Wednesday 17 April 2013

డబ్బున్న ఓ బ్యాచిలర్ ఎమ్మెల్యే!

 నేతా బనేగా కరోడ్పతి!

పిల్లలను పెద్దయ్యాక ఏమవుతావని అడిగితే టక్కున నాయకుడినైపోతా అనేస్తున్నారు. ఎందుకంటే... కోట్ల రూపాయల డబ్బు, అది తెచ్చిపెట్టే దర్జా, ఖద్దరుచొక్కాల వైభోగం, పదవుల్లో ఉన్న పెద్దలు వెలగబెట్టే దర్పం... ఎలాఉంటాయో రోజూ టీవీల్లో చూస్తున్నారు కదా. బాగా సంపాదించిన వారు ప్రజా సేవ చేయాలని ఉందంటూ నాయకులైపోతున్నారు. నాయకులైపోయిన వారు ప్రజాసేవను పక్కనతోసేసి బాగా సంపాదించే పనిలో పడుతున్నారు. 

కర్నాటక రాజకీయాల్లో ప్రియా కృష్ణ అనే ఈ యువ ఎమ్మెల్యేది వెరైటీ బ్యాగ్రౌండ్. బెంగళూరు నుంచి గత ఎన్నికల్లో ఓ సారి కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్యేగా గెలిచి, ఇప్పుడు రెండోసారి పోటీకి దిగిన ప్రియా కృష్ణ అక్కడి పొలిటీషియన్లలో ఓ రిచెస్ట్ పర్సన్. ఈ యువ ఎమ్మెల్యే వయసెంతో తెలుసా... కేవలం 29 ఏళ్లే. ఇంకా పెళ్లి కూడా అవలేదు. అంటే రిచెస్ట్ బ్యాచిలర్ పొలిటీషియన్ అన్నమాట. బీఏ ఆనర్స్ చదివాక ఎల్ఎల్బీ పూర్తి చేశారు. ఆ తర్వాత ఎంఏ పొలిటికల్ సైన్స్ పట్టా పుచ్చుకున్నారు. ఇరవయ్యేళ్లు కూడా నిండకుండానే తండ్రి తరుపున రాజకీయ ప్రచారాల్లో పాల్గొనడం వల్ల ఆసక్తి పెరిగింది. మంచి గోల్ఫ్ ఆటగాడైన ప్రియా కృష్ణ రాజకీయాల్లో సచ్ఛీలత పెరగాలని అభిలషిస్తారు.

రిచెస్ట్ పొలిటీషియన్....

ఈ ఎన్నికల్లో ఎలక్షన్  కమిషన్కు సమర్పించిన అపిడవిట్ ప్రకారం  ఆయన ఆస్తి మొత్తం 910 కోట్ల రూపాయలు. ఇదంతా రియలెస్టేట్ ద్వారా సంపాదించిందేనట. ప్రియా కృష్ణ తండ్రి సీనియర్ కాంగ్రెస్ లీడరు ఎం. కృష్ణప్ప. ఈ కుటుంబం నాలుగు దశాబ్దాలుగా రియలెస్టేట్ రంగంలోనే ఉందిట. అలాగే రాజకీయాల్లోనూ కొనసాగుతోంది. గత ఎన్నికల్లో ప్రియా కృష్ణ సిట్టింగ్ బీజేపీ మంత్రి వి. సోమన్నను అవలీలగా ఓడించేసి ఎమ్మెల్యే అయిపోయారు. ఇదంతా డబ్బు మహిమ అనుకోవడానికి లేదు. మనదేశంలో ప్రజాస్వామ్యం ఇలాగే వర్థిల్లుతోంది.  ఆస్తుల మాట బాగానే ఉంది. ఈ బ్యాచిలర్ ఎమ్మెల్యేకున్న అప్పెంతనే డౌటు వచ్చి ఉండవచ్చు!. అక్షరాలా 700  కోట్లట. భూములు కొనుగోలు చేసేందుకు చేసిన అప్పుల చిట్టా చాలా పెద్దదే. అయితే డబ్బు ఎంత ఉన్నా సాదాసీదాగా ఉండడానికే ఇష్టపడతానంటున్నారు ఈ యువ ఎమ్మెల్యే.

6 comments:

జలతారు వెన్నెల said...

wow! స్మార్ట్ గా కూడా ఉన్నాడండోయి...:) అమ్మాయిలు క్యులు ఈపాటికే కట్టి ఉంటారు.
అన్నీ ప్లస్ లే ఇతనికి...ఎక్కడనుంచి సేకరిస్తారండి ఇలాంటి వార్తలన్ని?

nihar said...

జలతారువెన్నెల గారూ థాంక్స్. ఎమ్మెల్యే గారి స్మార్ట్ నెస్ గుర్తించారు. ఏదో మామూలుగా రాసిన ఈ పోస్టును నాలుగు వందల మంది దాకా చదివారు. అందరికీ కృతజ్ఞతలు.... నిహార్

Anonymous said...

Fine Nihar:) మంచి సమాచారాన్నే సేకరించారు. మీ బ్లాగు కన్నడం లో కూడా కనబడేట్టు చేస్తే అక్కడి అమ్మాయిలకి సహాయం చేసిన వారు అవుతారు.

nihar said...

అనూ గారు బ్లాగు చూసి స్పందించారు కృతజ్ఞతలు. ఇందులో అంశం అమ్మాయిలకన్నా అబ్బాయిల్లో ప్రేరణాత్మకంగా ఉంటుందేమోనని నా అభిప్రాయం.... నిహార్

Anonymous said...

@Nihar...hope so:)

aditya said...

ఈ వార్త అబ్బాయిలకు ఎలా ప్రేరణ అవుతుంది. ప్రేరెపించే అంశం ఏముంది.