Wednesday 7 May 2014

అతడు.. ఆమె.. తొలి వోటు!

స్వతంత్ర భారతదేశంలోని తొలి వోటరు శ్యాం శరణ్ నేగీ 30వ సారి వోటు హక్కు  వినియోగించుకున్నాడు. 97 ఏళ్ళ వయసులోనూ ఏమాత్రం ఉత్సాహం తగ్గలేదు.

http://www.aptopnews.com/
తన భార్య 92 ఏళ్ళ హీరా మణి తో కలిసి ఉదయం 6.55 కే పొలింగ్ బూత్ ముందు నిలుచున్నాడు. అందరికన్నా ముందుగా వోటు వేసి తనలో 46 ఏళ్ళుగా ఉన్న ప్రజా స్వామ్య స్పూర్తిని మరోసారి చాటుకున్నడు. 1952 ఫిబ్రవరిలో  స్వతంత్ర భారతదేశంలో తొలి సారి ఎన్నికలు జరిగితే నేగీ సొంత రాష్ట్రమైన హిమాచల్ ప్రదేశ్ లో 3 నెలల ముందుగానే  1951 అక్టోబర్లో పోలింగ్ నిర్వహించారు. అప్పట్లో చిన్ని పేరుతో ఉన్న ప్రస్తుత కిన్నౌర్ నియోజక వర్గంలో నేగీయే తొలి వోటరు. ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా 1975లో రిటైర్ అయిన నేగీ ఇప్పటి దాకా 17 పార్లమెంట్(ఒకసారి ఉప ఎన్నిక), 13 అసెంబ్లీ ఎన్నికల్లో వోటు వేశాడు. తన భార్య కూడా ఏనాడు వోటు వేయడం మరువదు. దేశంలోని తొలి వోటరుగా గుర్తింపు పొందిన శ్యాం శరణ్ నేగీ  తో 2014 ఎన్నికల కోసం ఓ ప్రచార చిత్రం రూపొందించారు. ఆ వీడియోను నెటిజనులు  బాగా ఆదరించారు. సెంచరీకి చేరువలో ఉన్నా నవ యువకుడిలా లయిన్లో నిలబడి వోటు వేసిన నేగీకి... ఆయన సతీమణి హీరా మణికి  నూటా ముప్పై కోట్ల భారతీయులూ  అభినందనలు తెలపాల్సిందే...! http://www.aptopnews.com/  

No comments: