Monday 1 April 2013

సీసాలో ప్రకృతి సృష్టి!

బాటిల్ గార్డెనింగ్... టెరేరియం
చేపలు పెంచే అక్వేరియంలో మాదిరిగా గాజు కుప్పె, బోన్సాయ్ తరహాలో మరుగుజ్జు మొక్కలు... ఈరెండూ కలిపిన గార్డెనింగే బాటిల్ గార్డెనింగ్. ఇదే "టెరేరియం(TERRARIUM)". సీసాలో మొక్క పెచడం మాత్రమే కాకుండా ఓ థీమ్ క్రియేట్ చేయడం ఇందులో ప్రత్యేకత. 

ఎలా ఆవిర్భవించింది...

1829లో నథేనియల్ వార్డ్ అనే బ్రిటిష్ ఫిజీషియన్ మొక్కల పెంపకం మీదున్న ఆసక్తితో తన దగ్గరున్న గాజు జార్లలో కొన్ని రకాలు మొక్కలు పెంచడం మొదలెట్టాడు. లోపలున్న తేమ, వెలుతురు, వేడిమితోనే మొక్కలు పెరగడం ఆసక్తిగా మారింది. ఇదే మొక్కల పెంపకం ప్రక్రియగా మారిపోయింది. కొన్ని పశ్చిమ దేశాల్లో కోట్ల రూపాయల వ్యాపారం సాగుతున్న కమర్షియల్ హ్యాబీ ఇది. 

ఏమేమి కావాలి...

  • గాజు పాత్ర, పాత సీసా, గాజు గ్లాసు
  • చిన్నసైజు గులకరాళ్లు, రంగు రాళ్లు, పూసలు, గొట్టాలు
  • ఎర్ర లేదా నల్ల మట్టి
  • నాచూ, ఇసుక, గవ్వలు, శంకులు
  • నత్తలు, చేపలు, సీతకోకచిలుకలు(ఇవన్నీ బొమ్మలే)
  • చిన్నసైజు గాజు, రబ్బరు, ప్లాస్టిక్ బొమ్మలు

ఎలాంటి మొక్కలు ఎంచుకోవాలి...

  • సింగోనియం, డ్రెసినా, క్రిప్టాంథస్
  • ఆరేలియా నోడా, లక్కీ బ్యాంబూ
  •  కెమోడోరా పామ్, సింగోనియమ్, ఆర్చిడ్స్ 

బాటిల్ ఎలా సిద్ధం చేయాలి...

  • పాదర్శకంగా ఉండే గాజు కుప్పె, పాత్ర, సీసా లేదా గ్లాసును ఎంచుకోవాలి
  • అడుగుభాగాన ఒకట్రెండు అంగుళాలు గులకరాళ్లు వేయాలి
  • చిన్న సైజు బొగ్గు ముక్కలను లేయర్ కింద పరవాలి
  • ఎర్ర మట్టి లేదా నల్ల మట్టిని దళసరి పొరలా పరవాలి
  • మొక్క వేళ్లు బయటకి కనిపించకుండా మట్టిని సర్దాలి
  • అవసరమైతే మొక్క చుట్టూ మట్టితో చిన్న గట్టులా కట్టాలి
  • మనమనుకున్న థీమ్ లో పాత్ర లోపల అదనపు హంగులు చేరాల్చి

థీమ్ ఎలా ఉంటే బాగుంటుంది...

  • టెరేరియంలో ఆకట్టుకునే అంశం థీమ్ మాత్రమే
  • పగిలిన సీసా, మాడిన బల్బు కూడా థీమ్ ను బట్టి ఎట్రాక్టివ్ గా ఉంటుంది
  • సముద్రగర్భంలా కనిపించాలంటే మొక్క చుట్టూ నాచు, గవ్వలు వేయాలి
  • అడవిలా అనిపించాలంటే జంతువుల బొమ్మలు, ప్లాస్టిక్ చెట్లు ఉపయోగపడతాయి
  • ఎడారిలాగా ఉండాలంటే ఇసుక, ఒంటె బొమ్మలు వాడుకోవచ్చు
  • ఫ్యాన్సీ ఐటమ్గా మారాలంటే రంగురాళ్లు, విరిగిన గాజులు, పాత క్లిప్పులు ఏవైనా బానేఉంటాయి 
  • టెరేరియంలో ఆసక్తి, సృజనాత్మకత ఉండాలేగానీ క్రియేటివిటీ అన్ లిమిటెడ్!

ఏ ఏ జాగ్ర్త్తత్తలు తీసుకోవాలి...

  • ఏ సీజన్లో అయినా టెరేరియం గార్డెనింగ్ మొదలెట్టవచ్చు
  • ఎంచకునే మొక్కను బట్టి గాలి, వెలుతురూ ఉండేలా చూడాలి
  • అవసరాన్ని బట్టి నీరు పోయాలి
  • మట్టిని అప్పుడప్పుడూ మార్చడం మంచిది
  • థీమ్ కూడా తరచూ మార్చేస్తూ డెకొరేట్ చేసుకోవడం మంచిది
  • గాజు సీసాలతో వ్యవహారం కాబట్టి కింద పడిపోకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి
  • చిన్న పిల్లలకు అందకుండా, దూరంగా ఉంచుకోవాలి


No comments: