Tuesday 13 May 2014

మోడీ వారసురాలు!

నరేంద్ర మోడీ ఢిల్లీ బాట పడితే గుజరాత్ రాష్ట్ర సీఎం ఎవరన్న దానిపై చర్చ జరుగుతోంది. ఎన్నికల ప్రచారం ముగిసి ఫలితాలు రావడానికి కొంత విరామం ఉన్నందువల్ల మోడీ గుజరాత్ రాజకీయాలపై ద్రుష్టి పెట్టారు. తన వారసత్వాన్ని ఎవరి చేతుల్లో పెట్టాలన్నదానిపై సహచరులతో మంతనాలు జరుపుతున్నారు. http://www.aptopnews.com/

నాలుగేళ్ళుగా అనుకున్నట్లే సెకండ్ కమాండ్ ఆఫ్ గుజరాత్ ఆనందీ బెన్ జెతాభాయ్ పటేల్ (73) పేరు బాగా వినిపిస్తోంది. మోడీ వారసురాలు దాదాపు ఆనందీయే.

పాలనా సమర్ధత.. రాజకీయ అనుభవం,. కొన్ని వివాదాలు.. కలగలిసిన మహిళే ఆనందీ బెన్. 1941లో జన్మించిన ఆమె ప్రస్తుతం గుజరాత్ రాష్ట్ర రెవెన్యూ మంత్రి.

స్కూల్ టీచర్ నుంచి 1987లో రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. బిజేపీ మహిళా మోర్చా ప్రెసిడెంట్ గా పని చేశారు. 1994లో రాజ్య సభ ఎంపీగా.. 1994 నుంచి ఎమ్మెల్యేగా పని చేస్తున్నారు. గుజరాత్లో నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన మహిళా నేత ఆనందీ బెన్ ఒక్కరే. మోడీ సర్కార్లో డిఫాక్టో సీఎంగా పని చేస్తున్నారనే  విమర్ష ఉంది.

గుజరాత్ మెహసాన జిల్లాలోని ఓ కుగ్రామంలో రైతు కుటుంబంలో జన్మించిన ఆనందీ బెన్ ఎమెస్సీ బీఎడ్ చదివారు. టీచరుగా పనిచేస్తూ మోడీ ప్రోత్సాహంతో రాజకీయాల్లో అడుగు పెట్టారు. 1965లో భర్త మఫత్ లాల్ పటేల్ తో కలిసి అహ్మదాబాద్లో స్థిరపడిన  ఆమె అంచెలంచెలుగా పైకి ఎదిగారు.

20 ఏళ్ళ క్రితమే భర్తతో విడిపోయారు. ఆమె భర్త మఫత్ లాల్ కొంతకాలంగా మోడీ పై రాజకీయంగా పోరాటం చేస్తున్నారు. తన భార్యను రాజకీయాల్లోకి తీసుకొచ్చి తనకు కాకుండా చేశారనేది మఫత్ లాల్ ఆవేదన.  మోడీ అవినీతి పరుడంటూ మఫత్ లాల్ ఆరోపణలు చేస్తుంటారు. వాజపేయి ప్రధానిగా ఉన్నప్పుడు అనేక దఫాలు లేఖలు కూడా రాశారు. ప్రస్తుతం ఆయన ఆం అద్మీ పార్టీ లో చేరారు. భర్త చేసే ఆరోపణలే కాకుండా ఆనందీ బెన్ వ్యవహార శైలిని విమర్షించే వాళ్ళూ ఎక్కువే.

చదువుకునే వయసులోనే ఆనందీ బెన్ అనేక సాహసాలకు సిద్ధపడ్డారు. టీచరుగానూ అనేక ఆవార్డులు అందుకున్నారు. అసలు రాజకీయాల్లోకి రావడమే ఓ సాహసంతో మొదటి అడుగు పడింది. స్కూల్ టీచరుగా ఉన్నప్పుడు పిల్లలతో  కలిసి విహర యాత్రకు వెళితే నర్మద సరోవర్ డ్యాంలో ఇద్దరు అమ్మాయిలు మునిగిపోయారు. దీంతో వారి సమ్రక్షకురాలిగా ఉన్నా ఆనంది బెన్ వెంటనే నీళ్ళలోకి దూకి ఆ ఇద్దరినీ కాపాడారు. బాల్యం లోనే ఆటలు, ఇతర సామాజిక కార్య కలాపాల్లో పాల్గొన్న అనుభవం ఆమెకు గుర్తింపు తెచ్చిపెట్టింది. ఈ సాహసం గురించి తెలిసిన బీజేపీ నేతలు వెంటనే ఆమెను రాజకీయాల్లోకి అహ్వానించారనేది ఓ కధనం.

ఇప్పుడు రెండు దశాబ్ధాల అనుభవంతో గుజరాత్ లాంటి అతిపెద్ద రాష్ట్రానికి  మహిళా ముఖ్యమంత్రి రేసులో ఉన్నారు. మోదీ సర్కార్లో పేరుకు రెవెన్యూ మంత్రే అయినా ఆనందీ బెన్ మిగతా శాఖల వ్యవహారాలు కూడా సమీక్షిస్తుంటారు. అందుకే ప్రత్యర్ధులు ఆమెను డిఫాక్టో సీఎం అని వ్యంగ్యంగా అంటుంటారు. ఇప్పుడు ఆ మాటే నిజం అయ్యేట్లుగా ఉంది!    http://www.aptopnews.com/                                         

No comments: