Wednesday 26 February 2014

ఈ ప్రయాణం ఎందాక?





బూడిద కాదు.. స్వర్ణం!

శివుడు నిరాకారుడు. నిరాడంబరుడు.
కానీ  అత్యంత శక్తి సంపన్నుడు.
స్రుష్టి, లయ కారకుడే అయినా పరమ శివుడు నా దగ్గరేముంది అంతా బూడిద అంటాడు.
ఈ ఫొటోలో పార్వతీ సమేతుడైన భోళా శంకరుడు స్వర్ణ ఖచిత ఆసనం మీద ఎంత ఆర్భాటంగా ఉన్నాడో చూడండి...! అంతా శివ మాయ!

శివుని రూపం...

పరమశివుని ఆకృతిలో ఒక్కొక్క దానికి ఒక్కొక్క అర్ధం ఉన్నది. 
శివుని త్రిశూలం సత్వ, రజ, తమో గుణాలకు ప్రతిరూపాలు. ఢమరుకం శబ్ద బ్రహ్మ స్వరూపం. 
శిరస్సును అలంకరించిన చంద్రవంక మనోనిగ్రహానికి, గంగాదేవి శాశ్వతత్వానికి ప్రతీక. 
దేహంపై గల సర్పాలు భగవంతుని జీవాత్మలు.
ధరించిన ఏనుగు చర్మం అహంకారాన్ని త్యజించమని, ఆశీనంపైన పులిచర్మం కోరికలకు దూరంగా ఉండమని సూచిస్తాయి.
భస్మం పరిశుద్ధతనూ సూచిస్తాయి. ఆయన పట్టుకున్న నాలుగు జింక కాళ్ళు చతుర్వేదాలకు, నందీశ్వరుడు సత్సాంగత్యానికి, నంది ధర్మదేవతకు, మూడవ నేత్రం జ్ఞానానికి సూచిక.

చెట్టు ఓ సాక్షి...





నీడలు చెప్పే జాడలు










Thursday 20 February 2014

నా తెలంగాణ కోటి రతనాల వీణ

నా తెలంగాణ

(ఆగస్ట్ 15, 1951 నాటి తెలంగాణ పత్రిక సుజాతలో ప్రచురితమైన దాశరధి కవిత..  నా తెలంగాణ) 



కోటి తెలుగుల బంగారు కొండక్రింద
పరచుకొన్నట్టి సరసులోపల వసించి
ప్రొద్దు ప్రొద్దున అందాల పూలుపూయు
నా తెలంగాణ తల్లి; కంజాత వల్లి

వేయిస్తంభాల గుడినుండి చేయిసాచి
ఎల్లొరా గుహ లందున పల్లవించి
శిల్పిఉలి ముక్కులో వికసించినట్టి
నా తెలంగాణ, కోటి పుణ్యాల జాణ

మూగవోయిన కోటి తమ్ముల గళాల
పాట పలికించి కవితా జవమ్ము కూర్చి
నా కలానకు బలమిచ్చి నడిపినట్టి
నా తెలంగాణ, కోటి రత్నాల వీణ
    - దాశరధి

దిల్‌సుఖ్ నగర్‌ మారణహోమానికి ఏడాది

హైదరాబాద్ దిల్‌సుఖ్ నగర్‌ పేలుళ్ల మారణహోమానికి ఫిబ్రవరి 21 తో ఏడాది. ముష్కరుల దుష్టకాండలో అసువులుభాసిన అమాయకులకు నివాళులు. తీవ్రవాదం నశించాలని ఆశిద్దాం.

Saturday 15 February 2014

షర్మిల లోక్ సభకు పోటీ చేయదట!

