Wednesday 20 February 2013

KIDS NEWS: Brave Girl Malaika

శభాష్ మలైకా

మలైకా సింగ్... పదిహేనేళ్ల ధైర్యవంతురాలైన అమ్మాయి. పదో క్లాస్ చదువుతోంది. రాజస్థాన్ రాజధాని జైపూర్ నగరంలో సాయంత్రం ఆరున్నర వేళ ఇంటి నుంచి ట్యూషన్ కు వెళ్తోంది. మెయిన్ రెడ్డు మీద నడుచుకుంటూ వెళ్తోన్న మలైకాకు అనుకోని సంఘటన ఎదురైంది. అయితే అందరమ్మాయిల్లా కాకుండా సమయస్ఫూర్తితో వ్యవహరించింది. ఎవరో వచ్చి ఆదుకుంటారని ఎదురుచూడకుండా స్వీయరక్షణకు నడుంకట్టింది. ఇంతకీ ఏం జరిగిందంటే... పక్కనే కారాపిన నలుగురు దుండగులు ఆమెను బలవంతంగా ఎత్తుకు వెళ్లేందుకు ప్రయత్నించారు. గట్టిగా అరిచినా పక్కనున్న "మగ'వాళ్లెవరూ ముందుకు రాలేదు. మనంకెందుకొచ్చిందిలే అనుకుని పక్కకు తప్పుకున్నారు. పైగా అంతా సినిమా చూసినట్లు చోద్యం చూశారు. ఢిల్లీ గ్యాంగ్ రేప్ ఘటన తర్వాత ఎందుకైనా మంచిదని పుస్తకాల సంచీలో పెట్టుకున్న కూరగాయల కత్తి ఆపద కాలంలో మలైకాకు పనికొచ్చింది. కత్తి తీసి ఎదురు తిరగగానే దృడకాయులైన నలుగురు దుండగులు బిక్కచచ్చిపోయారు. తోకముడుచుకుని పరారయ్యారు. ముప్పు వచ్చినప్పుడు ముందుకు రాని జైపూర్ వాసుల్లో చాలా మంది ఆ అమ్మాయి సాహస కార్యం గురించి తెలిశాక ఇంటికొచ్చి తెగ అభినందిస్తున్నారు. ఈ అనుభవం తర్వాత మలైకా మిగతా అమ్మాయిలకు ఏం చెప్పిందో తెలుసా...

 

  • అమ్మాయిలు స్వీయ రక్షణకు ఏర్పాట్లు చేసుకోవాలి

  • కనీసం చిన్న కత్తి, లేదంటే కారం సొడి దగ్గరుంచుకోవాలి

  • బజారులో పెప్పర్ స్ప్రే దొరుకుతుంది. ఇది హ్యాండ్ బ్యాగులో ఉంటే మరీ మంచిది

  • నడిరోడ్డు మీదైనా సరే... ఏ మగాడూ మనను రక్షించడానికి రారని గుర్తుంచుకోవాలి 

     

     



No comments: