Friday 24 May 2013

స్టార్స్ తో 'సై' అనిపించిన డూప్లికేటు!

కేన్స్ లో 'సై'య్యాట!

హాలీవుడ్ తారలంతా కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో సందడిగా ఉండగా పాప్ సంచలనం 'సై'(PSY) నేనేనంటూ ఒకతను అక్కడ ప్రత్యక్షమయ్యాడు. ప్రపంచంలో హాలీవుడ్ స్టార్సును మించిన సెలబ్రిటీలు దాదాపు ఉండరు. కానీ హేమీహేమీలైన హాలీవుడ్ స్టార్స్ 'సై'తో ఫొటో దిగేందుకు క్యూ కట్టారు. కొందరు తాము తీయించుకున్న ఫొటోలను గర్వంగా ట్విట్టర్లో పోస్టు చేసుకున్నారు. ఈ సమాచారం అసలుసిసలైన దక్షిణ కొరియా పాప్ సింగర్ 'సై' చూసి కంగుతిన్నాడు. వీడెవడో తనలా ఫోజుకొడుతూ హాలీవుడ్ సినీ ప్రముఖులతో ఫొటోలు దిగుతున్నాడని గ్రహించి వెంటనే ట్విట్టర్లో మెసేజ్ పెట్టాడు. తానసలు కేన్స్ ఫెస్టివల్కే రాలేదని ఒరిజినల్ 'సై' ట్విట్టర్ సందేశం చూసిన హాలీవుడ్ స్టార్స్ తాము ప్పులోకాలేశామని తెలుసుకుని నాలిక్కరుచుకున్నారు.

డూప్లికేటుతో ఫొటో దిగిన హాలీవుడ్ స్టార్...  పక్కనే ఒరిజినల్ 'సై'

కాల్షీటుల లెక్కన క్యాష్ రాబట్టే సినీతారలు ఈ సై అంటే ఎందుకింత క్రేజ్ చూపించారంటారా..? దక్షిణ కొరియా పాప్ సింగర్ సై అంటే ఏ సినీ స్టార్కూ లేనంత క్రేజు ఉంటుంది. పదేళ్లు నానాతంటాలు పడి వందలాది పాప్ ఆల్బమ్స్ రిలీజ్ చేసినా పక్కింటివాడు కూడా గుర్తుపట్టని స్థితి నుంచి సై ప్రపంమే తనతో స్టెప్పులేసే లెవల్ కు ఎదిగిపోయాడు. సై రూపొందించిన 'గంగనమ్ స్టయిల్' పాప్ ఆల్బమ్ యూట్యూబ్ లో యమా చక్కర్లు కొడుతోంది. రిలీజైన గంటల్లోనే యూట్యూబులో హిట్ల మీద హిట్లు వచ్చాయి. వారంలో వందకోట్ల మంది చూసిన వీడియో 'గంగనమ్ స్టయిల్'. నిజంగా సై అదృష్టమే అదృష్టం. ఈమధ్య 'జెంటిల్మన్' అనే మరో ఆల్బమ్ రిలీజ్ చేసినా సంగీతాభిమానులు సై అడుగులో అడుగు కలిపి స్టెప్పులేశారు. 

'సై' అంటే 'సై'...!

ప్రపంచమే దాసోహమనే హాలీవుడ్ తారలే సై అనగానే పక్కన నిలబడి ఫొటో తీయించుకున్నారంటే 'సై' పాప్ మ్యూజిక్ మహిళ అలాంటిది. ఇంతకీ ఇంత మంది స్టార్సును బోల్తా కొట్టించిన ఆ డూప్లికేట్ ఎవరంటారా...? ఫ్రాన్సుకు చెందిన 34 ఏళ్ల డెనిస్ కర్రె. ఫిజిక్ అచ్చం పాప్ సింగర్ 'సై' లాగానే  ఉంది. కాబోతే కళ్లజోడు, డ్రెస్ కోడు, మ్యానరిజం కాస్త మేనేజ్ చేశాడంటే...! ఇంకేముంది ఆకాశం నుంచి రాని హాలీవుడ్ తారలంతా నిజమైన 'సై' అనుకుని ఈ డూప్లికేటు పక్కనే నిలబడి ఫొటో తీయించుకున్నారు. 

2 comments:

Dantuluri Kishore Varma said...

ఆల్మోస్ట్ ఏ కొరియా వ్యక్తికి నల్లకళ్ళజోడు పెట్టినా సై లానే ఉంటాడు. :p

nihar said...

దంతులూరి కిశోర్ వర్మ గారూ... స్పందించినందుకు థ్యాంక్స్. కొరియన్ ఫేసులన్నీ దాదాపు ఒకేలా ఉన్నా 'సై' లో ఉన్న చలాకీ తనం మిగతావారిలో కనిపించదు. అక్కడైనా డూప్లికేటు దొరికిపోయి ఉండాల్సింది. కానీ చక్కగా మేనేజ్ చేశాడు