Saturday 17 May 2014

ఆడపిల్ల.. ఆరున్నరవేల ఫొటోలు

ఫొటో అంటే చెరిగిపోని తీపిగుర్తు. జీవితంలోని ప్రతి ఘట్టాన్ని కెమెరాలో బంధిస్తే తరతరాలకూ ఆ జ్ఞాపకాలు పదిలంగా ఉంటాయి. బ్రిటన్ లో నివసిస్తున్న ఓ ప్రవాస భారతీయ కుటుంబం మనిషి జీవితంలో ఫొటోగ్రఫీకి ఉన్న ప్రాధాన్యాన్ని గుర్తించింది.http://www.aptopnews.com/

 లండన్ దగ్గరున్న కెంట్ వాసి మునీష్ బన్సల్ అక్కౌంటెంట్. తమ కుమార్తె సుమన్ బన్సల్ ప్రతి కదలికనూ కెమెరాలో ఒడిసిపట్టారు. పాప తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఆల్ట్రాసౌండ్ స్కాన్ దగ్గర నుంచే ఫొటో గ్రఫీ మొదలైంది. ఇప్పుడామెకు పద్దనిమిదేళ్లు. చిన్నారి సుమన్ చిట్టి చిట్టి అడుగులు వేసినప్పటి నుంచి ఉరుకులు పరుగుల జీవితంలో ప్రతి డెవలప్ మెంటునూ ఆ తండ్రి ఫొటోగా మార్చారు.

1996 మేలో జన్మించిన సుమన్ ఫొటోలు ఇప్పటి దాకా 6575 దాటేశాయి. సో.. మీరూ ఇలాంటి హాబీ పెట్టుకుంటే బాగుంటుందేమో ఆలోచించండి! http://www.aptopnews.com/

No comments: