నాలుగడుగులు నాలుగు విధాలా మేలు!
చేతులు కాలకుండానే
ఆకులు పట్టుకుందాం...!
హైదరాబాద్ కేబీఆర్ పార్క్ దగ్గర తెల్లవారకుండానే మార్నింగ్ వాకర్ల సందడి మొదలవుతుంది. రోడ్డు పొడవునా కార్లు బారులుదీరి ఉంటాయి. రకరకాల జ్యూసులు అమ్మే వారు సరేసరి. పొలిటీషియన్లు, ఒకరిద్దరు సినిమావాళ్లు, బిజినెస్మేన్లు, ఆఫీసర్లు, ఎక్కువగా యూత్ కనిపిస్తారు. క్రమం తప్పకుండా వాకింగ్ చేస్తున్న వీరిని చూస్తే అందరికీ హెల్త్ కాన్షియస్ బాగా పెరిగిపోయిందనిపిస్తుంది. కేబీఆర్ పార్కు, నెక్లెస్ రోడ్డు, పబ్లిక్ గార్డెన్స్లోనూ మార్నింగ్ వాకర్లు చాలా మందే కనిపిస్తుంటారు. సరూర్ నగర్ పార్కు దగ్గర ఉదయం వేళ సందడి ఎలా ఉంటుందో చూద్దామనిపించి వెళ్లాను. కేబీఆర్, నెక్లెస్ రోడ్, పబ్లిక్ గార్డెన్స్ సందడితో పోల్చితే చాలా తక్కువే.
దిల్ సుఖ్ నగర్ దగ్గరున్న సరూర్ నగర్ స్టేడియంలోనూ కొంత మంది క్రీడాకారులు వాకింగ్ కు వస్తుంటారు. వనస్థలీపురం కాలనీల్లో వాకింగుకు అనువుగా ఉన్నా దిల్ సుఖ్ నగర్, ఎల్బీ నగర్ ప్రాంతాల్లో సౌకర్యాలు పెరిగితే బాగుండుననిపిస్తుంది. ప్రస్తుతానికి సరూర్ నగర్ చెరువు గట్టు మీద వాకింగ్ బాగానే ఉంటుంది. కానీ ఈ ప్రాంతంలో కనిపించే వాళ్లలో మెజారిటీ రిటైర్డ్ పీపులే. వృద్ధాప్యంలో బీపీ, షుగర్, గుండె జబ్బులు వచ్చాక ఆరోగ్యం మీద దృష్టి పెట్టిన వారి సంఖ్య ఎక్కువగా ఉందనిపిస్తుంది. ఉన్నవాళ్లలో కొద్దిమంది కూడా యువకులు కనిపించరు. అనారోగ్యాలు పట్టిపీడించే దాకా ఆగకుండా ముందుగానే మేల్కొని శరీరానికి అవసరమైన వ్యాయామం అందిచడం నగరజీవికి అనివార్యం. ఉరుకులు పరుగుల నగరజీవితంలో మార్నింగ్ వాక్ జీవన శైలిలో ఒక భాగం కావాల్పిన అవసరం ఉంది. దీనిపై యువతరంలో అవగాహన పెరగాలి. నెక్లెస్ రోడ్, కేబీఆర్ పార్క్ ప్రాంతాల్లో వివిధ సందర్భాల్లో 'రన్' నిర్వహించి యూత్ లో ఆరోగ్యం పట్ల అవగాహన పెంచుతున్న సంస్థలు ఇటువైపు కూడా దృష్టి పెడితే ఉపయోగకరంగా ఉంటుంది.
4 comments:
Nice photos:) Good post.
అనూ గారూ థాంక్స్....నిహార్
నన్నడిగితే రోజూ వీలు కుదిరితే రెండు మైల్స్ అన్నా నడిస్తే చాలా మంచిది.
ఇకపోతే అడపా దడపా 5k, 10k,50k పరిగెట్టగలిగిన వారు చాలా అదృష్టవంతులు.నిహార్ గారు, టపా నచ్చింది.
జలతారువెన్నెలగారూ కృతజ్ఞతలు... ఒళ్లు పెరిగిపోయి, రోగాలు వెంటాడుతున్న వేళ డాక్టర్లు చెబితేగానీ మన వాళ్లకు వాకింగ్ ఆరోగ్యానికి మంచిదన్న విషయం గుర్తుకురాదు. అందుకే అకేషనల్ గా నిర్వహించే 'రన్స్' లోనైనా ఎక్కువ మంది పాల్గొనేలా చేస్తే మంచిది... నిహార్
Post a Comment