Monday 18 February 2013

KIDS NEWS: Who is the Next Pop?

కొత్త పోప్ ఎవరు?

క్రిస్టియన్లలో రోమన్ క్యాథలిక్ల పవిత్ర థామం, మత గురువు నివసించే పీఠం-  వాటికన్ సిటీ. ప్రపంచం దృష్టి మొత్తం ఇటలీలోని స్వతంత్ర ప్రతిపత్తి ఉన్న ఈ ధార్మిక నగరం మీదే కేంద్రీకృతమైంది. అందుకు కారణం పోప్ బెనడిక్ట్ 16 తన పదవికి రాజీనామా చేయడమే. అయితే పోప్ వారసుడెవరనేది ఆసక్తికరమైన అంశం. 150 కోట్లకు పైగా రోమన్ కాథలిక్ క్రైస్తవులకు తదుపరి ఆరాధ్యుడెవరనేది చర్చ.

రోమన్ కాథలిక్ పవిత్ర ప్రాంగణం


  • 700 ఏళ్ల తర్వాత రాజీనామా చేసిన తొలి పోప్ బెనడిక్ట్ 16
  • క్రీస్తు శకం 1415లో జార్జి2 అనే పోపప్ తొలిసారి రాజీనామా
  • పోప్ స్థానంలో ఉన్న మత గురువు గతించిన తర్వాతే కొత్త పోప్ ఎంపిక
  • ఫిబ్రవరి 28 నుంచి బెనడిక్ట్ 16 రాజీనామా అమలు
  • మార్చి 31- ఈస్టర్ లోగా కొత్త పోప్ ఎంపికకు గడువు
  • 211 మంది కార్డినల్స్ లో 80ఏళ్లలోపున్న 117 మందికే పోప్ ను ఎంపిక చేసే అధికారం
  • ఐరోపాకు చెందిన 62 మంది కార్డినల్స్ దే కీలక పాత్ర
  • ప్రస్తుత పోప్ హయాంలో యూరప్లో 32 మందితో కలిపి 67 మంది కార్డినల్స్ నియామకం
  • 1978 తర్వాత ఇటలీ నుంచి పోటీపడుతున్న ఏంజెలో స్కోలా
  • బెనడిక్ట్ ఆశీస్సులున్న కెనడా కార్డినల్ మెర్క్ క్విల్లెట్
  • ఘనా నుంచి నల్లజాతీయుడు పీటర్ అప్పాటర్కసన్
  • కాథలిక్ కమ్యూనిటీ ఎక్కువగా ఉండే లాటిన్ అమెరికా నుంచి లియోనార్డో సాండ్రి
  • అమెరికాకు చెందిన తిమోతి డోలన్ పై అందరి దృష్టి
  • లౌకికవాద విస్తరణ, మతపరమైన సవాళ్లు ఎదుర్కొనేఆ కొత్త పోప్ ఎవరో...?
ఇక సెలవు...!

 

No comments: