Wednesday 27 February 2013

బడ్జెట్ బాతాఖానీ

చిదంబరం పెట్టెలో ఏముంది?

బడ్జెట్ అంటే రానున్న 365 రోజుల్లో మనం ఏమేమి ఖర్చులు పెట్టబోతున్నాం, దేనికెంత వెచ్చించాలన్న లెక్కాపద్దూ. చిదంబరం కసరత్తంతా పూర్తి చేసి కాగితాలు పెట్టెలో సర్దేసుకున్నారు. 28న లోక్ సభలో తెరుస్తారు. అయితే అందులో ఏముంటుందనేదే ఆసక్తి. 130 కోట్ల భారతీయులందరి తలరాత రాసేది చిదంబరం. కానీ ఆయన లెక్కాపద్దుల పుస్తకం గురించి ఆలోచించే తీరిక సగటు పౌరుడికి లేకుండాపోయింది.

ఎన్న సారువాడూ... ఏమిదా తెస్తివి?

 

      ఆర్ధిక సర్వే ఏం చెప్తోంది?

బడ్జెట్ సమర్పించడానికి ముందురోజు ఆర్ధిక సర్వే పార్లమెంటు ముందు పెట్టారు. ఆర్ధిక రంగం మందగమనం చాలించి పురోగమనం దిశగా సాగుతోందిట. ఇక వేగవంతమవడం ఖాయమంటారు మన మంత్రిగారు. సామాన్యుడి బతుకులు చూస్తుంటే ఇందులో ఏ మాత్రం నిజం లేదనిపిస్తుంది. సబ్సిడీలకు స్వస్తిపలకండి, పన్నుల మోత మోగించి ద్రవ్యలోటును పూడ్చుకోండి, సంస్కరణల పేరుతో ఆర్ధిక పొదుపు పాటించండి, ఖజానా ఖాలీచేస్తున్న సర్కారీ ఖర్చులు తగ్గించుకోండి... ఇలా సాగిపోయింది సర్వే లెక్క.

      2014 ఎన్నికలే టార్గెట్...సంక్షేమమనే బ్రాండ్

యూపీఏ 2 సర్కారు యూపీఏ 3గానూ కొనసాగాలంటే 2014 ఎన్నికల్లో పెద్ద గండమే గట్టెక్కాలి. డీజిల్ ధరల బాదుడు, ఎల్పీజీ సిలిండర్లపై పరిమితులు, నిత్యావసరాల రేట్లు మండిపోవడం, మహిళలపై హింసాకాండ... ఇలా సామాజిక, ఆర్ధిక సమస్యల చిట్టా చాలా పెద్దది. వీటన్నిటినీ అధిగమించి ఓటర్లను సమ్మోహన పరిచే అస్త్రం మన్మోహన్ సింగ్ దగ్గరైతే లేదు. అంతా టెన్ జన్ పథ్ నుంచి మేడమ్ ఆడించే గారడీయే. ఆహారం, ఎరువుల సబ్సిడీల్లో కోత పెట్టాలనేది ఆలోచన. గరీబుకు, రైతన్నకు ఇది దెబ్బే. రైల్వేకి బడ్జెటరీ సాయాన్ని బాగా తగ్గించేశారు. రక్షణ శాఖకు అరకొరగా విదులుస్తారు. అన్నీ ఉండి పాకిస్థాన్, చైనా లాంటి దేశాలకు భయపడాల్సిన పిరికితనం. ఇక రక్షణ శాఖ ఖజానా డొల్లగా మారితే దేశ సార్వభౌమత్వం ఏమిగాను? సంక్షేమమనే బ్రాండ్ వేసినా ఆచుతూచి ఖర్చుపెట్టుకోవాలని ప్రణాళిక సంఘం ముందునుంచే నూరిపోస్తోంది.

      ప్రభుత్వ రంగానికి విఘాతమే...

ప్రభుత్వ రంగ పరిశ్రమల్లో పెట్టుబడులను ఉపసంహరించేసి చకచకా ప్రైవేట్ వ్యక్తులకు ధారాదత్తం చేసే పని ఊపందుకుంటోంది. 40 వేల కోట్ల రూపాయల సర్కారు షేర్లను అమ్మేయాలన్నది లక్ష్యం. ఇలా ఒక్కోటీ ప్రయివేటీకరించేశాక సర్కారు వ్యవస్థ కేవలం సేవారంగానికే పరిమితమవుతుంది. కీలకమైన ఉత్పాదక, నిర్మాణ రంగాల నుంచి చేతులుదులుపుకుంటుంది.

      టాక్స్ నెట్ చాలా పెద్దది!

      పన్నులు పెంచడం లేదంటూనే పరోక్షంగా ముక్కు పిండి వసూలు చేసే టెక్నిక్కులు ఇటలీమాత దగ్గర పుష్కలంగా ఉన్నాయి. మరింత మందిని పన్ను పరిధిలోకి లాగేసేయండని ఆర్ధిక సర్వే కూడా పురిగొల్పింది

డ్జెట్ లైన్స్... 

  • డీజిల్, ఎల్పీజీల రేట్లు పెంచాలనుకుంటున్నారు.
  • సిమెంట్ మీద సుంకం పెంచితే ఇళ్లు కట్టి చూడటం కష్టసాధ్యమే.
  • బంగారు నగల మీద పన్ను మోత తప్పేట్లు లేదు.
  • చిన్న కార్లమీద జీవిత పన్ను 12 శాతం నుంచి 10 శాతానికి తగ్గించాలంటోంది ఆటోమోబైల్ రంగం
  • డీజిల్ వాహనాలు, రవాణా వాహనాల మీద సుంకం పెంచే ఛాన్స్
  • లెవీ, టాక్స్ భారం తగ్గించాలంటూ టెలికాం రంగం ఒత్తిళ్లు
  • పన్ను రాయితీలడుగుతున్న ఐటీ సెక్టర్
  • ప్రోత్సాహకాలు కోరుతున్న గృహ నిర్మాణ రంగం
  • రిటైల్ రంగం నుంచి పన్ను మినహాయింపు ఒత్తిళ్లు



No comments: