Monday 12 May 2014

ఇంట గెలవలేని ‘మౌన’మోహన్

ఇంట గెలవలేనమ్మ  రచ్చ గెలిచినట్లుంది ప్రధాని మన్మోహన్ సింగ్ పరిస్థితి. వరుసగా రెండు దఫాలుగా యూపీఏ సర్కార్లను గట్టెక్కించిన ఆయనకు విపక్షాలు ‘మౌన’మోహన్ సింగ్ అన్న బిరుదు తగిలించారు. స్వతహాగా మేధావి, ఆర్ధిక నిపుణుడూ అయిన మన్మోహన్ దేశానికి నిస్సందేహంగా సేవలందించారు. 1991లో అప్పటి ప్రధాని పీవీ నరసింహారావు అమల్లోకి తెచ్చిన ఆర్ధిక సరళీకరణ విధానాల రూపకల్పనలో మన్మోహన్ పాత్రను ఎవరూ తోసిపుచ్చలేరు. కానీ అతుకుల బొంత లాంటి యూపీఏ ప్రయోగంలో చెడంతా ఆయన ఖాతాలో పడింది. తెర వెనకుండి నడింపించిన సోనియా గాంధీ ప్లస్ పాయింట్లను సొంతం చేసుకుని.. మైనస్ పాయింట్లన్నీ సింగ్ వైపు డైవర్ట్ చేశారు. 2004 నుంచి పదేళ్ల పాటు కాంగ్రెస్ పెద్దల వైఫల్యాలకు ఆయన బాధ్యుడయ్యారు. నిందలన్నీ భరించారు.ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యే తరుణంలో ఆయన తన అధికార నివాసం ఖాళీ చేసేందుకు రెడీ అవుతున్నారు. ఇప్పటికే సెవన్ రేస్ కోర్స్ రోడ్డు లోని మన్మోహన్ నివాసంలో సర్దుడు కార్యక్రమం పూర్తయింది. వీడ్కోలుకూ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈనెల 14న సోనియా గాంధీ విందు కూడా ఇవ్వబోతున్నారు. 16న ఫలితాలు వచ్చాక ఆ మరుసటి రోజు ప్రధాని వైదొలుగుతారు. ఇంతటితో రిటైర్మెంటు తీసుకుంటున్నట్లు గతంలోనే ఆయన ప్రకటించారు. http://www.aptopnews.com

No comments: