Sunday 19 May 2013

ఎన్నెన్నో వర్ణాలు... ఏవేవో అందాలు...!

రంగుల అలలు!
ప్రకృతి చిత్రకారుడి మదిలో మెదిలే భావాలన్నీ నేల మీదో, ఆకాశమ్మీదో రంగులద్దుకుంటాయేమో?! మన చుట్టూ కనిపించే ఈ అందాలన్నీ ఆ ఊహలకు ప్రతిరూపాలేనేమో?! కెనడాలోని అల్బెర్టాలో ఉన్న సుందరమైన సరస్సు అబ్రహం. ఈ సరస్సు జలాలు చూస్తే స్వచ్చమైన నీళ్ల కింద రంగులద్దిన కాన్వాసు పరిచారేమో అనిపిస్తుంటుంది. అదేం మాయోగానీ  జలాశయంలోని అలల కదలికలన్నీ వర్ణ శోభితం...సరస్సు అంచులను తాకినట్లుండే ఆ నిర్మలాకాశం రాగరంజితం!

మీథేన్ వాయువు సృష్టించే సోయగాలు

సరస్సు గర్భంలో మీథేన్ వాయువు నిక్షేపాలున్నాయిట. మంచుతో గడ్డకట్టినట్లుండే నీళ్ల  అడుగు భాగంలో మీథేన్ వాయువు  తెట్టులా తేలడంతో ఆ వాయువు నీళ్లూ కలిసి రంగురంగుల దృశ్యాలు రూపుదాల్చుకుంటున్నాయి. మొత్తానికి ఆ సరస్సంతా రకరకాల పెయింటింగులను ఒక్కచోటికి చేర్చినట్లు ముచ్చటగా ఉంటుంది. నిజంగా ప్రకృతి ఓ వింత కదా...!


(చూడచక్కని ప్రకృతి దృశ్యాలను కెమెరాలో బంధించిన ఒరిజినల్ ఫొటోగ్రాఫర్లకు, ఆ చిత్రాలను అందించిన వెబ్సైట్లకు కృతజ్ఞతలు)

2 comments:

Anonymous said...

Amazing views. Good collection.

nihar said...

అనూ గారికి థాంక్స్.... మీ అభినందనలు ఎంతోకష్టపడి ఫొటోలు తీసిన ఆ ఫొటోగ్రాఫర్లకు చెందుతాయి. బ్లాగ్ ఫాలో అవుతున్నందుకు కృతజ్ఞతలు... నిహార్