సంవ్రదాయాల సంకెళ్లు తెంపేయ్...!
పెళ్లంటే మగాడు రాజాలా దర్పం వెలగబెడతాడు. లక్షల రూపాయలు కట్నం పుచ్చేసుకుంటాడు. నగానట్రా కానుకలు దండేసుకుంటాడు. మూడుముళ్లేసిన మరుక్షణం నుంచి కొందరు డబ్బు మనుషులకు పెళ్లమంటే ఏటీఎం కింద లెక్కే. పైగా పెళ్లి మండపానికి వచ్చే దాకా, ఆ తర్వాత అత్తారింటికి వెళ్లేదాకా దర్జా. గుర్రం మీద ఊరేగింపులు, బ్యాండు మేళం ఆహ్వానాలు, బరాత్ లో తీన్మార్ డాన్సులు, కొత్త అల్లుడు కాలు కింద పెట్టకుండా ఎన్నో అరేంజ్మెంట్స్. అదే పెళ్లికూతురు మగాడి వెంట వేలుపుచ్చుకుని తలొంచుకుని నడవాల్సిందే. మహా అంటే మేనమామలంతా కలిసి వెదురుబుట్టలో పెళ్లిమండపం దాకా మోసుకురావడమొక్కటే పెళ్లికూతురికి జరిగే వైభోగం.
గుర్రమెక్కి పెళ్లికొడుకింటికే వెళ్లిన రజనీ |
గుర్రమెక్కావచ్చు...!
ఆడది మాత్రం తలొంచుకుని ఎందుకు తాళి కట్టించుకోవాలనుకుంది మధ్య ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన పాతికేళ్ల రజని. ఎప్పుడూ పెళ్లికొడుకే గుర్రమెక్కి ఊరేగింపుగా పెళ్లికూతురింటికి రావాలా అనేది ఈ లా స్టూడెంట్ ప్రశ్న. ట్రెడిషన్స్ బ్రేక్ చేస్తే ఏమవుతుందని ప్రశ్నించింది. పెద్దలు ఏం సమాధానం చెప్పాలా అని ఆలోచిస్తుండగానే గుర్రం ఎక్కేసింది. ఊరేగింపుగా పొరుగునే ఉన్న పెళ్లికొడుకు ఇంటి దాకా వెళ్లింది.
సంప్రదాయాలెప్పుడూ ఒకేలా ఉండవని చాటిన పెళ్లికూతురు |
8 comments:
Wish u Good luck. Pl remove word verification
థాంక్యూ శర్మ గారూ...
ఒక్క గుర్రం ఎక్కడం అన్న విషయంలోనే కాక,జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్యలను ఇలాగే ధైర్యంగా ఎదురుకోవాలని కోరుకుందాము..:) Please remove Word verification Nihar garu. It will be easy to comment!
ఇంత మంచి స్ఫూర్తిదాయక మైన టపాకి అలాంటి శీర్షిక అవసరమా ?
జలతారువెన్నెల గారూ థాంక్యూ...వర్డ్ వెరిఫికేషన్ తొలగిస్తాను. రజనిలాంటి ప్రోగ్రెసివ్ థాట్స్ ఉన్న మహిళలుంటేనే సమాజం రైట్ వేలో నడుస్తుందని నా నమ్మకం... అందుకూ షేర్ చేసుకున్నాను.... నిహార్
జోగారావు గారూ థాంక్స్... స్పూర్తిదాయకమైన శీర్షిక పెడితే చదువరుల సంఖ్య ఎందుకో తగ్గిపోతోంది. అందుకే ఆసక్తిగా ఉండేలా కొన్నిసార్లు తిరకాసుగా ఆలోచించాల్సి వస్తోంది. మనం రాసింది ఎవరైనా చదివితేనే కదా ఉపయోగం. అంతేగానీ దురుద్దేశాలేవీ లేవు... నిహార్
ఈ గుర్రం అయితే ఓ.కె.అందరికి ముచ్చటగానే ఉంటుంది. చాలా మంది మగాళ్ళు సాయంత్రం అయ్యేసరికి మందు గుర్రాళ్లు ఎక్కి మగాళ్ళమని సంబరపడుతుంటారు. అటువంటి వాటికి పోటి పడితేనే ప్రమాదం. గ్రామాల్లో కొన్ని కుటుంభాల్లో స్త్రీలదే పెత్తనం. కాబట్టి ఎవరు గొప్ప అనేది కాకుండా సర్థుకుపొతేనే సంసారం. మంచి టపా పెట్టారు.
సార్వబౌమ గారూ కృతజ్ఞతలు...మన సంప్రదాయాల్లో కొన్నయినా మహిళల్లో ఆత్మవిశ్వాసం పెంచేవిగా ఉంటే బాగుండేదని గుర్రమెక్కిన రజని బలంగా వాదిస్తుంది. నా నమ్మకం కూడా ఇదే... నిహార్
Post a Comment