ఆప్ ఆహ్వానాన్ని తోసిపుచ్చిన 

మణిపూర్ ఐరన్ లేడీ 

మణిపూర్ ఐరన్ లేడీ ఇరోం షర్మిల

వైసీపీ అధినేత జగన్ సోదరి షర్మిల వచ్చే లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేస్తుందో లేదో చెప్పలేం. ఐతే మణిపూర్ ఐరన్ లేడీ ఇరోం షర్మిల చాను మాత్రం రాజకీయల పట్ల  ఆసక్తి లేదంటోంది. 2014 ఎన్నికల్లో తమ పార్టీ తరపున పోటీ చేయాలని అరవింద్ కేజ్రివాల్ నాయకత్వంలోని ఆం ఆద్మీ పార్టీ కోరింది. కాని షర్మిల నిరాసక్తతతొ ఉంది. ఇంతకీ ఈ షర్మిల ఎవరనే సందేహమా? మణిపూర్ తదితర ఈశాన్య  రాష్త్రాల్లో  మిలటరీ దౌర్జన్యానికి నిరసనగా 2000 నవంబర్ నుంచీ ఆమరణ నిరహార దీక్ష చేస్తోంది. అస్సాం రైఫిల్స్ బెటాలియన్ పది మంది యువకులను కాల్చి చంపిన ఘటనతో షర్మిల దీక్ష మొదలైంది. ప్రభుత్వం మాత్రం మిలటరీకి అధికారం కట్టబెట్టిన చట్టాన్ని మార్చడం లేదు. గతంలో ఈ షర్మిల గురించి రాసిన బ్లాగ్ పోస్టింగ్ చూడండి. 
షర్మిలను అడిగినట్లుగానే మన రాష్త్రం నుంచి పోటీ చేయలని  సీ బీ ఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీ  నారాయణకూ కేజ్రీవాల్  ఆహ్వానం పంపారు.  ఆయన కూడా ఆసక్తితో ఉన్నారుట! ఆప్ పార్టీ దేశ వ్యాప్తంగా  ఇలాంటి  ఇమేజీ ఉన్న వారిని రాజకీయాల్లోకి స్వాగతిస్తోంది.                                      
  

                            

Friday 14 February 2014

ముగిసిన కేజ్రీ కథ




రాజకీయ కుళ్లును శుభ్రం చేయడం 
చీపురుతో సాధ్యమా..? 

కుళ్లు రాజకీయాలను సంస్కరించడానికి సమాచార హక్కు ఉద్యమకారుడి నుంచి రాజకీయ నాయకుడిగా మారారు అరవింద్ కేజ్రీవాల్. అలాగే అత్యంత వేగంగా ఎన్నికల్లో సంచలనం సృష్టించి ఢిల్లీ ముఖ్యమంత్రి పీఠమెక్కారు. అయితే అందరూ ఊహించినట్లుగానే కాంగ్రెస్, బీజేపీ రాజకీయాల మధ్య ఇమడలేకపోయారు. ఎంత సంచలనంగా ఢిల్లీ గద్దెనెక్కారో అంతే సంచలనం సృష్టిస్తూ రాజీనామా చేశారు. ప్రజాస్వామ్య భారత్లో నయా రాజకీయ వ్యవస్థకు  శ్రీకారం చుట్టిన కేజ్రీవాల్ ప్రభుత్వం ఆయుష్షు 49 రోజులకే చెల్లింది. ఆప్ ఎన్నికల గుర్తు చీపురుకు ఓటేసిన ఢిల్లీ ఓటర్ల ఆకాంక్ష.. అవినీతి నిర్మూలన. దీన్ని నెరవేర్చడానికి కేజ్రీవాల్ మళ్లీ జనంలోకి వచ్చారు. 
      ప్రభుత్వ యంత్రాంగం, రాజకీయ వ్యవస్థల నుంచి అవినీతిని కూకటి వేళ్లతో పెకిలించి వేయాలన్న లక్ష్యంతో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు 45 ఏళ్ల కేజ్రీవాల్. హర్యానాకు చెందిన ఈ బనియా(వైశ్యుడు) చాలా మేధావి. కానీ వర్తమాన రాజకీయ కుతంత్రాల ముందు ఓడిపోయాడు. జనలోక్ పాల్ బిల్లును ఢిల్లీ శాసనసభలో పెట్టినా విపక్ష బీజేపీగానీ, తన ఆమ్ ఆద్మీ పార్టీ సర్కారుకు మద్దతునిస్తున్న కాంగ్రెస్ గానీ సహకరించలేదు. దీంతో అనుకున్న లక్ష్యం నెరవేరలేదన్న ఆవేదనతో ఆప్ సర్కారు చేతులెత్తేసింది. 

ఇక ఆమ్ ఆద్మీ నాయకులు ప్రజల్లోకి వెళ్తారు. మళ్లీ ఎన్నికలొస్తాయి. ఈసారైనా కేజ్రీవాల్ టీమ్కు సంపూర్ణ మెజారిటీ వస్తేగానీ జన్ లోక్ పాల్ బిల్లుకు మోక్షం లభించదు.  అవినీతి, అక్రమాలతో నిండా మునిగిన ఈ సాంప్రదాయ పార్టీలు ఆమ్ ఆద్మీలాంటి అభ్యుదయ భావజాలమున్న పార్టీలను బతికిబట్టకట్టనిస్తాయా...? పచ్చనోటు, బిర్యానీ పొట్లం, మందు సీసాలతో ఓట్లు కొనుక్కుంటున్న పార్టీలు అధికారం చెలాయిస్తున్న మనదేశంలో ఎన్నికల ప్రక్రియ నిజమైన ప్రజాస్వామ్యానికి అద్దం పడుతుందా...?
      
సామాన్యుల చేతికి పగ్గాలు వస్తేగానీ ఈ వ్యవస్థలో మార్పు అసాధ్యమన్నది నిజం. ఈ రాజకీయాలు మనకెందుకులే అన్న ధోరణి ప్రబలిపోయిన తరుణంలో నాయకుల తాబేదారులు, రౌడీలు, గూండాలు, ఎందుకూ కొరగాని అలగా జనాలు, అణాకానీ నాయకులంతా ఓట్ల జాతరలో గెలిచేస్తున్నారు.. అధికార పీఠాలెక్కేసి జనం తలరాతలు రాస్తున్నారు. అందుకే కేజ్రీవాల్ లాంటి కొత్త తరహా నాయకులు కావాలని యువత కోరుకుంటోంది. ఆమ్ ఆద్మీ పార్టీ లాంటి సరికొత్త ఆలోచనా విధానాన్ని ఆహ్వానిస్తోంది.

హర్యానాలోని ఓ సామాన్య కుటుంబానికి చెందిన కేజ్రీవాల్ సమాచార హక్కు చట్టం అమలు కోసం పోరాటంతో జనంలోకి వచ్చారు. ఇందుకోసం ఐఆర్ఎస్ ఉద్యోగం కూడా వదులుకున్నారు. ఆ తర్వాత 2011లో అన్నా హజారే చేపట్టిన జన్ లోక్ పాల్ ఉద్యమంలో చేరి కీలక పాత్ర పోషించారు. దేశంలో అవినీతి తిమింగాలాల జాబితాలు బయటపెట్టడంతో దేశవ్యాప్తంగా కేజ్రీవాల్  పేరు మార్మోగింది. 

అన్నాతో విభేదాలు తలెత్తాక అవినీతి నిర్మూలన అనే సింగిల్ పాయింట్ ఎజెండాతో ఆమ్ ఆద్మీ పార్టీ స్థాపించారు. యువతరం ఆయనను స్వాగతించింది. మేధావులు, జర్నలిస్టుల మద్దతుతో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో సంచలన విజయం సాధించారు. షీలా దీక్షిత్ లాంటి ఉద్ధండ నాయకురాలే కేజ్రీవాల్ దెబ్బకు ఓటమి పాలవడం సరికొత్త రాజకీయాలకు తెరలేపింది. ఆమ్ ఆద్మీ పార్టీకి ఎక్కువ సీట్లొచ్చినా కాంగ్రెస్ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సి వచ్చింది. ఎప్పటికైనా కేజ్రీ కాళ్ల కింద చాప లాగేయడానికి హస్తం నేతలు రెడీగా ఉంటారని ఆనాడే ఊహించారు. 

ఇక బీజేపీకి ఆప్కొరుకుడుపడని కొయ్యలాగానే మారింది. కమలం పార్టీ తరఫున ప్రధాని అభ్యర్థిగా రంగంలోకి దిగిన నరేంద్ర మోడీ హవాకు ఆమ్ ఆద్మీ అడ్డుపడుతోంది. మోడీ వైపు ఆకర్షితులవుతున్న వర్కింగ్ క్లాస్ ఓటర్లకు.. ముఖ్యంగా యూత్ ఓటర్లకు ఆమ్ ఆద్మీ ప్రత్యామ్నాయంగా కనిపిస్తోంది. కేజ్రీ పార్టీ తమ విజయావకాశాలకు ఎక్కడ గండికొడుతుందో అన్న భయం పట్టుకుంది బీజేపీకి. అందుకే ఢిల్లీలో ఆప్ సర్కారును ముందు నుంచే ఇరకాటంలో పెట్టేసింది. ఇప్పుడు అనుకున్నదే జరిగింది. 

ఇక కేజ్రీ టీమ్ వచ్చే జనరల్ ఎలక్షన్స్ మీద దృష్టి పెడుతుంది. బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్టీఏ, కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏ కూటములకు ఇది సవాలే. మిగతా చిన్నా చితకా ప్రాంతీయ పార్టీలు జట్టుకట్టి మూడో ప్రత్యామ్నాయంగా అవతరించినా ఆమ్ ఆద్మీ ఉనికిని జనం గుర్తించడం ఖాయం. దేశ రాజకీయాల్లో 20`14 ఎన్నికలు సరికొత్త సంచలనం సృష్టించబోతోందన్నది నిజం.  ఈ పరిణామాలన్నీ కేంద్రంలో మరోసారి అస్థిర ప్రభుత్వం  వస్తుందేమోనన్న సంకేతం ఇస్తున్నాయి.
----

Thursday 13 February 2014

యువరాజు కోసం దిగంబర అవతారం

ప్రచారం ఎత్తుగడ

రాహుల్ గాంధీ కోసం మోడల్, నటి  తనీషా సింగ్ వినూత్న ప్రచారం.
కెమెరా ముందు సగం దిగంబర అవతారంలో పోజు.

గతంలో  పాప్‌ సంగీత ధృవతార లేడీ  గాగ ఎమ్‌టీవి మ్యూజిక్‌ అవార్డుల్లో జంతు మాంసం కప్పుకుని రావడం సంచలనం కలిగించింది. లేడీ గాగ  స్ఫూర్తితో మాంసపు పొరలు కప్పుకుని save animals నినాదం ఇచ్చిన తనీషా సింగ్ ఇప్పుడు రాహుల్ గాంధీ కోసం మువ్వన్నెల జెండా ఒంటికి చుట్టుకుంది.

తన ప్రచారంతో యువరాజుకు వోట్లు పడతాయని తనీషా సింగ్ ఆత్మ విశ్వాసంతో చెప్తోంది. ఇలాంటి ప్రచారం ఎత్తుగడను ప్రజలు నమ్ముతారా?



Wednesday 12 February 2014

శృతిమించిన అమ్మ!

అమ్మ తన బిడ్డల కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధపడుతుంది. కానీ అమెరికాలో ఓ అమ్మ శృతిమించింది. సూపర్ మోడల్, హాలీవుడ్ నటి స్టెఫానీ సీమోర్ వ్యవహారం ఎంత విడ్డూరంగా ఉందో తెలుసా..

      తన ఇద్దరు కొడుకులను మోడలింగ్ రంగంలో రారాజులను చేసేందుకు నలభై ఐదేళ్ల ఈ సుందరి అర్ధనగ్నంగా ఫొటోలకు ఫోజులిచ్చింది. పైగా ఇద్దరు కుమారులతో కలిసే ఇలాంటి సెక్సీ గెటప్ లో ఫొటో షూట్ చేయడం విడ్డూరమే. మరో మూడు నెలల్లో మార్కెట్లోకి రిలీజ్ కాబోతున్న ఇంటర్నేషనల్ మ్యాగజైన్ హార్బర్ బజార్ కవర్ పేజీ కోసం స్టెఫానీ హాట్ హాట్ ఫోజులివ్వడం సంచనలం సృష్టిస్తోంది. 



స్టెఫానీ పెద్ద కొడుకు పీటర్ వయసు ఇరవయ్యేళ్లు. చిన్నవాడు హ్యారీ. అతనికి పదిహేడేళ్లు. ఫ్యాషన్ ప్రపంచంలో ఈ ఇద్దరినీ సూపర్  మోడల్స్ గా తీర్చిదిద్దాలనేది స్టెఫానీ లక్ష్యం. మోడలింగ్ రంగంలో ఉన్న తమ ఫ్యామిలీ ఇలాంటి ఫోజులివ్వడంలో తప్పు లేదని, ప్రొఫెషన్ లో ఇదంతా కామనే అని చెప్తోంది. గతంలోనూ ఈమె తన కొడుకుతో కలిసి బికినీలో ఫోజులిచ్చింది. పైగా కిస్సింగ్ గెటప్లో. అమ్మ స్థానంలో ఉన్న స్టెఫానీ తన బిడ్డలతో నడుచుకుంటున్న తీరు చూసి ఎవరైనా ముక్కున వేలేసుకోవాల్సిందే!  

Tuesday 11 February 2014

మే'ఘన' సోయగాలతో మోడీకి ప్రచారం


పూలశయ్యపై బాలివుడ్ నటి మేఘనా పటేల్‌
వినూత్న శైలి.. వినూత్న ప్రచారం
మోడీకి మద్దతుగా పూలతో ఫొటో షూట్‌
పుష్ప దేహంతో సోయగాలు ఒలకబోయడం రాజకీయమా,,?
శరీర ప్రదర్శనతో కమలం గుర్తుకు వోట్లు పడతాయా...?
ప్రజలు మోడీకి తప్పనిసరిగా ఓటు వేస్తారా...?
మేఘన ఆశాభావం నిజమవుతుందా...?

Monday 10 February 2014

ఫిబ్రవరి 14 వాలెంటైన్స్ డే కాదు..!

ఫిబ్రవరి 14 వాలెంటైన్స్ డే మాత్రమేనా..? కాదు!
ఆడపిల్లల రక్షణ కోసం అందరమూ గొంతెత్తి నినదించాల్సిన రోజు...


1 బిలియన్ రైజింగ్ ఫర్ జస్టిస్



బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్, మాజీ మిస్ ఇండియా గుల్‌పనాగ్‌ 

పాల్గొంటున్నారు... మరి మీరు?!



1 బిలియన్ రైజింగ్ ఫర్ జస్టిస్...

మరి మీరు?!