Akkineni Updates
- అక్కినేని కుటుంబానికి ప్రముఖుల పరామర్శ
- అన్నపూర్ణ స్టూడియోలో అక్కినేని పార్థివదేహం
- ఎర్రగడ్డ శ్మశానవాటికలో రేపు ఏఎన్నార్ అంత్యక్రియలు
- నవరాత్రి సినిమాలో 9 పాత్రలు
- మూడుతరాల అక్కినేని నటులు చేస్తున్న సినిమా 'మనం'
- నాలుగో తరగతితో చదువుకు ఫుల్ స్టాప్
- పట్టుదలతో ఇంగ్లీష్ లో ప్రావీణ్యం
మూడుతరాల అక్కినేని నటులు |
నటనలో నిత్యవిద్యార్థి
పదిహేడేళ్ల వయసులోనే ముఖానికి రంగు వేసుకుని తెరంగేట్రం చేసిన అక్కినేని నాగేశ్వరరావు.. చిట్టచివరి వరకు కూడా సినీ కళామతల్లికి సేవ చేస్తూనే ఉన్నారు. తనకు కేన్సర్ వచ్చిందని, దాన్ని కూడా జయిస్తానని ప్రెస్ మీట్ పెట్టి మరీ ప్రకటించిన ఘనత ఆయనొక్కరికే దక్కుతుంది. కేన్సర్ మహమ్మారి ఒకవైపు తన శరీరాన్ని కబళిస్తున్నా... నటనే తన ఊపిరి అంటూ చిట్ట చివర కూడా మూడుతరాల అక్కినేని నటులు కలిసి చేస్తున్న 'మనం' సినిమాలో నటించారు. దాంతో కలిపి మొత్తం 256 సినిమాల్లో ఆయన చేశారు. నటనలో ఆయన నిత్యవిద్యార్థి.
అక్కినేని నాగేశ్వరరావు నాలుగో తరగతితోనే చదువుకు ఫుల్ స్టాప్ పెట్టేశారు. ఆయన యంగ్ హీరోగా రాణిస్తున్న రోజుల్లో చాలామంది ఇంగ్లీష్ లో మాట్లాడుకునేవారు. దాంతో అక్కినేనికి ఇంగ్లీష్ అర్ధమయ్యేది కాదు. ఆయన శ్రీలంక వెళ్లినప్పుడు అందరూ ఇంగ్లీష్ లో మాట్లాడితే.. అక్కినేని మాత్రం తమిళంతో మేనేజ్ చేశారు. ఆ తర్వాత పట్టుదలతో ఆయన ఆంగ్లం నేర్చుకున్నారు. ఆంగ్లంలో అనర్గళంగా మాట్లాడగలిగే స్థాయికి చేరుకున్నారు. హిందూ పత్రికను క్రమం తప్పకుండా చదువుతూ ఇంగ్లీష్ లో ప్రావీణ్యం సంపాదించారు. ఆయన నటనలో తానెప్పుడూ నిత్యవిద్యార్థినే అని వినయంగా చెబుతుండేవారు.

No comments:
Post a Comment