యోగా గురు రాందేవ్ బాబా హానీమూన్ దెబ్బ
గట్టిగానే తగిలింది. బ్రహ్మ చారి బాబాకి హానీమూన్ ఏమిటా అనుకుంటున్నారా..?
కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో హానీమూన్లు,
పిక్నిక్కులు జరుపుకుంటారంటూ రాందేవ్ బాబా సెటైర్లు వేసి ఇరకాటంలో పడ్డారు.
ఇది ఎస్సీ, ఎస్టీలను కించ పరచడమేనని దిగ్విజయ్ లాంటి కాంగ్రెస్ అగ్రనేతలు
మండిపడ్డారు. రాందేవ్ను అరెస్టే చేయాలన్న డిమాండు కూడా ఊపందుకుంది. అయితే
అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గానూ బాబా నిర్వహించే యోగా శిబిరాలను అనేక
రాష్ట్రాలు నిషేధించాయి.http://aptopnews.com/political-news/557-2014-04-29-01-52-29
ముందు ఉత్తర ప్రదేశ్ బ్యాన్ చేస్తే తాజాగా
మహారాష్ట్ర, హిమాచల్ ప్రదేశ్, రాజస్ధాన్ ప్రభుత్వాలు కూడా నిషేధం
విధించాయి. బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీకి మద్దతుగా ఉన్న రాందేవ్
బాబా- రాహుల్ పెళ్లి గురించి మాట్లాడుతూ హానీమూన్ కామెంట్లు చేశారు. యువనేత
విదేశీ అమ్మాయిని పెళ్లి చేసుకోబోతే సోనియా గాంధీ అడ్డు తగులుతున్నారని
బాబా చెప్తున్నారు. ఇదే జరిగితే రాహుల్ ఈ దేశానికి ప్రధాని కావడం
అసాధ్యమన్నది ఆమె భయమంటారు రాందేవ్. ఇక్కడి అమ్మాయిని వివాహమాడటం రాహుల్ కు
ఇష్టం లేదని చెప్తున్నారు. అందుకే యువనేత ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో
హానీమూన్, పిక్నిక్ టూర్లకు వెళ్తుంటారని వ్యాఖ్యానించారు. దీని మీద రచ్చ
రచ్చ అవుతోంది.http://aptopnews.com/political-news/557-2014-04-29-01-52-29
No comments:
Post a Comment