మణిపూర్ సామాజిక ఉద్యమకారిణి ఇరోం షర్మిల..
ఈసారి ఓటేద్దామనుకుంది..
కానీ అధికారులు నో చెప్పారు..
ఇదా మన ప్రజాస్వామ్య వ్యవస్థ..? !
ఈ ప్రజాస్వామ్య వ్యవస్థ మీద నమ్మకం లేకనే ఇన్నాళ్ళూ ఎన్నికలకు దూరంగా ఉంది. ఆం అద్మీ పార్టీ ని చూసాక మళ్ళీ ఓటు మీద నమ్మకం కలిగిందిట. కానీ పద్నాలుగేళ్ళుగా దీక్ష చేస్తున్న ఈమెకు ఓటు వేసే అవకాశం ఇవ్వలేదు. ఈశాన్య రాష్త్రాల్లో అమల్లో ఉన్న ఆర్ముడ్ ఫోర్సెస్ యాక్ట్ 1958 కి నిరసనగా అమె నిరహార దీక్ష చేస్తున్నారు. దీంతో అమెను పోలీసులు గతంలో అరెస్ట్ చేసి జైలుకు పంపారు. ఈ కారణంగా ఓటు హక్కును కోల్పొయింది. మణిపూర్ పోలింగ్ లో ఓటు వేసే అవకాశం ఇవ్వాలంటూ ఆమె చేసిన విన్నపాన్ని ఎన్నికల కమిషన్ తోసిపుచ్చింది. ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం జైల్లో శిక్ష పడిన వారికి ఓటు హక్కు కల్పించడం కుదరదని స్పష్టం చేసింది. ఈ లెక్కన ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఎంత మంది నాయకులు ఆ హక్కును కోల్పోవాలో అధికారులకే తెలియాలి?

No comments:
Post a Comment