నరేంద్ర మోడి... ఇండియన్ పొలిటీషియన్స్ లో ఓ స్టైల్ ఐకాన్. తెల్లని క్రాఫు.. కాటన్ కుర్తా మోడి ఐడెంటిటి. మోడి ఎప్పుడూ మూడు అంశాలను మరచిపోరు. అవే- ఐస్, వాయిస్, క్లోథ్స్. రాజకీయాల్లో ప్రత్యేకంగా కనిపించాలంటే సంథింగ్ డిఫరెంట్ గా ఉండాలనేది బీజేపీ ప్రధాని అభ్యర్థి నిశ్చితాభిప్రాయం. ఎన్నికల వేళ ఆసక్తి కలిగించే మోడి కుర్తా కధ ఏంటి.. ? ఏ షాపులో దుస్తులు కొంటారు.. ? తెల్లని వెంట్రుకల వెనుక దాగిన రహస్యం ఏమిటి..? పర్స్ నల్ లుక్ కోసం మోడి అమెరికా ఎందుకు వెళ్ళారు..? సోనియా రాజకీయ సలహాదారు అహ్మెద్ పటేల్, పారిశ్రామిక వేత్త గౌతం అదానీ, బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడి.. ఈ ముగ్గురికీ ఒకే సలహాదారు.. ఆయనెవరు..? పూర్తి ఆసక్తికరమైన కథనం...
మోడీ కుర్తాలకు ఓ బ్యాక్ గ్రౌండ్ ఉంది. అహ్మదాబాద్ సిటీలో ఉన్న "జడే బ్లూ" షోరూంలో మోడీ కుర్తాలు హాట్ కేకుల్లా సేల్ అవుతాయి. "జడే బ్లూ" ఓనర్ బిపిన్ చౌహాన్ నరేంద్ర మోడీ పర్సనల్ టైలర్. 20 ఏళ్ళుగా మోడీ డ్రెస్సులన్నీ ఆయనే కుడుతున్నారు.
బిపిన్ వెనుకా ఓ కథ ఉంది! ఆయన తన సోదరుడితో కలిసి అహ్మదాబాద్ లోని ఓ బట్టల షాపులో గుండీలు కుట్టుకుంటూ జీవనం సాగించేవాడు. 1990లో నరేంద్ర మోడీ సంఘ్ లో స్వయం సేవక్ గా ఉన్నప్పుడే బిపిన్ పరిచయం. అప్పటినుంచే దుస్తుల విషయములో చాలా జాగ్రత్తలు తీసుకునే మోడీ ఎప్పుడైనా బిపిన్ తోటే బట్టలు కుట్టించుకునేవారు.
1995 లో అహ్మదాబాద్ నగరంలో "జడే బ్లూ" షోరూం పెట్టారు. ఇక మోడీ డ్రెస్సులన్నీ అక్కడే. కాలానుగుణంగా స్తైల్స్ మారుతున్నాయి. ఇప్పుడు కుర్తాలు వచ్చాయి. "జడే బ్లూ"లో మోడీ కుర్తాల పేరుతో ఎక్స్ క్లూజివ్ బ్రాండ్ దొరుకుతుంది.
"జడే బ్లూ" యజమాని బిపిన్ - నరేంద్ర మోడీకే కాదు.. సోనియా రాజకీయ సలహా దారు అహ్మెద్ పటేల్, మరో పారిశ్రామిక వేత్త గౌతం అదానీలకు కూడా డ్రెస్ డిజైన్ చేస్తాడు. ఇందులో మొదటి ఇద్దరూ రాజకీయంగా బద్ద విరోధులు..చివరి ఇద్దరూ మంచి మిత్రులు!.
నరేంద్ర మోడీ డ్రెస్ స్టైలింగ్ లో కుర్తా స్పెషల్. ఇక ఆయన తెల్లని క్రాఫ్.. ట్రిం చేసిన గడ్డం కూడా స్పెషలే. ఎప్పుడూ దువ్వెన వెంట ఉంచుకుంటారు. హెయిర్ స్టిలింగ్ను ఏ మాత్రం నిర్లక్ష్యం చేయరు. దేశంలోని మిగితా నాయకుల్లో విభిన్నంగా కనిపించాలనే తపత్రయం మోడీకి బాగా ఎక్కువ. ఇదే - ఇమేజ్ మేనేజ్ మెంట్. లుక్ ఆండ్ ఫీల్ బాగా ఉండాలనే తపన. తనను తాను 100 పర్సెంట్ పర్ఫెక్ట్ గా ప్రజెంట్ చేసుకోవడం మోడీకి ఎలా అబ్బిందో తెలుసా? ఇందుకోసం ఆయన అమెరికాలో మూడు మాసాల ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు. అదే పబ్లిక్ రిలేషన్స్ ఆండ్ ఇమేజ్ మేనేజ్మెంట్ కోర్స్. రాజకీయల్లో అంచెలు అంచెలుగా ఎదిగేందుకు మోడీ చేయని ప్రయత్నమంటూ లేదు.
2007 గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల నాటికి మోడీకి దాదాపు బట్టతలే. ఆ తర్వాతే హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ చేయించారు. ఇక అప్పటి నుంచీ క్రాఫ్ తో మోడీ లుక్ మారి పోయింది. బాలీహుడ్ హీరో లాగా స్టైల్ మెయింటెనన్స్.. లుక్ అండ్ ఫీల్ లోనూ స్పెషాలిటీ. హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ చేసినప్పుడు ఉలెన్ క్యాప్ నెత్తిన ఉండేది. ఎవరికీ అనుమానం రాకుండా!
మోడీ వ్యక్తిత్వం లోనూ ప్రత్యేకత ఉంది. స్వామీ వివేకానంద అంటే అయనకు ఆదర్శం. ఆ భోదనలను పాటిస్తారు. మద్యపానం, ధూమపానం అలవాట్లు లేవు. పూర్తిగా శాఖహారి.
మోడీ మంచి కవి కూడా! సొంతగా బ్లాగ్ రాస్తారు. తన పేరు మీదే వెబ్ సైట్ నడుస్తోంది. ఎప్పుడూ సోషల్ మీడియా లో ప్రజలకు దగ్గరగా ఉంటారు. టెక్ సావీ పొలిటీషియన్.
గుజరాత్ ముఖ్యమంత్రిగా.. ఇప్పుడు బీజేపీ ప్రధాని అభ్యర్థిగా తనదంటూ ఓ స్టైల్ చాటుకుంటున్నారంటే... తన మీద తాను ద్రుష్టి పెట్టుకోవడమే. తనను తాను తీర్చి దిద్దుకోవడమే. ఆయన ఇండియన్ పొలిటీషియన్స్ లో ఓ స్టైల్ ఐకాన్.
No comments:
Post a Comment