Thursday 1 May 2014

ఎర్ర సిరా చుక్కలు

శ్రమైక జీవన సౌందర్యానికి సమానమైనది లేనేలేదని ఘంటాపథంగా ప్రకటించిన అభ్యుదయవాది, మహాకవి శ్రీశ్రీ... సహస్రవృత్తులు, సమస్త చిహ్నాలు కవిత్వానికి ప్రాణమని దండోరా వేశాడు. కార్మిక లోకపు కల్యాణానికి... శ్రామిక లోకపు సౌభాగ్యానికి... సమర్పణంగా, సమర్చనంగా శ్రీశ్రీ రాసిన కవితలు వేల మంది యువకవులకు స్పూర్తినిచ్చాయి. వేనవేల ప్రజాగాయకులకు స్పృహనందించాయి.  సామ్రాజ్యవాద దురాక్రమణ పంథాను ప్రతిఘటించిన కలం వీరులు ఎన్నో ఎర్ర సిరా చుక్కలు ధారపోసి కవిత్వాలకు అక్షరాలు పేర్చారు. కార్మిక, శ్రామిక వర్గ పోరాటాలకు సంఘీభావం చాటుతూ ఎందరో విప్లవ గళాలు సవరించుకుని జనగీతాలకు పల్లవులై నిలిచారు. మేడే అంటే అన్యాయాలను, అక్రమాలను, దోపిడీలను, దురంతాలను ధిక్కరించిన రోజు. కవులు, కళాకారులు ముక్తకంఠంతో దిక్కులు పిక్కటిల్లేలా నినదించిన రోజు.http://www.aptopnews.com/


కార్మికుడు, కర్షకుడు చేతులు జోడించే స్థాయి నుంచి పిడికిళ్లు బిగించేలా పోరాట మార్గాన్ని చూపించింది మేడే. ప్రపంచ కార్మికులారా... ఏకం కండి! అన్న పిలుపుతో శ్రమజీవులందరూ ఒక్కతాటి మీద నడిచారు. పోరాటమనే ఆయుధాన్ని అందుకున్నారు. బానిస సంకెళ్లను తెంచుకునే సాహసాన్ని, శక్తిని సమకూర్చుకున్నారు. ఒకే పర్వదినం ప్రపంచం నలుమూలలా ఒకేరోజు జరుపుకుంటారంటే అది ఖచ్చితంగా 'కార్మికుల దినోత్సవం' అవుతుంది.http://www.aptopnews.com/

No comments: