Monday 1 April 2013

పూల మనసులో భావం...!

ఊసులాడే నెథర్లాండ్స్ సుమాలు! 

ఆ పూల సోయగాలు చూస్తే ఆకాశమే అసూయ చెందుతుంది. ప్రపంచంలో తులిప్ పుష్పాలంటే నెథర్లాండే. సముద్ర మట్టానికన్నా పల్లపు ప్రాంతంలో ఉండడమే దానికి అడ్వాంటేజ్. నెథర్లాండ్స్ అంటేనే లో లెవల్ కంట్రీ అని అర్థం. అక్కడి వాతావరణం తులిప్ గార్డెన్స్ కు బాగా అనుకూలిస్తుంది. 

కాశ్మీరులో ప్రస్తుతం జరుగుతున్న తులిప్ ఫెస్టివల్ లో సోయగాలు వెదలజల్లుతున్న పుష్పజాతులు చాలామటుకు  అక్కడివే.  నెథర్లాండ్స్ లోని హాలాండ్ నుంచి అనేక రకాల మొక్కలు దిగుమతి చేసుకుని కాశ్మీరులో పెంచుతున్నారు.  ఇప్పుడు నెథర్లాండులోనూ తులిప్ ఫెస్టివల్ జరుగుతోంది. యూరఫ్ దేశాల టూరిస్టులందరి అడుగులూ నూర్ డూస్ట్ పోల్డర్ పూల తోటల వైపే....




నూర్ డూస్ట్ పోల్డర్ పూలతోటలు

నెథర్లాండ్స్ సుమబాల నూర్ డూస్ట్ పోల్డర్. వర్ణించానికి అక్షరాలు చాలని వసంత సోయగం. కనుచూపు మేరంతా పరుచుకున్న పూల తివాచీలు. నేలమీద విచ్చుకున్న ఇంద్రధనస్సులు.  ఆ తోటల మధ్య నుంచి మేఘాలలో తేలిపొమ్మన్నదంటూ బైకుల మీద దూసుకుపోవచ్చు. గుర్రపుబగ్గీల మీద బ్రిటీషు రారాజులా షైరు చేయొచ్చు. వాహనాల్లో దర్జాగా షికారు తిరగొచ్చు. ఔత్సాహికులకు పూల మొక్కల పెంపకం, కుండీలను అందంగా అలంకరించడం, బొకేలు తయారుచేయడం ఇలా రకరకాల యాక్టివిటీల్లో ప్రత్యేక శిక్ణణ ఇస్తున్నారు. బ్రిటీష్, డచ్ కల్చర్ కలగలిసిన నెథర్లాండ్స్ తులిప్ ఫెస్టివల్ చూడాలంటే ప్రకృతిని ఆరాధించే హృదయం ఉండాలి. 






No comments: