ఆకులో ఆకునై పూవులో పూవునై
కొమ్మలో కొమ్మనై నునులేత రెమ్మనై
ఈ అడవి దాగిపోనా… ఎటులైనా ఇచటనే ఆగిపోనా…
ఆకులో ఆకునై పూవులో పూవునై
కొమ్మలో కొమ్మనై నునులేత రెమ్మనై
ఈ అడవి దాగిపోనా… ఎటులైనా ఇచటనే ఆగిపోనా…
గలగలనీ వీచూ చిరుగాలిలో కెరటమై..
గలగలనీ వీచూ చిరుగాలిలో కెరటమై..
ఝలఝలనీ పారూ సెలపాటలో తేటనై
పగడాల చిగురాకు తెరచాటు తేటినై
పరువంపువిరిచేడే చిన్నారి సిగ్గునై
ఈ అడవి దాగిపోనా… ఎటులైనా ఇచటనే ఆగిపోనా…
ఈ అడవి దాగిపోనా… ఎటులైనా ఇచటనే ఆగిపోనా…
తరులెక్కి అలనీలి గిరినెక్కి మెలమెల్ల..
తరులెక్కి అలనీలి గిరినెక్కి మెలమెల్ల
చదులెక్కి జలదొంపునీలంపు నిగ్గునై
ఆకలా దాహమా.. చింతలా వంతలా..
ఈ తరలి వెర్రినై ఏకతమా తిరుగాడ
ఈ అడవి దాగిపోనా… ఎటులైనా ఇచటనే ఆగిపోనా…
ఈ అడవి దాగిపోనా… ఎటులైనా ఇచటనే ఆగిపోనా…
ఆకులో ఆకునై పూవులో పూవునై
కొమ్మలో కొమ్మనై నునులేత రెమ్మనై
ఈ అడవి దాగిపోనా… ఎటులైనా ఇచటనే ఆగిపోనా…
.. ఎటులైనా ఇచటనే ఆగిపోనా…
- మేఘసందేశం
No comments:
Post a Comment