Saturday 3 May 2014

షారూఖ్ కొడుకు.. శ్రీదేవి కూతురు!

బాలీవుడ్ లో రికార్డులు నమోదు చేసిన ‘ఆషికీ’ సిరీస్ లో ఈసారి సరికొత్త జోడీ కనిపించబోతోంది. సూపర్ స్టార్ షారూఖ్ ఖాన్ వారసుడు ఆర్యన్ ఇందులో హీరో. ఇక హీరోయిన్ ఛాన్సు అందాల తార శ్రీదేవి కూతురు జాహ్నవికి దక్కుతుందని సమాచారం. జాహ్నవి, ఆర్యన్ జంటగా ‘ఆషికి 3’ సినిమాను తెరకెక్కించేందుకు పదిహేనేళ్ల యంగ్ డైరెక్టర్ వీర్ హిరానీ సిద్ధమవుతున్నాడని బాలీవుడ్ టాక్. ప్రముఖ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీ వారసుడైన వీర్ ప్రస్తుతం ఓ డాక్యుమెంటరీ చేస్తున్నాడు. ఆషికీ మొదటి రెండు సినిమాలను డైరెక్ట్ చేసింది మహేష్ భట్, మోహిత్ సూరి. ఆషికీ 2 ఆదిత్య కపూర్, శ్రద్ధా కపూర్ జోడి కెరీరును మలుపు తిప్పింది. ఇక ఆషికి 3 కూడా షారూఖ్, శ్రీదేవి వారసులకు కెరీర్ లాంఛింగ్ ప్యాడ్ లా ఉపయోగపడుతుందని అంచనా.

సినిమా కబుర్లుhttp://aptopnews.com/tv-cinema-news

 http://aptopnews.com/tv-cinema-news

No comments: