Saturday 17 May 2014

మోడీతో నితీష్ లడాయేంటి!

నరేంద్ర మోడీ ప్రధాని పీఠం ఎక్కే తరుణంలోనే బీహారులో రాజకీయ ముసలం రగులుకుంది. దేశంలోనే సమర్ధుడైన ముఖ్యమంత్రుల్లో ఒకరైన నితీష్ కుమార్ వికెట్ మోడీ హవాకి డౌన్ అయింది. మోడీని పీఎం గా ఏమాత్రం అంగీకరించని నితీష్ సీఎం పదవికి రాజీనామా చేశారు. తాజా ఎన్నికల్లో జేడీయూ వైఫల్యంతో ప్రత్యర్థుల నుంచి విమర్శల దాడి పెరగడమే ఆయన వైదొలగడానికి కారణం. http://www.aptopnews.com/

బీహారులో 40 పార్లమెంటు సీట్లుంటే బీజేపీ 22 స్థానాలు సొంతం చేసుకుంది. బీజేపీ మిత్రపక్షమైన రాంవిలాస్ పాశ్వాన్ పార్టీ ఎల్జేపీకి 6 సీట్లు వచ్చాయి. జేడీయూకి కేవలం రెండు స్థానాలే మిగిలాయి. ఎన్డీయేకి దూరమవడం వల్లే ఓటమి పాలయ్యామంటూ నితీష్ ప్రత్యర్థులు విమర్శలు మొదలెట్టారు. నితీష్ సీఎం పదవి నుంచి వైదొలగాలని కొందరు.. ఒకటి రెండు నెలల్లో సర్కారు పడిపోవడం ఖాయమంటూ మరికొందరు కామెంట్లు చేశారు. దీంతో మనస్థాపం చెందిన నితీష్ రాజీనామాకు సిద్ధపడ్డారు. అయితే ఈ పరిణామం వెనుక పన్నెండేళ్ల విభేదాల కథ ఉంది.     http://www.aptopnews.com/
అసలు మోడీ, నితీష్ లడాయి ఎప్పటిది..? ఇద్దరి మధ్య గొడవ ఎప్పటి నుంచీ నడుస్తోంది..? మోడీని బీజేపీ ప్రధాని కేండిడేట్ గా ప్రకటించిన తక్షణమే ఎన్డీయే కూటమి నుంచి జేడీయూ ఎందుకు వైదొలిగింది..? తాజా ఎన్నికల్లో బీహారులోని లాలూ ప్రసాద్, నితీష్ కుమార్ కోటలకు బీజేపీ ఎలా గండికొట్టింది..? మోడీ, నితీష్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనడానికి కులాల చిచ్చే కారణమా..?
మోడీ, నితీష్ కులాల చిచ్చుపై పూర్తి కథనం.. http://www.aptopnews.com/

No comments: