Thursday 20 February 2014

నా తెలంగాణ కోటి రతనాల వీణ

నా తెలంగాణ

(ఆగస్ట్ 15, 1951 నాటి తెలంగాణ పత్రిక సుజాతలో ప్రచురితమైన దాశరధి కవిత..  నా తెలంగాణ) 



కోటి తెలుగుల బంగారు కొండక్రింద
పరచుకొన్నట్టి సరసులోపల వసించి
ప్రొద్దు ప్రొద్దున అందాల పూలుపూయు
నా తెలంగాణ తల్లి; కంజాత వల్లి

వేయిస్తంభాల గుడినుండి చేయిసాచి
ఎల్లొరా గుహ లందున పల్లవించి
శిల్పిఉలి ముక్కులో వికసించినట్టి
నా తెలంగాణ, కోటి పుణ్యాల జాణ

మూగవోయిన కోటి తమ్ముల గళాల
పాట పలికించి కవితా జవమ్ము కూర్చి
నా కలానకు బలమిచ్చి నడిపినట్టి
నా తెలంగాణ, కోటి రత్నాల వీణ
    - దాశరధి

1 comment:

Jai Gottimukkala said...

Congratulations sir. Thanks for reminding us Dasaradhi's golden words at this historic moment.