Thursday 28 February 2013

2016లో టైటానిక్ 2

థ్రిల్లింగ్ జర్నీకి అడ్వాన్స్ బుక్కింగ్స్

పసిఫిక్ మహా సముద్రంలో సరిగ్గా నూటా ఒక్కేళ్ల క్రితం మునిగి పోయింది ప్రపంచంలోనే అతిపెద్దదైన ఓడ టైటానిక్. విలాసానికి ఇది అసలుసిసలు చిరునామా. బ్రిటన్లోని సౌంతాప్టన్ తీరం నుంచి అమెరికాలోని న్యూయార్క్ కు బయలుదేరిన టైటానిక్ అర్దరాత్రి వేళ  సముద్ర జలాల్లోని ఓ భారీ మంచు శకలం ఢీకొని మునిగిపోయింది. టైటానిక్ సినిమా చూశాక గానీ దాని గురించి మనకు పెద్దగా తెలియలేదు. అయితే ఆ సినిమా చూశాక టైటానిక్ లాంటి మహాద్భుత ఓడలో విహరించాలని చాలా మందే అనుకుని ఉంటారు. అలాంటి వారి కోసమే టైటానిక్ 2 షిప్ రెడీ అవుతోంది.

టైటానిక్ నమూనా నా సొంతం...!

     ఆస్ట్రేలియాకు చెందిన బిలియనీర్ క్లైవ్ పామర్ ఈ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టాడు. 2016 లో ఇది సిద్ధమవుతుంది. యూరప్ ఇంజనీర్లు డిజైనింగ్ చేస్తే  చైనాలో ప్రభుత్వ షిప్పింగ్ కంపెనీ దీన్ని తయారు చేస్తోంది. ఎంత ఖర్చవుతుందన్నది తెలియదు గానీ ఇందులో ప్రయాణించడానికి అప్పుడే బుకింగ్స్ మొదలయ్యాయిట. ఇప్పటికే 40 వేల మంది టిక్కెట్లు కొనేసుకున్నారు. ప్రమాదానికి గురైన నాడు ఒరిజినల్ టైటానిక్ ప్రయాణించిన సౌంతాప్టన్ నుంచి న్యూయార్క్ వరకూ టైటానిక్ 2ను నడుపుతారట. టిక్కెట్ కు పది లక్షలు పెట్టి ఔత్సాహికులు అడ్వాన్స్ బుకింగ్ చేసుకుంటున్నారు. ఆనాటి ట్రాజడీని గుర్తుచేసకుంటూ సరికొత్త థ్రిల్లింగ్ అనుభవించాలనుకునే వారు క్లైవ్ పామర్ అడ్రస్ కనుక్కోండి.


No comments: