సాహసం చేయండి బామ్మలా...!
ఎనభై వసంతాలు చూసిన ఈ అమెరికా బామ్మ నిజంగా సాహస వనితే! ఇంతకీ ఆమె ఏంచేసిందో తెలుసుకోవడానికి ముందు ఓసారి వర్తమాన సమాజం పోకడపై ఫోకస్ చేయాలి. హైదరాబాద్లో ఈమధ్య చదువుకున్న కుర్రాళ్లకి ఈజీమనీ మార్గమేంటయ్యా అంటే ఆడవాళ్ల మెడల్లో గొలుసులు తెంపుకుపోవడం. ఓసారి రిస్కు తీసుకుంటే కనీసం రెండు తులాల బంగారం గొలుసు చిక్కినా అరవై వేలపైమాటే. తలకు హెల్మెట్ తగిలించుకోవడం, బైకు మీద రావడం రోడ్డు మీద వెళ్తున్న మహిళల మెడల్లోంచి గొలుసులు లాగేసుకోవడం. ఇదీ వరస. ఇంజనీరింగులు, ఎంబీఏలు చదివిన బడా బాబులకీ ఇదే పని. చిన్నాచితకా ఉద్యోగాలు వెలగబెడుతున్న కుర్రాల్లదీ ఇదే పని. పబ్బులకు, బార్లకీ అలవాటుపడిన జులాయిలు, పోకిరీలంతా తమ జల్సాల కోసం ఇతరుల కుటుంబాల్లో విషాదం మిగులుస్తున్నారు. ఇంతేకాదు సిగ్నల్ దగ్గర ఆగిన కార్ల డోర్లలోంచి లాప్ టాప్లు, సెల్ ఫోన్లు, ఆడవాళ్ల పర్సులు, బ్యాగులు ఏది కనిపిస్తే దాని లాగేసుకునే బ్యాచులు ఎక్కువైపోయాయి. బాధితులు పోలీసుల దగ్గరికెళితే ఉల్టా మనకే గీతోపదేశాలు. మార్నింగ్ వాక్ చేస్తున్న వారు, ఇంటి ముందు వాకిట్లో ముగ్గులు వేస్తున్న వారు, సందెవేళ పక్కవీధి షాపులకని వెళ్లున్న వారూ... బాధితులు మహిళలే. కానీ ఏ మహిళా ఇలాంటి హఠాత్పరిణామం నుంచి తేరుకుని దుండగుల్ని వెంటాడి పట్టుకున్న ఘటనలు మనమెరుగం. కాపాడండి... కాపాడండి అని నెత్తీనోరూ బాదుకుంటే ఎవరైనా స్పందించినా దొంగలు పరారైపోవడమే గానీ ఫలితం ఉండదు. మన వస్తువును వెనక్కి తెచ్చిచ్చే సినిమాల్లో కనిపించే హీరోల్లాంటి కుర్రాళ్లు ఎవరూ ఉండరు. ఇలాంటి బాధితులకు అమెరికా బామ్మగారు చక్కని మార్గదర్శి. ఇప్పుడామె గురించి తెలుసుకుందాం.
సాహసానికి నిలువుటద్దం.... |
4 comments:
ఆవిడకి 81 ఏళ్ల కి కూడా కాళ్ళు, చేతులు స్వాధీనంలో ఉన్నాయి, మరియు America లో organized గా ఉంటుంది ట్రాఫిక్ కాబట్టి అలా పరిగెట్టి పట్టుకుంది నిహార్ గారు. అదే హైదరాబద్ లో పాపం ఆ ట్రాఫిక్ లో పరిగెడితే అలా దొంగల వెంట,ఎక్కడ నుంచి ఏ వాహనం వచ్చి గుద్దేస్తుందో అన్న భయ్యం కూడా ఉంటుంది కదా? :))
@అదే నాలుగు చోట్ల నలుగురు మహిళలు ఎదురునిలిచి తలపడ్డార.....
.మీరలా అన్నారనుకోంది...మీరు బూతులు మాటాడినట్టు మీమీద విరుచుకు పడిపోతారు...ఆడాళ్ళ వరకూ ఎందుకు మగాళ్ళే చేతులో జే బులు పెట్టుకుని పోలీస్ స్టేషన్కి నడుచుకుపోతారు..మనం పరిగెత్తినా..చేజ్ చేసినా మన సూడో డిగ్నిటీ దెబ్బతినేయదూ....
జలతారువెన్నెల గారు, కేవీఎస్వీ గారు... నమస్కారం....
పోస్టు చదవి స్పందించినందుకు కృతజ్ఞతలు. నాకెందుకొచ్చిందిలే అనే తత్వం మనిషిలో పెరిగిపోతోంది. పొరుగువాడికి ఏమైనా స్పందించడం మానేశారు. చివరికి తనదాకా వచ్చినా తానే స్పందించలేని పరిస్ఙతి వచ్చేసింది. ఇదేతత్వంతో ఇతరురులూ స్పందించడం లేదు. ఆ వయసులో బామ్మగారు క్విక్గా రియాక్ట్ అయ్యారు కదా.! అందుకే అందరికీ షేర్ చేయాలనిపించింది.... నిహార్
Post a Comment