ఆప్ ఆహ్వానాన్ని తోసిపుచ్చిన
మణిపూర్ ఐరన్ లేడీ
మణిపూర్ ఐరన్ లేడీ ఇరోం షర్మిల |
వైసీపీ అధినేత జగన్ సోదరి షర్మిల వచ్చే లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేస్తుందో లేదో చెప్పలేం. ఐతే మణిపూర్ ఐరన్ లేడీ ఇరోం షర్మిల చాను మాత్రం రాజకీయల పట్ల ఆసక్తి లేదంటోంది. 2014 ఎన్నికల్లో తమ పార్టీ తరపున పోటీ చేయాలని అరవింద్ కేజ్రివాల్ నాయకత్వంలోని ఆం ఆద్మీ పార్టీ కోరింది. కాని షర్మిల నిరాసక్తతతొ ఉంది. ఇంతకీ ఈ షర్మిల ఎవరనే సందేహమా? మణిపూర్ తదితర ఈశాన్య రాష్త్రాల్లో మిలటరీ దౌర్జన్యానికి నిరసనగా 2000 నవంబర్ నుంచీ ఆమరణ నిరహార దీక్ష చేస్తోంది. అస్సాం రైఫిల్స్ బెటాలియన్ పది మంది యువకులను కాల్చి చంపిన ఘటనతో షర్మిల దీక్ష మొదలైంది. ప్రభుత్వం మాత్రం మిలటరీకి అధికారం కట్టబెట్టిన చట్టాన్ని మార్చడం లేదు. గతంలో ఈ షర్మిల గురించి రాసిన బ్లాగ్ పోస్టింగ్ చూడండి.
షర్మిలను అడిగినట్లుగానే మన రాష్త్రం నుంచి పోటీ చేయలని సీ బీ ఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీ నారాయణకూ కేజ్రీవాల్ ఆహ్వానం పంపారు. ఆయన కూడా ఆసక్తితో ఉన్నారుట! ఆప్ పార్టీ దేశ వ్యాప్తంగా ఇలాంటి ఇమేజీ ఉన్న వారిని రాజకీయాల్లోకి స్వాగతిస్తోంది.
No comments:
Post a Comment