Tuesday 29 April 2014

తెలంగాణా జంగ్

పద్దెనిమిదేళ్లు నిండిన కొత్త ఓటరు చేతికి తొలి సంపాదన ఓ పచ్చనోటు! పొలానికి నీళ్లెక్కడివి.. మోటారు తిరిగేందుకు కరెంటు ఎలాగొస్తుంది అని ఆలోచించే రైతన్నకు ఓ పంచెల జోడి అందవచ్చు. వీలుంటే ఓ సారాయి సీసా.. మరీ మరీ మీ ఓటు కావాల్సి వస్తే బిర్యానీ పొట్లం మీ చేతికందవచ్చు. ఆడ పడుచుకు చుక్కల చీర.. లేదంటే వెండి ముక్కుపుడక.. ఓ స్టీలు బిందె.. ఇలా ఎన్నెన్ని కానుకలో మన ఇంటి ముంగిటికి రాత్రికి రాత్రే నడిచొచ్చేయవచ్చు. ఇవన్నీ ఓ పూట ఆకలి తీరుస్తాయి. ఆ క్షణం తృప్తి కలిగిస్తాయి. ఆ కృతజ్ఞతతో మనల్ని ప్రలోభపెట్టిన వారికి ఓటు వేశామంటే మన వేలితో మన కంట్లోనే పొడుచుకున్నట్లు.
http://aptopnews.com/telangana-news/559-2014-04-29-18-02-05
ఐదేళ్ల పాటు మన బతుకుల్లో కమ్ముకునే చీకట్లకు మనమే తెర లేపినట్లు. ఇంత మంది అభ్యర్థుల్లో ఎవరో ఒకరు మన మేలు కోరుకునే వారుంటారు. ఆ ఒక్కరినీ ముందుగా గుర్తించకపోతే మనం వేసే ఓటు వృధా. అరవై ఏళ్ల పోరాటం సాకారమవుతున్న వేళ... కొత్త రాష్ట్రం ఆవిష్కారమవుతున్న తరుణం.. ఒకటికి పదిసార్లు ఆలోచించాకే ఓటు హక్కు వినియోగించుకుందాం.
http://www.aptopnews.com/ 

No comments: