Tuesday 20 May 2014

బెజవాడే కొత్త రాజధాని?

ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని నగరం బెజవాడేనా..? ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు బెజవాడకే ఓటేశారా..? ఆ పార్టీలోని సీనియర్ నేతలు విజయవాడ కోసం జోరుగా లాబీయింగ్ మొదలెట్టారా..? ఎన్టీఆర్ ట్రస్టు వర్గాలు అవుననే అంటున్నాయి. విజయవాడ పరిసరాల్లోనే రాజధాని అభివృద్ధి చేయాలన్న ఆలోచనతో ఉన్నారు చంద్రబాబు. గుంటూరు, విజయవాడల మధ్య భవిష్యత్తు సింగపూరుకు పునాది వేస్తే తెలుగుదేశం పార్టీకి ఇక ఢోకా ఉండబోదన్నది ఆలోచన. ఈ రెండు జిల్లాలతో పాటు ఉభయ గోదావరి జిల్లాల్లోనూ పార్టీకి తిరుగులేని ఆధిపత్యం వస్తుంది. ఈ ఎన్నికల్లో ఈ నాలుగు జిల్లాలు సైకిల్ స్పీడుకు దోహదపడ్డాయి. అయితే కొత్త రాజధాని నిర్మాణానికి ఇంకా టైమ్ ఉన్నందున బెజవాడ ప్రతిపాదనపై చంద్రబాబు సన్నిహితులతో మంతనాలు సాగిస్తున్నారు. 2019 అసెంబ్లీ ఎన్నికల నాటికి రాజధాని అంశాన్ని ప్రధాన అజెండాగా మార్చాలన్నది చంద్రబాబు ఎత్తుగడ. సీమాంధ్రను సింగపూర్ గా మారుస్తామన్న హామీతో ఈసారి ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. వచ్చే ఎన్నికల నాటికి రాజధాని అంశాన్ని తెర మీదకు తెస్తారు. అయితే రాజధాని ఎంపికపై ఇప్పటికే కేంద్ర బృందం పర్యటనలు జరుపుతోంది. ఏడెనిమిది ప్రాంతాల నుంచి ప్రతిపాదనలు వచ్చాయి. వాటి సాధ్యాసాధ్యాలను అధికార బృందం పరిశీలన జరుపుతోంది.http://www.aptopnews.com/

No comments: