was traced to an area called BHANDUP in Mumbai.

All the information was passed to Mumbai Police as they didn't take the complaint on 5th January......they started to act only from 6th January once a FAX message was sent to the Mumbai Commissioner from the HYDERABAD Commissioner..... The police got hold of the people who traveled in the same coach with her...the co passengers mentioned that she reached Mumbai and she alighted at
Kurla LTT on 5th January at 5.10....The Kurla police who are investigating the case mentioned that they couldn't find anything in Bhandup where her cell phone last received the signal.....For the last 11 days the search was going on and the Mumbai police dept mentioned that they couldn't find any trace.....In between they mentioned that one of the cell phone's signal was traced to a red light are called Kamathipura, but later they mentioned that it was wrong info that they received....

Yesterday on 16th January 2014, one of the cousins along with 7 other family members started searching for some trace in Bhandup as it was the area where her phone got switched off and at around 6.45 pm in the evening, they found highly decomposed half-burnt dead body....The father identified the dead body after seeing the ring her hand.....8 family members were able to find
the dead body in a day......we don't know when the crime was committed.....we don't know who did it......the culprits are still out there.....and they burnt the girl to kill all the evidence......The postmortem will be done today to know the exact cause and time of death......”






Monday 13 January 2014

అనార్కలి...అంజలీ

 అంజలీ దేవి అనగానే అలనాటి పౌరాణిక చిత్రాలే గుర్తుకొస్తాయి. అనార్కలీగా - See more at: http://www.andhrajyothy.com/node/53890#sthash.ZDiSEXAh.dpuf


అనార్కలి...అంజలీ

 అంజలీ దేవి అనగానే అలనాటి పౌరాణిక చిత్రాలే గుర్తుకొస్తాయి. అనార్కలీగా, - See more at: http://www.andhrajyothy.com/node/53890#sthash.ZDiSEXAh.dpuf
 అంజలీ దేవి అనగానే అలనాటి పౌరాణిక చిత్రాలే గుర్తుకొస్తాయి. అనార్కలీగా - See more at: http://www.andhrajyothy.com/node/53890#sthash.ZDiSEXAh.dpuf
అంజలీదేవి తూర్పుగోదావరి జిల్లాలోని పెద్దాపురంలో 1927 ఆగస్టు 24న జన్మించింది. బాల్యంలోనే కాకినాడలోని యంగ్‌మెన్‌ హ్యాపీక్లబ్‌లో చేరి నాటకాలు వేశారు. ఎనిమిదేళ్ళ వయసులోనే నటనారంగంలో అడుగుపెట్టారు. హరిశ్చంద్ర నాటకం ప్రదర్శిస్తున్న రోజుల్లో ఆమెకు సంగీత దర్శకుడు ఆదినారాయణరావుతో పరిచయమైంది. 1947లో కృష్ణవేణి నిర్మించిన గొల్లభామ సినిమాలో ఒక డ్యాన్సర్‌గా తెలుగు తెరకు పరిచయమయ్యారు. ఎల్‌.వి. ప్రసాద్‌ నిర్మించిన 'కష్టజీవి' సినిమాతో హీరోయిన్‌ అయ్యారు.

1950లో ఘంటసాల బలరామయ్య తీసిన 'శ్రీలక్ష్మమ్మ కథ'తో అంజలీదేవి బాగా పాపులర్‌ అయ్యింది. ఇదే సంవత్సరం బి.ఏ. సుబ్బారావు తీసిన 'పల్లెటూరి పిల్ల' చిత్రంలో కూడా హీరోయిన్‌గా నటించి ఈ రెండు సినిమాలు బాగా విజయవంతం కావడంతో ఆమె కెరీర్‌బాగా ఊపందు కుంది. సంగీత దర్శకులు ఆదినారాయణరావును వివాహం చేసుకుంది. అంజలీదేవి పిక్చర్స్‌ను స్ధాపించి, ఎన్నో హిట్‌ సినిమాలు నిర్మించారు. 1953లో ఎల్‌.వి.ప్రసాద్‌ దర్శకత్వంలో తెలుగు, తమిళభాషల్లో 'పరదేశి' అనే సినిమా నిర్మించారు. ఈ తమిళ సినిమా ద్వారానే శివాజీగణేశన్‌ పరిచయమయ్యారు.

అంజలీదేవి అలనాటి అగ్రనటులైన అక్కినేని నాగేశ్వరరావు, ఎన్టీరామారావులతో కలిసి ఎన్నో హిట్‌ సినిమాల్లో నటించారు. 'లవకుశ' సినిమాలోని సీత పాత్రకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. అలాగే ఆమె నటించిన కీలుగుర్రం, సువర్ణసుందరి, అనార్కలి లాంటి చిత్రాల్ని, అందులోని ఆమె నటనను తెలుగు ప్రేక్షకులు ఎన్నటికీ మర్చిపోలేరు. మహానటులైన అక్కినేని, నందమూరిల సరసన హీరోయిన్‌గానే కాకుండా వారికి తల్లిగా కూడా కొన్ని సినిమాల్లో నటించడం ఓ విశేషం.

సినీ పరిశ్రమకు చేసిన సేవలకు గాను అంజలీదేవికి 2005లో రఘుపతి వెంకయ్య అవార్డు, 2006లో రామినేని అవార్డు, 2007లో ప్రతిష్టాత్మకమైన అక్కినేని నాగేశ్వరరావు అవార్డులు లభించాయి. 1994లో అంజలీదేవి 'పోలీస్‌ అల్లుడు' సినిమాలో నటించిన తర్వాత, మళ్ళీ ఏ సినిమాలోను నటించలేదు.

వెండితెర సీత అంజలీదేవి కన్నుమూత

వెండితెర సీత అంజలీదేవి కన్నుమూత


తెలుగు ప్రేక్షకుల చెరగని ముద్ర వేసుకున్న అలనాటి సినీ నటి అంజలీదేవి కన్నుమూశారు. చెన్నయ్‌లోని విజయ ఆస్పత్రిలో అనారోగ్యంతో చికిత్స పొందుతున్న అంజలీదేవి సోమవారం మధ్యాహ్నం తుది శ్వాస విడిచారు. ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌ వంటి ప్రముఖ హీరోలతో నటించిన అంజలీదేవి అప్పట్లో తెలుగు ప్రేక్షకులను ఎంతగానే అలరించారు.

1927 ఆగస్టు 24తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురంలో అంజలీదేవి జన్మించారు. 1940 సంగీత దర్శకుడు ఆదినారాయణరావును ఆమె వివాహం చేసుకున్నారు. అంజలీదేవికి ఇద్దరు కుమారులు. తెలుగు , తమిళ, కన్నడ భాషల్లో 500కు పైగా సినిమాల్లో అంజలీ నటించారు. 350 తెలుగు సినిమాల్లో నటించిన అంజలీదేవి వెండితెర సీతగా ప్రఖ్యాతి గాంచారు. లవకుశ చిత్రంలో సీత పాత్రకు ప్రాణం పోసింది అంజలీదేవియే. తొలి రంగుల చిత్రం లవకుశ అంజలీదేవిగా సినీ కెరీర్‌లో ఓ మైలురాయి.