బాల సైంటిస్టులకు భలే ఛాన్సు
గూగుల్ సైన్స్ ఫెయిర్-2013
బాలల్లో సృజనాత్మకతను వెలికితీసే గూగుల్ సైన్స్ ఫెయిర్ - 2013 ప్రారంభమైంది. ప్రపంచాన్ని శక్తిమంతంగా మార్చే ప్రయోగాలను పిల్లల నుంచి ఆహ్వానిస్తున్నారు. ఇందులో 13 నుంచి 18 ఏళ్ల వయస్సు బాలబాలికలు పాల్గొనవచ్చు. ఏప్రిల్ 30వ తేదీలోగా ఆసక్తిగల చిన్నారులు తమ ప్రయోగాలను గూగల్కు ఆన్ లైన్ లో సమర్పించాలి. అమెరికా ఖండం నుంచి 30 మందిని, ఆసియా నుంచి 30 మందిని, యూరఫ్, ఆఫ్రికా ఖండాల నుంచి 30 మందిని ప్రాథమికంగా ఎంపిక చేస్తారు. ఫైనల్గా ౧౧ ప్రాజెక్టుల మధ్య తుది పోటీ జరుగుతుంది. గెలుపొందిన వారికి సెప్టెంబర్ 28న కాలిపోర్నియాలోని గూగుల్ ప్రధాన కార్యాలయంలో జరిగే కార్యక్రమంలో 50వేల అమెరికన్ డాలర్ల నగదు బహుమానం అందిస్తారు.సైన్స్ ప్రయోగాలంటే ఆసక్తి ఉన్న చిన్నారులకు ఇది మంచి అవకాశం.
మిగతా వివరాలకు...
www.googlesciencefair.com
No comments:
Post a Comment